Sunil Ambekar |
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శాఖల కార్యక్రమాలను మెరుగుపరచడం, నూతన క్రీడల ప్రయోగంపై అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్‌లో చర్చిస్తామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
ఝార్ఖండ్‌లోని రాంచిలో నిర్వహిస్తున్న ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ గురించి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంఘ పని దృష్టికోణంలో కార్యవిభాగాలపై చర్చ ఉంటుందని, సంఘలో శారీరిక్, బౌద్ధిక్ విభాగాలకు సంబంధించి ఏవైతే శాఖా కార్యక్రమాలు ఉన్నాయో.. వాటి పురోగతిపై చర్చిస్తామని సునీల్ అంబేకర్ తెలిపారు.
అలాగే సేవా విభాగానికి సంబంధించి, దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు సంబంధించిన శిక్షణ ఉంటుందని తెలియజేశారు. శాఖలోని సేవా విభాగం ద్వారా ఆయా ప్రాంతాలకు ఎలా చేరాలనే దిశగా చర్చించడం జరుగుతుందని, సంఘలోని వివిధ విభాగాలైన సంపర్క విభాగ్, ప్రచార విభాగ్ మొదలైన వాటన్నింటిపై ఇక్కడ విస్తృతంగా చర్చిస్తామని అన్నారు.
__vskts