Population Bomb |
క్రైస్తవ దేశాల జనాభా 1950 నాటికీ, 2015 నాటికి చాలా మారిపోయింది. 1950లో 93 దేశాలలో క్రైస్తవులు అధిక సంఖ్యాకులుగా ఉంటే, ఇప్పుడు ఆ 93 దేశాలలోని 77 దేశాలలో వారి సంఖ్య 65 ఏళ్ల తరువాత చూస్తే తిరోగమనంలో ఉంది. అదేం చిత్రమో, భారత్లో మాదిరిగానే చాలా ముస్లిమేతర దేశాలలో మెజారిటీ మతాల వారి వాటాయే తగ్గిపోతోందని ఆ నివేదిక తేల్చింది. మొత్తం 167 దేశాల వివరాలు ఈ పత్రంలో నమోదు చేశారు.
లెక్కలోకి తీసుకున్న 94 క్రైస్తవ దేశాలలో 1950-2025 మధ్య మెజారిటీ జనాభా వాటా తగ్గింది. 77 దేశాలలో ఈ తగ్గుదల కనిపించింది. అదే కాలానికి 38 ముస్లిం దేశాలను చూస్తే 25 దేశాలలో ముస్లింల వాటా పెరిగిన సంగతి తెలుస్తున్నది. కాబట్టి భారత్లో హిందువులు, క్రైస్తవ దేశాలలో వారి వాటా తగ్గిపోతున్నదనే చెప్పాలి. 1950లో లెబనాన్లో క్రైస్తవులు 51.65 శాతంతో మెజారిటీగా ఉన్నారు. 2015లో ఇది ముస్లిం మెజారిటీ దేశంగా మారింది. ఇప్పుడు లెబనాన్లో ముస్లిం జనాభా వాటా 61 శాతం. భారతదేశ జనాభాలో కూడా మెజారిటీ మతస్థులైన హిందువుల వాటా 7.81 శాతం తగ్గింది. తరువాత పేర్కొనదగినది మయన్మార్. అక్కడ మెజారిటీ మతస్థుల వాటా 10 శాతం తగ్గింది.
భారత్, పాక్, బంగ్లా, నేపాల్, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక, మైన్మార్, భూటాన్ల లలో చూస్తే వీటిలో అన్ని ముస్లిం దేశాలలోను మెజారిటీ జనాభాయే పెరిగింది. అయితే మాల్దీవుల పరిస్థితి మాత్రం మినహాయింపు. 1950లో బంగ్లా జనాభాలో 0.66 శాతం ఉన్న బౌద్ధులు, క్రైస్తవుల వాటా 17 శాతానికి దిగజారింది.