Arunachal Pradesh |
అరుణాచలప్రదేశ్ విషయంలో చైనా వివాదాస్పద వైఖరి కొనసాగుతోంది. అరుణాచల్ తమదేనంటూ చైనా ఇటీవల చేసిన ప్రక టనలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. ఇదిలా ఉండగానే అరుణా చల్ ప్రదేశ్లోని మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టుకున్న చైనా తన మొండి వైఖరిని మరోసారి చాటుకుంది. క్యాబినెట్ సిఫారసుల మేరకు జాంగ్నాన్లోని 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టామని చైనా ప్రభుత్వం ప్రక టించింది.
అరుణాచల్ ప్రదేశ్ ను చైనా జాంగ్నాన్గా పిలుస్తోంది. పేర్లు మార్చిన ప్రదేశాల్లో జనావాస ప్రాంతాలు, నదులు, సరస్సులు, పర్వతాలు, ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు చైనా ఇలా పేర్లు పెట్టుకోవడం ఇది తొలిసారి కాదు. 2017 ఏప్రిల్, 2021 డిసెంబరు, 2023 ఏప్రిల్లోనూ ఇలాగే పలు ప్రాంతాలకు సొంతంగా పేర్లు పెట్టుకుంది.