Bengal: In a shocking incident, a woman was stripped, beaten and dragged for a kilometre on the road for supporting the BJP. |
బెంగాల్ లో రోసోనారా ఖాతున్ ఒక ముస్లిం. ఆమె బీజేపీ మైనారిటీ మోర్చా సభ్యురాలు. అది చాలు. ఆమెను వివస్త్రను చేసి, కొట్టి, రోడ్డుపై కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి, స్పృహ కోల్పోయినప్పుడు మాత్రమే ఆమెను వదిలారు. ఆమెను ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నట్లుగా ఇది బిజెపి పాలిస్తున్న మణిపూర్ లో కాదు... మరియు....జరిగింది సెక్యులర్ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ లో... మరీ ముఖ్యంగా ..సెక్యులర్ స్త్రీ ముఖ్యమంత్రి గా ఉన్న బెంగాల్ లో..
నష్టం జరిగింది మైనార్టీ స్త్రీ కి అయినా...ఆమె బిజెపి సభ్యురాలు కాబట్టి ఆమెను ముస్లిం మైనారిటీ గా గాని ....కనీసం స్త్రీ గా కూడా మన ఉదార వాదులు లెక్క బెట్టలేదు.
FIR |
ఇంకా విచిత్రం ఏమిటంటే, ఈ సంఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు."ఆ సంఘటన సమయంలో చిరిగిపోయిన ఆమె దుస్తులు సాక్ష్యంగా కావాలి, వాటిని తమకు సమర్పించమని పోలీసులు అడిగారు" అయితే, ఆ స్త్రీ రోడ్డు మీద దాదాపుగా నగ్న స్థితిలో నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నప్పుడు ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చూసారు. ఈ విషయాన్ని ఎఫ్ఐఆర్లో స్పష్టంగా పేర్కొన్నా, మళ్లీ బాధితురాలుని తన దుస్తులు సాక్ష్యంగా ఇవ్వమని పోలీసులు కోరడం దారుణం.
చూడబోతే, ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కేసు తీవ్రతను తగ్గించడానికి ఇటువంటి అవమానకరమైన మరియు అసహ్యకరమైన పనులు చేస్తూ బాధితురాలిని భయపెట్టడానికి చూస్తున్నట్లు ఉంది. బెంగాల్ లో పరిస్థితి ఇంత దారుణంగా వున్నా, మమతని ఆమె "సెక్యులర్ కవచ కుండలాలు" రక్షిస్తున్నాయి. అందుకే మాణిపూర్ సంఘటన మీద బక్కెట్లు బక్కెట్లు గా కన్నీరు కార్చిన ఉదార వాద స్త్రీలు కూడా బెంగాల్ సంఘటన మీద పెదవి విప్పడం లేదు. ఇటువంటి ఉదారువాదుల రక్షణ ఉంటుంది అనే, ఈ రాజకీయ దోపిడీ దౌర్జన్య ముఠా సభ్యులు సెక్యులర్ కవచం సంపాదించడం కోసం అన్ని తాపత్రయాలు.
....చాడా శాస్త్రి....