హిందుత్వం బలపడితే భయమెందుకు! |
ఈ సాధారణ ఎన్నికల్లో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో హిందుత్వంపై తీవ్రస్థాయిలో విషం కక్కుతున్నాయి.
ఇది ముమ్మాటికి సరికాదు. ఈ దేశ అస్తిత్వాన్ని, మెజారిటీ ప్రజల మనోభావాలను కాలరాసే విధంగా మాట్లాడటం, వ్యంగంగా చలోక్తులు విసరడం, హిందుత్వంపైనా అయోధ్య రామ మందిరంపైనా విమర్శలు గుప్పించడం దుర్మార్గం. ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్దపీట వేస్తూ, హిందువుల గుండెలపై గునపాలు దించే స్థాయిలో తీవ్ర పదజాలాన్ని ఉపయోగించడం ఏ మాత్రం భావ్యం కాదు. అసలు హిందుత్వం బలపడితే ఈ నేతలకు భయం ఎందుకు?
హిందుత్వం బలపడితే తమ మనుగడ ప్రశ్నార్థకం అనే బెంగ బలంగా పట్టుకున్నట్టు ఉంది. అందుకే అవకాశం వచ్చిన ప్రతి సందర్భాన్నీ ఉపయోగించుకొని, హిందుత్వాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందుకు బదులుగా సెక్యులర్ అనే తేనె పూసిన కత్తిని వాడుతున్నారు. ఓట్ల కోసం హిందూ ధర్మాన్ని పణంగా పెట్టడాన్ని విరమించుకోవాలని హిందూ సమాజం కోరుకుంటుంది. ఐదు శతాబ్దాల నాటి మరకలను చెరిపి, ఇప్పుడిప్పుడే అయోధ్యలో రామ మందిరం నిర్మించుకున్నాం. ఆ రామ మందిరాన్ని చూసి ఓర్వలేకపోవడం, విమర్శలు గుప్పించడం వంటి దుర్మార్గపు పనులు చేయవద్దని హిందూ సమాజం అభ్యర్థిస్తోంది.
__vskandhra