దత్తాత్రేయహోసబాలే జీ |
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీరామ్ లల్లా ప్రతిష్ట సందర్బంగా 1 జనవరి నుంచి 15 జనవరి వరకు దేశవ్యాప్తంగా అక్షతల వితరణ కార్యక్రమం జరిగిందని ఆ కార్యక్రమాన్ని ప్రజలు ఎలా స్వాగతించారో చూశామని అన్నారు.
సంఘ కార్యకర్తలతో సహా మొత్తం హిందూ సమాజం ఈ స్వప్నం కోసం ఎదురుచూడడంతో ఈ విషయానికి అగ్ర తాంబూలాన్ని ఇచ్చారన్నారు. శ్రీరామ జన్మభూమి, అందులో రామ మందిరం భారత నాగరికతకు, ప్రత్యేక సంస్కృతికి ప్రతీక అని, శ్రీరాముడు భారతీయ నాగరికతకు చిహ్నమని తెలిపారు.