హిందూ వివాహం |
చాలా రోజులకు సుప్రీంకోర్టు నుండి హిందూ సంస్కృతి కి సంబంధించి ఒక మంచి తీర్పు వెలువడింది. జస్టిస్ బివి నాగరత్న మరియు అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
Supreme Court |
హిందూ వివాహ సాంప్రదాయంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహం పవిత్ర లక్షణాలను ప్రస్తావిస్తూ.. అది ఒక పవిత్రమైన మతపరమైన పక్రియ అని పేర్కొంది. అంతేకాదు హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే వివాహ క్రతువు సముచితమైన మర్యాదలతో నిర్వహించాలని కోర్టు నొక్కి చెప్పింది. సప్తపది (పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడు మెట్లు) వంటి వేడుకలను గురించి ప్రస్తావించింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం హిందూ వివాహం మతకర్మ అని, “ఆట పాట”, “విందు భోజనాల” కోసం జరిగే కార్యక్రమం కాదని పేర్కొంది.
యువత వివాహానికి సిద్ధపడే ముందు దాని పవిత్రతను లోతుగా పరిశీలించాలని యువకులను సుప్రీంకోర్టు కోరింది. వివాహాన్ని దుబారా కోసం లేదా కట్నం లేదా బహుమతులు డిమాండ్ చేసే మార్గంగా లేదా వ్యాపార వ్యవహారం లాగా భావించకూడదు కూడదు, స్త్రీ మరియు పురుషుల మధ్య జీవితకాల ఐక్యతను నెలకొల్పడం, కుటుంబానికి పునాది ఏర్పడే ఒక గంభీరమైన సందర్భంగా గుర్తించాలి అని సుప్రీంకోర్టు హితవు పలికింది.
పద్దతిగా చెల్లుబాటు అయ్యే వివాహ వేడుకను నిర్వహించకుండా వైవాహిక స్థితిని పొందేందుకు కొన్ని జంటలు ప్రయత్నించడాన్ని కోర్టు విమర్శించింది. వివాహం అనేది లావాదేవీ కాదని, ఇద్దరు వ్యక్తుల మధ్య పవిత్రమైన నిబద్ధత అని నొక్కి చెప్పింది. వివాహంలో ప్రవేశించే ముందు దాని ప్రాముఖ్యత గురించి ఆలోచించాలని యువ జంటలకు కోర్టు సూచించింది, ఎందుకంటే వివాహం తేలికగా తీసుకోకూడని లోతైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పింది.
"వాస్తవానికి వివాహాన్ని జరుపుకోకుండా వీసా దరఖాస్తుల వంటి కారణాల కోసం జంటలు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 8 కింద తమ వివాహాన్ని నమోదు చేసుకున్న సందర్భాలను కోర్టు గుర్తించింది. కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే వివాహాన్ని చెల్లుబాటు చేయదని నొక్కి చెబుతూ, అలాంటి పద్ధతులకు వ్యతిరేకంగా హెచ్చరించింది. వివాహాన్ని పద్ధతి ప్రకారం చేయడంలో విఫలమైతే, వివాహ స్థితికి సంబంధించి చట్టపరమైన మరియు సామాజిక పరిణామాలకు దారితీయవచ్చు కాబట్టి, వివాహ వ్యవస్థను చిన్నచూపు చూడకూడదని కోర్టు కోరింది.
"హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 7 ప్రకారం వివాహం ఆచార వ్యవహారాలు మరియు వేడుకలతో నిజాయితీగా నిర్వహించడం మరియు పాల్గొనడం అనేది ఆ వేడుకకు అధ్యక్షత వహించే వివాహిత జంటలు మరియు పురోహితులందరిచే నిర్ధారించబడాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది."
అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే హిందూ వివాహ వేడుక ఆచార వ్యవహారాలు ప్రకారం తంతు నిర్వహించకుండా నేరుగా రిజిస్టర్డ్ పెళ్లిళ్లు చేసుకుంటే అవి హిందూ వివాహ చట్టం ప్రకారం గుర్తింపబడవు అని సుప్రీంకోర్టు చెప్పింది.
....చాడా శాస్త్రి