 |
Kerala Governor Arif pays obeisance to Lord Ram in Ayodhya |
అయోధ్య బాల రాముడ్ని దర్శించుకున్న కేరళ గవర్నర్ ఆరిఫ్
అయోధ్య లోని బాలరాముడ్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ దర్శించుకున్నారు. దేవాలయంలోకి వెళ్లగానే రాముడికి ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. అయోధ్య రామాలయ అత్యంత ప్రశాంతమైనదని అభివర్ణించారు.
 |
Kerala Governor Arif pays obeisance to Lord Ram in Ayodhya |
కేరళ గవర్నర్తో పాటు తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆరిఫ్ ఖాన్ మాట్లాడుతూ… శ్రీరాముడ్ని దర్శించుకోవడం, ఆరాధించడం తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. గత జనవరిలోనూ రెండుసార్లు అయోధ్యకు వచ్చానని, అప్పుడు ఎలాగైతే అనుభూతి వుందో… ఇప్పటికే అదే అనుభూతిని తాను పొందుతున్నానని వెల్లడిరచారు. అయోధ్యకు వచ్చి, శ్రీరాముడ్ని పూజించడం తన చాలా గర్వంగా వుందన్నారు.