వయసులో ఉన్న విద్యార్థులకు ప్రేమ దాని దుష్పరిణామాలు తెలియ చెప్పే ఉద్దేశ్యంతో కేరళ లో గల ఇడుక్కి డియోసెస్ , సైరో మలబార్ క్యాథలిక్ చర్చి 10, 11, 12 తరగతులు చదువుతున్న తమ పిల్లల కోసం మొన్న ఆదివారం ' కేరళ స్టొరీ' చిత్రాన్ని ప్రదర్శించింది.
సైరో-మలబార్ క్యాథలిక్ చర్చి యొక్క ఇడుక్కి డియోసెస్ తర్వాత, కేరళలోని మరో రెండు డియోసెస్‌లతో అనుబంధించబడిన యువజన సంఘాలు ఈ వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాయి.
రెండు ఉత్తర కేరళ డియోసెస్‌ల KCYM యూనిట్లు వేర్వేరు ఫేస్‌బుక్ పోస్ట్‌లలో 'ది కేరళ స్టోరీ' చిత్రం పై నిషేధం లేదు అని తెలుపుతూ, 10, 11 మరియు 12 తరగతులలో చదువుతున్న పిల్లల కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల ఇడుక్కి డియోసెస్‌ని అభినందించారు.
"ఈ చిత్రం థామరాస్సేరి డియోసెస్‌లోని 'కేరళ కాథలిక్ యూత్ మూవ్‌మెంట్' (KCYM) యొక్క అన్ని యూనిట్లలో ప్రదర్శించబడుతుంది" అని ఆ సంస్థ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది.
'కేరళ స్టొరీ' ని ప్రదర్శించినందుకు జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్‌పై కాంగ్రెస్ మరియు సీపీఐ విమర్శల నేపద్యంలో వారు ఎందుకు భయపడుతున్నారో మేం తెలుసుకోవాలని అనుకుంటున్నాం అని తలస్సేరి ఆర్చ్ డియోసెస్ యొక్క KCYM యూనిట్ తెలిపింది. కేరళ లో గల తమ 120 బ్రాంచిల్లోనూ కేరళ స్టోరీ' చిత్రాన్ని ఈ నెల 12న ప్రదర్శిస్తాం అని ప్రకటించింది.
'కేరళ స్టోరీ' గతంలో విడుదల అయినప్పుడు కేరళ ప్రభుత్వం దీనిని బాన్ చేయడానికి ప్రయత్నిస్తే కేరళ హై కోర్ట్ అడ్డుకుంది. అయినా ప్రభుత్వం అంటే భయం చేత ఏ థియేటర్ యజమానులు ఈ సినిమా ప్రదర్శించడానికి పెద్దగా ధైర్యం చేయలేదు. బెంగాల్ ప్రభుత్వం కూడా బాన్ చేసింది. తమిళనాడు ప్రభుత్వం పరోక్షంగా బాన్ జరిగినట్లు చూసింది.
అయితే, ఈ నెల 5వ తేదీన దూరదర్శన్ ఈ చిత్రాన్ని ప్రదర్శించడం కేరళ లో వివాదాస్పదమయింది.
....చాడా శాస్త్రి....