రోహింగ్యాలపై మోడీ ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.
- "అక్రమ రోహింగ్యా ముస్లిం వలసదారులకు భారతదేశంలో నివసించడానికి మరియు స్థిరపడటానికి ప్రాథమిక హక్కు లేదు"
- "UNHCR శరణార్థి కార్డును భారతదేశం గుర్తించలేదు, కొంతమంది ఈ దేశంలో శరణార్థి హోదాను పొందేందుకు ఆ కార్డు పొందారు. కానీ, ఆ కార్డు ని భారత్ గుర్తించలేదు.
- సుప్రీంకోర్టు వివిధ తీర్పులను ఉటంకిస్తూ, "రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక విదేశీయుడుకి ఇక్కడ జీవించే హక్కును మరియు స్వేచ్ఛను ఇస్తున్నప్పటికీ, దేశంలో శాశ్వతంగా నివసించే మరియు స్థిరపడే హక్కు మాత్రం ఆ ఆర్టికల్ భారతీయ పౌరులకు మాత్రమే ప్రత్యేకించబడిందని" ప్రభుత్వం స్పష్టం చేసింది.
- "రోహింగ్యాల అక్రమ వలసలను ఇంకా అనుమతించడం, వారికి నివాసం కల్పించడం ఒక్క చట్ట విరుద్ధమే కాదు, దేశ భద్రతకు సంబంధించిన తీవ్ర విషయం" అని కూడా కేంద్రం సుప్రీంకోర్టు కి తమ అఫిడవిట్ లో తెలియచేసింది.
- "చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించే వారికి శరణార్థి హోదాను మంజూరు చేయడానికి మరియు ఒక ప్రత్యేక వర్గాన్ని సృష్టించడానికి పార్లమెంటు మరియు కార్యనిర్వాహకుల వ్యవస్థ కి ఉన్న అధికార పరిధిలోకి న్యాయవ్యవస్థ జొరబడకూడదు" అని కేంద్రం తమ అఫిడవిట్ లో తెలియచేసింది.
....చాడా శాస్త్రి....