మంచి తెలివి తేటలు ఉండి, సాధారణంగా ఉండే వాళ్లకి సడన్ గా వామపక్ష ఉదారవాద వైరస్ అంటుకుంటే వాళ్ళు ఎలా మారిపోతారో అనేదానికి తాజా ఉదాహరణ భారతీయ అమెరికన్ అయిన రిధి పటేల్. అమె చదువుల్లో, ఆటపాటల్లో చురుగ్గా ఉండేది. ఒకప్పుడు మంచి అథ్లెట్‌గా ఉన్న ఆమె, 2020లో సెంటర్ ఆన్ రేస్, పావర్టీ & ది ఎన్విరాన్‌మెంట్ (CRPE)అనే వామపక్ష సంస్థలో చేరిన తర్వాత వామపక్ష భావజాల రాజకీయాల్లోకి వచ్చింది. దాంతో సహజసిద్దంగానే అందరు వామపక్ష భావజాల మద్దతు దారుల వలే ఈమెకు పాలస్తీనా, ముస్లిం అణిచివేత వంటి అంశాలు మాత్రమే కాకుండా బిజెపి అన్నా, మోడీ అన్నా, హిందూ ధర్మం అన్నా, హిందూ పండుగలు అన్నా విపరీతమైన ద్వేషం పెంచుకుంది. ద్వేషం ఉండవచ్చు, కానీ అది సభ్యత దాటి బూతు భాష ఉపయోగించే స్థితికి చేరింది.
ఆమె గతంలో మోడీ గురించి చేసిన ట్వీట్స్, FB పోస్ట్స్ క్రింద చూడండి. సంస్కారం ఉన్న స్త్రీ ఎవరూ ఆ భాష ఉపయోగించరు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆమె వీడియోలో, ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించనందుకు, మరియు హమాస్ అనుకూల నిరసనల వల్ల భవన భద్రతను పెంచినందుకు రిపబ్లిక్ మేయర్ 'కరెన్ గో' తో సహా 'బేకర్స్‌ఫీల్డ్ కౌన్సిల్' సభ్యులను చంపుతామని ఈ రీద్ధి పటేల్ బెదిరించడం కనిపించింది.
ఆమె మాట్లాడుతూ మీరంతా దారుణమైన వారు, పాలస్తీనా లో అలా జరుగుతూ ఉంటే మౌనంగా వున్నారు. "ఒక రోజు వారు గిలెటిన్ తెచ్చి మీ మద. ఫక ...లను అందరిని చంపేస్తారని నేను ఆశిస్తున్నాను." అంటూ వాగింది.
వెంటనే మేయర్ సూచన మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పడేసారు. సుమారు 8 కఠినమైన సెక్షన్ల క్రింద కేసులు బుక్ చేయడంతో ఆమె బెయిల్ కోసం 2మిలియన్ US డాలర్లు అంటే సుమారు ₹16కోట్లు అవుతుంది అని కోర్ట్ చెప్పింది.
అయితే, అరెస్ట్ అయిన వెంటనే మొత్తం ఉదార వాద మత్తు దిగి, ఆమె ఏడవటం మొదలుపెట్టి, విడుదల చేయమని కోర్టుని వేడుకోవడం ప్రారంభించింది. అయితే అది అమెరికా, ఇండియా కాదు. ఆమెను జైలులో పడేసారు.
....చాడా శాస్త్రి....