Hindus are prone to violence, hatred and untruth: Congress MP Rahul Gandhi in Parliament
హిందువుల గురించి అమెరికాలో రాహుల్ గాంధీ ఏమన్నాడో తెలుసా?
విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు అలోక్ కుమార్ |
‘जो अपने आप को हिंदू कहते हैं वो 24 घंटे हिंसा करते हैं।’
— BJYM (@BJYM) July 1, 2024
-राहुल गाँधी pic.twitter.com/9AYUEicZBt
పార్లమెంట్లో రాహుల్ నాటకీయంగా మాటల దాడికి పాల్పడ్డారని, హిందూ సమాజం ఎప్పుడూ శాంతి మార్గంలోనే వుందని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు అలోక్ కుమార్ అన్నారు. విపక్ష నేత హోదాలో రాహుల్ తనని తాను నిరూపించుకునే జోష్‌లోనే ఈ వ్యాఖ్యలు చేశారని, ఈ జోష్‌లోనే హిందువులు హింసా ప్రవృత్తి గలవారని వ్యాఖ్యానించారన్నారు. ధర్మప్రచారంలో గానీ, తిరిగి ధర్మంలోకి హిందువులను తీసుకొచ్చే సమయంలోనూ హిందువులు హింసా మార్గంలో నడవలేదని స్పష్టం చేశారు. హిందూ సన్యాసులు దేశమంతా కాలినడక పర్యటించే సమయంలోనూ ప్రేమ, కరుణ, భక్తి, తర్కంతోనే ప్రజలను హిందువులుగా మార్చారని గుర్తు చేశారు. కానీ.. నిండు సభలో రాహుల్ హిందువుల విషయంలో ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదన్నారు.
స్వాతంత్రం అనంతరం నుంచి కాంగ్రెస్‌లో ఇదే తంతు కొనసాగుతోందని, ముస్లింలు ముస్లింలుగా వుండాలి, క్రిస్టియన్లు క్రిస్టియన్లలాగే వుండాలి.. హిందువులు మాత్రం సెక్యులర్‌గా వుండాలని అంటున్నారని మండిపడ్డారు. ఇదే లౌకికవాదానికి కాంగ్రెస్ ఇచ్చే నిర్వచనమని దెప్పిపొడిచారు. గతంలో రాహుల్ గాంధీ అమెరికాకి వెళ్లి, జిహాదీ ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా కాషాయ ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకారులంటూ వ్యాఖ్యానించారని, ఈ కాషాయ ఉగ్రవాదం పేరిట కాంగ్రెస్ వారు అనేక మందిపై కేసులు కూడా మోపారని గుర్తు చేశారు. అయితే.. వీటికి ఎలాంటి ఆధారాల్లేవన్నారు. హిందువులను అవమానించడం, టార్గెట్ చేయడం ద్వారా వారికి ఓట్లు దొరుకుతాయనుకోవడం తప్పుడు భావన అని, అదే గనక నిజమైతే 99 సీట్లు 100 నుంచి వచ్చినవి కావని, 543 నుంచి వచ్చాయని అలోక్ కుమార్ గుర్తు చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారి ప్రత్యర్థులు సాధించిన సీట్లకి చాలా దూరంలోనే వుందని చురకలంటించారు.
Courtesy : Vhp, twitter, vsktelangana