తెలంగాణ హైకోర్టు |
ఆస్తి వివాదంపై తీర్పులో మహాభారతాన్ని ప్రస్తావించిన జడ్జి
ఒకసారి ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేశాకే అమ్మకం, కొనుగోలు జరపాలని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. మొదటి రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా కొనుగోలు చేసిన వారికి ఆ ఆస్తిపై ఎలాంటి హక్కులు సంక్రమించబోవని తేల్చిచెప్పింది. ఈమేరకు జస్టిస్ నగేష్ భీమపాక శనివారం తీర్పు వెలువరించారు.
ఓ ఆస్తి వివాదంలో ఈమేరకు తీర్పు వెలువరిస్తూ.. మహాభారతంలో దుర్యోదనుడి మాటలను ప్రస్తావించారు. ‘పాండవులకు అయిదు ఊళ్లు ఇవ్వాలన్న శ్రీకృష్ణుడి సూచనపై స్పందిస్తూ.. వాటిని ఇప్పటికే సామంత రాజులకు ఇచ్చేశానని, నాకు చెందనివి, ఇతరులకు ఇచ్చేసిన వాటిని పాండవులకు ఎలా ఇవ్వగలనంటూ దుర్యోదనుడు ప్రశ్నిస్తాడు’.. మహాభారతంలోని ఈ వ్యాఖ్యలను కోర్టులో జస్టిస్ చదివి వినిపించారు. ఇదే విధంగా ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక దానిని రద్దు చేయకుండా ఆ ఆస్తిని మరోసారి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని చెప్పారు.
__Vskandhra