Sanskrit University Tirupati |
ముఖ్య అతిథిగా పాల్గొన్న గుళ్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి మాట్లా డుతూ.. వేద సంరక్షణకు కృషి చేసిన జగద్గురువుల మార్గం సర్వదా అనుసరణీయమన్నారు. వేద విద్యార్థులు నిరంతరం సాధన చేయాలన్నారు. దుర్గగుడి ఈఓ కె.ఎస్.రామరావు మాట్లాడుతూ..
వేద సారాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేవదాయ, ధర్మ దాయశాఖ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామిదేవస్థానం నిర్వహిస్తున్న వేద పాఠశాలలో త్వరలో అన్ని శాఖలకు ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వేద సభ నిర్వాహకులు మాగంటి గోపాల్ మాట్లాడుతూ.. మూడు తరాలుగా వేద సభల, పరీక్షల నిర్వహణకు సంస్థ కృషి చేస్తున్నట్లు తెలిపారు. వేద పరీక్షలకు 125 మంది విద్యార్థులు హాజరయ్యారు. గార్లపాటి శ్రీ రామశర్మకు ఘనాపాటి. కుర్నేటి సీతారామ శర్మ, కంభం పాటి చంద్రశేఖర శర్మకు క్రమ పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్ర మాలను విష్ణుభొట్ల సలక్షణ ఘనాపాటి, యజ్ఞ నారాయణ నిర్వహించారు. మాజీ మేయర్ జంధ్యాల శంకర్, కార్యవర్గ సభ్యుడు తుర్లపాటి బైర్రాజు, చెట్లపల్లి మారుతీ ప్రసన్న, మేనేజర్ శర్మ పాల్గొన్నారు. ఆదిశంకర జయంతి సందర్భంగా వేదపండి తులను నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు.