భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. ఆర్థిక అభివృద్ధికి, పాడిపంటల వికాసానికి, ఆరోగ్యవంతమైన, రోగరహిత సమాజ నిర్మాణానికి మన దేశీ గోవుల పాత్ర తక్షణ అనుసరణీయం. అటువంటి గోసంరక్షణకు మనం ఏం చేయవచ్చు?
- ఆవు ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ముఖ్యంగా యువతరం ఆ పని చేయాలి. పిల్లల్లో గోవుపట్ల భక్తిభావాన్ని కలిగించాలి.
- పాలు, నెయ్యి, సబ్బులు, షాంపులు, పండ్లపొడి మొదలైన గో ఉత్పత్తులను ప్రోత్సహించాలి.
- ప్రతి దేవాలయంలో ఒకటి, రెండు ఆవులను పెంచేవిధంగా ధర్మకర్తలు, పాలకమండలితో మాట్లాడాలి.
- కుటుంబసమేతంగా గోశాలను సందర్శించాలి. ఆర్ధిక సహాయం అందించాలి. గోశాల నిర్వహణలో పాలుపంచుకోవాలి.
- కృష్ణాష్టమి, లేదా ఏదైనా పండుగ సందర్భంగా పాఠశాల, దేవాలయం కేంద్రంగా సామూహిక గోపుజా కార్యక్రమం నిర్వహించాలి.
- గోవులను పెంచే కుటుంబాలను గ్రామాలలో పెంచాలి.
- ప్రతి గ్రామంలో పశువులను పెంచడం కోసం పశువుల బీడును ఏర్పాటుచేసుకోవాలి.
- గోఆధారిత వ్యవసాయ విధానాలను అనుసరించాలి.
- గోసంరక్షణకు జరిగే ప్రయత్నాలు, కార్యక్రమాలకు మద్దతు ఇచ్చి, వాటిలో పాల్గొనాలి.
- లక్షలాది గోవుల మరణానికి కారణమవుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని వదిలిపెట్టాలి.