రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సహ సర్ కార్యవాహ డా. మన్మోహన్ వైద్య |
సంఘ్‌లో చేరేందుకు ప్రజల ఆసక్తి పెరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సహ సర్ కార్యవాహ డా. మన్మోహన్ వైద్య తెలిపారు.నాగపూర్‌లో జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2017 నుంచి 2023 వరకు ఎవరైతే సంఘ్‌లో చేరాలనుకున్నారో వారికి ఎవరిని సంప్రదించాలనేది తెలియకుండా ఉండేదని వారు ఆర్.ఎస్.ఎస్.లో చేరాలని ఉందంటూ తమ అభ్యర్థనను ఆర్.ఎస్.ఎస్.
వెబ్‌సైట్‌కు పంపేవారని అన్నారు. ఆర్.ఎస్.ఎస్.లో చేరేందుకు అభ్యర్థనలు 2017 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం సగటున 1 లక్షకు పైగా వచ్చాయని జనవరి, ఫిబ్రవరి ఈ రెండు నెలల్లో, ఈ అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అయ్యాయని వివరించారు.