Jharkhand Sarkar distributing money of Vanavas to Christians |
వనవాసుల డబ్బులను క్రిస్టియన్లకు పంచుతున్న జార్ఖండ్ సర్కార్.. మండిపడుతున్న హిందువులు
జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అక్కడ తీవ్ర చిచ్చు రేపుతోంది. ‘‘జార్ఖండ్ ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజన’’ పేరుతో తీర్ధయాత్ర కోసం క్రిస్టియన్ల నుంచి అక్కడి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటగా నమోదు చేసుకున్న వారికే మొదటగా అవకాశం అంటూ పోటీ తీవ్రతరం చేసే నిర్ణయాన్ని కూడా తీసుకుంది. జూన్ 22 న ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషనÊ ప్రకారం అత్యంత పేదరికంలో వున్న క్రిస్టియన్లు జూన్` జూలై మాసంలో గోవా యాత్ర కోసం దరఖాస్తులను సమర్పించాలి. మొత్తం 88 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు ఎంపికయ్యారు.
దీనిని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జార్ఖండ్ ముక్తిమోర్చా ప్రభుత్వం గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, అలాగే నిధులను దుర్వినియోగం కూడా చేస్తోందని తీవ్రంగా మండిపడుతోంది. విశ్వహిందూ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తీవ్రంగా స్పందించారు. వనవాసుల యొక్క సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడ్డ అక్కడి ప్రభుత్వం... వనవాసుల యోగ క్షేమాలు వదిలేసి, మిషనరీలపై డబ్బును వృథా చేయడంలో బాగా బిజీ అయిపోయిందని దెప్పిపొడిచారు. ఓ లౌకిక ప్రభుత్వం కేవలం క్రిస్టియన్ల కోసం ఇలా చేయడం సరైన పద్ధతేనా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. వనవాసీల సొమ్మును క్రైస్తవ సమాజం కోసం ధారాదత్తం చేయడమేంటని ప్రశ్నించారు. ఒక వేళ యాత్ర అంటూ తీయాల్సి వస్తే వనవాసీలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యాత్రలు తీయాలని, అందులో భగవాన్ బిర్సాముండా, తాంత్యా భీల్ తిలక్ మాంరీa, తులక్కల్ చంతు, బుధు భగత్, కన్హూలతో సంబంధం వున్న పవిత్ర స్థలాలు దర్శించేలా ప్రభుత్వం యోజన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతేకాకుండా అసలు జార్ఖండ్‌కి, గోవా చర్చిలకు వున్న సంబంధమేమిటో చెప్పాలని వినోద్ బన్సల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మతమార్పిళ్లను ప్రోత్సహించడానికే ఈ యాత్రనా? అంటూ ఆయన సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసే ఖర్చు అంతా వనవాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ఆయన సూచించారు.