Karnataka Govt renamed Ramanagara |
కాంగ్రెస్‌కి రాముడంటే పడదా? రామనగర పేరు మార్చేసిన కర్ణాటక సర్కారు
కాంగ్రెస్ పార్టీకి కొన్ని కోట్ల మంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడంటే ఏమాత్రం ఇష్టం లేదన్నట్లు ప్రస్ఫుటమైపోతోంది. ఎన్నికల సమయంలోనూ.. లేదంటే ఏ సమయంలోనైనా రాజకీయంగా లాభం పొందడానికి తాము కూడా హిందువులమే అంటూ గుళ్లు, గోపురాలు తిరగడం, గంధాలు, విభూతులు రాసుకోవడం.. చేస్తున్నా... అది క్షేత్ర స్థాయిలో మాత్రం తద్భిన్నంగా కాంగ్రెస్ వ్యవహారం చేస్తోంది. కాంగ్రెస్ నేతలెవరో చేస్తే.. వేరు మాట.. సాక్షాత్తూ ఆ పార్టీ యువనాయకుడు అంటూ పేరొందిన రాహుల్ గాంధీయే ఇలా చేస్తుంటారు. కానీ... రాముడు పేరు వచ్చిన ప్రతి సారీ.. కాంగ్రెస్ అదో రకంగా వ్యాఖ్యలు చేస్తుంది. రయ్‌మంటూ... ఒంటికాలితో పైకి లేస్తుంది.
అంతేందుకు... అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీ రాముడి అక్షతలను ప్రతి హిందూ కుటుంబానికి చేర్చాలని శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపునిచ్చింది. అయితే.. ఇవి అయోధ్య శ్రీరాముడి అక్షతలు కావని, కంట్రోల్ బియ్యమంటూ కాంగ్రెస్ హిందువుల మనోభావాలను తీవ్రంగా బాధిస్తూ... వ్యాఖ్యలు చేశారు.
తాజాగా... కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. పదే పదే తాము కూడా హిందువులమేనని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు కర్నాటకలోని రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా పేరు మారుస్తూ అక్కడి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పైగా... ప్రజల డిమాండ్ ప్రకారమే ఈ నిర్ణయమంటూ ప్రకటించింది. విడ్డూరం ఏమిటంటే... రామనగర జిల్లా అన్న దానిని ఎవరు మార్చమని అడిగారు? హిందువులకు రాముడంటే పడదా? అలా కాదే... మరి ఏ వర్గం డిమాండ్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి. జిల్లా పేరు మాత్రమే మారుతుందని, మిగిలినవన్నీ యథాతథంగానే వుంటాయని మంత్రి హెచ్‌కే పాటిల్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Courtesy : vsktelangana