'పతంజలి' మీద సుప్రీమ్ కోర్టులో జరుగుతున్న వివాదం గురించి నాలుగు మాటలు.
పతంజలి భారతీయ వైద్య విధానాన్ని అనుసరించి ఆధునిక ఉత్పత్తులను తయారు చేస్తోంది. అలాగే ప్రాచీన ఆయుర్వేద వైద్యానికి సంబంధచినవి కూడా తయారు చేస్తోంది. సమస్య ఎక్కడ వచ్చింది అంటే, పతంజలి తన వ్యాపార ప్రకటనలలో ఆధునిక వైద్య విధానాన్ని విమర్శించడం మీద IMA కోర్టుకు వెళ్ళింది. అలాగే తమ ఉత్పత్తుల గురించి misleading ప్రకటనలు ఇచ్చిందని ఆరోపణ. దాని మీద విచారణ సందర్భంగా పతంజలి సంస్థను క్షమాపణ పత్రం సమర్పించమని సుకో ఆదేశించింది.
పతంజలి సమర్పించిన క్షమాపణ పత్రంలో చిత్తశుధ్ధి లేదని సుకో భావించినందున, మరొకసారి పతంజలి క్షమాపణపత్రం సమర్పించింది. దానితో కూడా సుకో సంతృప్తి కలుగలేదు. ఇద్దరు జడ్జీల బెంచ్ లో ఒకరైన అస్మనుల్లా అమానుల్లా చేసిన వ్యాఖ్యలు ఒక న్యాయమూర్తి చేయవలసినవిలా లేవు. 'We will rip you apart' అనడం ఒక న్యాయమూర్తికి తగని వ్యాఖ్య.
సినిమాల్లో రౌడీలు 'అమ్మతోడు, అడ్డంగా నరుకుతా' అన్న విధంగా ఉన్నది. 'పతంజలి సంస్థ ఎన్ని సార్లు క్షమాపణ చెప్పినా వదిలేది లేదు' అనడం న్యాయవ్యవస్థ మూర్ఖత్వానికి పరాకాష్ట.
రామ్దేవ్ బాబాని, బాలకృష్ణను జైల్లో పెట్టించేదాకా IMA వదిలేలా లేదు. ఓకే. వాళ్ళ మీద దుష్ప్రచారం చేసారనే కదా, ఆరోపణ! చేసుకోనివ్వండి. నిన్ననో, మొన్ననో సుకోవారు 'కేవలం పతంజలి మాత్రమే కాదు, fmcg సంస్థలన్ని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి' అంటూ మరో వ్యాఖ్య చేసారు. పూర్వం మనం బొగ్గు పొడి, ఉప్పుతో పళ్ళు తోముకునేవాళ్ళం. తరువాత కాల్గేట్ వంటి సంస్థలు వచ్చి మన పాత విధానాలను నాశనం చేసాయి. ఇప్పుడు కొత్తగా 'మీ పేస్టులో ఉప్పుందా? బొగ్గుందా? బొంగుందా?' అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ ప్రకటనలకు IMA apprved అనే ముద్ర కూడా ఉంటుంది. అసలు IMA కు అలా సర్టిఫై చేసే అధికారం లేదు. ఫుడ్ & డ్రగ్స్, కాస్మోటిక్స్ కు సంబంధించి సర్టిఫై చేసే సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అంతే కాదు. డాక్టర్లు, లాయర్లు తమ వృత్తిని ప్రోత్సహింకునేలా వ్యాపార ప్రకటనలు ఇవ్వకూడదు.
'నేను క్రిమినల్ కేసులు వాదించడంలో దిట్ట. మీ కేసులను నా దగ్గరకు తీసుకురండి' అనే ప్రకటన ఇవ్వకూడదు. అలాగే డాక్టర్లు కూడా వ్యాపార ప్రకటనలు ఇవ్వకూడదు. కానీ ఎంతమంది డాక్టర్లు ఆ రూల్ ని పాటిస్తున్నారు? 'సంతానం లేదా? మా దగ్గర అత్యుత్తమ చికిత్స' "కీళ్ళ నొప్పులకు అత్యుత్తమ వైద్యం దక్షిణ భారతంలోనే మేటి మా హాస్పిటల్' ఇలాంటివి IMA కు పట్టవా? వాళ్ళను IMA ఎందుకు నియంత్రించడం లేదు? లేటెస్టుగా fmcgలను ప్రస్థావించడం కంటి తుడుపు చర్య మాత్రమే.
ఒక దేశీయ వైద్య విధానానికి ప్రాచుర్యం కల్పించిన దేశీయ సంస్థను నాశనం చేయడమే వాళ్ళ లక్ష్యంలా కనపడుతోంది. చివరగా, న్యాయవ్యవస్థ తన నోటిని అదుపులో ఉంచుకోకపోతే జనం ఊరుకోరు. 'We the people of India gave to ourselves, this Constitution .... ' ఈ రాజ్యాంగం మాకు మేము ఇచ్చుకున్నదే. మీరు దానికి బధ్ధులై ఉండాలి. అంటే ఈ దేశ ప్రజలకు మీరు సమాధానం చెప్పవలసిందే. ఉన్నతస్థానంలో ఉన్నంతమాత్రాన నోటికి హద్దు లేకుండా మాట్లాడితే 'We too will rip apart the Judiciary.'
పోస్ట్ క్రెడిట్ - Murali Krishna గారు