లవ్ జిహాద్ బారిన పడిన ఆంధ్రా కు చెందిన బాధితురాలు తేజస్విని తొమ్మిది నెలల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కల్పించుకోవడం వల్ల జమ్మూ నుంచి రక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరానికి చెందిన శివకుమారి, ప్రభాకర్‌రావు దంపతుల కుమార్తె తేజస్విని మాచవరంలో చదువుకుంటోంది. ఆమె సీనియర్, విజయవాడకు చెందిన అమ్జాద్ ఈ హిందూ యువతిని ప్రేమించుకున్నారు. 2023 అక్టోబర్ 28 రాత్రి పరారీ అయ్యారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమీ ఫలితం కనిపించలేదు.
నిందితుడు అమ్జాద్ |
బాలిక అదృశ్యమైన తొమ్మిది నెలల తర్వాత గత నెల జూన్ 22న ఆ అమ్మాయి తల్లి శివకుమారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి సహాయం అర్ధించారు. పోలీసులతో పవన్ మాట్లాడడం తో పోలీసులు తేజస్విని ఆచూకీ కోసం ఓ ప్రత్యేక టీమ్‌ని ఏర్పాటు చేశారు.
లవ్ చేసిన వాడు ఆ అమ్మాయి ఇంటికి సమాచారం ఇవ్వకుండా ఆ హిందూ యువతిని హైదరాబాద్‌కు తీసుకువెళ్లాడు. అతని వద్ద డబ్బు లేకపోవడంతో వారి మొబైల్ ఫోన్లు మరియు తేజస్విని బంగారు ఆభరణాలను అమ్మేశారు. అమ్జాద్ చివరకు జమ్మూ చేరుకోవడానికి ముందు ఆ బాధిత యువతిని కేరళ, ముంబై మరియు ఢిల్లీకి తీసుకెళ్లాడు.
అమ్జద్ జమ్ము లో హోటల్లో దిగినా తేజస్విని కి మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించాడు. కానీ, ఒకరోజు, అమ్జాద్ దూరంగా ఉన్నప్పుడు, తేజస్విని తన అక్కకు ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పంపింది. ఈ చిన్న క్లూ ఆధారంగా బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన ఆంధ్రా పోలీసులు జమ్మూ పోలీసులకు సమాచారం అందించారు. జమ్మూ పోలీసులు వారు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ఈరోజు విజయవాడకు తరలిస్తున్నారు.