Sunil Ambekar |
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎంతో సహనశీలి, రక్షణాత్మకమైనది, ధృడమైన మద్దతుదారుగా నిలుస్తుంది ముఖ్యంగా యువతకు కానీ, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం సంఘ్‌ను విద్వేషంతో కూడున్నది, సమాజంలో విద్వేషాన్ని పెంపొందిస్తున్నదని నిత్యం ప్రచారం చేస్తూ ఉంది. కానీ, సంఘ్ మాత్రం ఎప్పుడు స్పందించలేదు..ఎందుకని..నాకు తెలుసు సంఘ్ విద్వేషంతో కూడుకున్న సంస్థ కాదని..మరి మీరు ఎందుకు స్పందించరు. ఒకవేళ స్పందించాల్సి వస్తే మీరు ఏమని చెబుతారు..ఎంతో పెద్ద ఆర్గనైజేషన్ అయిన సంఘ్ అంటేనే ఒక చెడు అని దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్లకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి..??
భారతదేశంలో 143 కోట్ల జనాభా ఉంది. ఆ జనాభా మొత్తాన్ని సంఘ్ తన సొంతవారిగానే భావిస్తుంది. ప్రేమతో అందర్ని ఐక్యంగా ఉంచడమే సంఘ్ పని విధానం. ఇక మొదటి విషయం ఏంటంటే, సంఘ్ పై వ్యాఖ్యానాలు చేసే చాలా మంది వ్యక్తులు అధికారం అనే కోణం నుంచే ప్రతీదీ చూస్తారు, చెబుతారు, ఆ విధంగానే లెక్కలు వేసుకుంటారు.
వాళ్లు 5 సంవత్సరాల గురించే లెక్కలు వేసుకుంటారు. మేము శతాబ్ద కాలానికి లెక్కలు వేసుకుంటాం. ఈ కారణంగానే వాళ్లకి మాకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఇక రెండవ కారణం ఏంటంటే, ఏ లక్ష్యంతో అయితే సంఘ్ ప్రారంభించబడిందో ఆ దిశగా మంచే జరుగుతుంది. సంఘ్ ప్రతి ఒక్కరికి చేరువ అవుతుంది. సంఘ్‌ను అందరు తమ సొంతంగా భావిస్తున్నారు.
చాలా సార్లు మేము స్పందించలేదు ఎందుకంటే, మాకు తెలుసు..వాళ్లు బాహ్య ప్రపంచానికి ఏం చెప్పినప్పటికీ వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం, ‘ఏం చేస్తాం అలా చెప్పాల్సి వస్తుంది..మాకు తెలుసు మీరు మంచి పని చేస్తున్నారు’, అని అంటారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్లు ఎందరో మమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెబుతారు. వాళ్ల ద్వంద్వ వైఖరి మాకు తెలుసు. అందుకే మేము చాలాసార్లు స్పందించలేదు. ఇది నిజం.
ఇలా ఎందుకు జరుగుతుందంటే, వలసవాదం, దానికంటే ముందు వచ్చిన విదేశీ శక్తుల కుతంత్రాలు. ఇవి నేటికీ ఉన్నాయి. వారి వారసత్వం కారణంగానే ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది. సంఘ్ పై దుష్ర్పచారం చేస్తున్న వారి జాబితాలో కొంతమంది జాతి ముసుగులో దేశంలో రాజకీయం చేయాలనుకుంటున్నారు వారు ఒక ప్లాన్ ప్రకారం ప్రజలను విడదీయాలనుకుంటున్నారు.
హిందువులందరూ ఒకటే అని సంఘ్ చెబుతుంది. సంఘం ఈ విధంగా హిందువులు అందరూ ఒకటే అని గట్టిగా చెప్పడమే కాకుండా వారిని కలుపుకుంటూ పోతోంది..దీంతో వారి స్వల్పకాల లక్ష్యాలు విఫలం అవుతున్నాయి. ఈ కారణంగానే వారు దుష్ర్పచారానికి దిగుతున్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే..డబ్బులు ఇచ్చో, ఆశ చూపించో మత మార్పిడీలు చేయొచ్చని అనుకుంటారు. కానీ ఏమౌతుందంటే.. హిందూ సంస్కృతి, హిందూ సమాజంలోని సుగుణాలు ఏంటనేవి అర్థం అయ్యేలా సంఘ్ చెబుతుంది. ఈ కారణంగా వారికి మెల్లమెల్లగా విషయం అర్థం అవుతుంది.
ఏ రామ మందిరాన్ని అయితే వాళ్లు మతపరమైనది అన్నారో..అది రాముడి పట్ల భక్తి భావం నుండి పుట్టిందనే విషయం మెల్లగా ప్రజలందరికీ అర్థం అయింది. దీంతో వారి కుటిలతంత్రము ఏదైతే ఉందో అది విఫలం అయింది..అలాంటి వారే దుష్ప్రచారం చేస్తారు. ఇంకొంతమంది ఏమనుకున్నారంటే, అడవిలోని వనవాసీలను మభ్యపెట్టి దేశ ప్రజాస్వామ్యాన్ని, దేశ సౌభ్రాతృత్వాన్ని నష్ట పరచాలనుకున్నారు. కమ్యునిజం పేరుతో ఏ విధంగా అయితే ప్రపంచంలోని పలు దేశాలను నష్ట పరిచారో ఆ విధంగా..కానీ, వారి మార్గంలోకి సంఘ్ ఎదురొడ్డి నిలబడింది.
సంఘ్‌కు చెందిన వివిధ సేవా కార్యక్రమాలు వనవాసీ క్షేత్రాల్లో నిర్వహించబడుతున్నాయి. అలాగే మేమంతా ప్రకృతి ఆరాధకులం. ఇందులోకి ఎవరూ బయట నుంచి రాలేదు అందరూ ఇక్కడి వారే. మనందరి డీఎన్‌ఏ ఒకట్టే. ఇదే సంఘం బోధిస్తుంది. సైంటిఫిక్‌గా నిరూపించవచ్చు. చారిత్రాత్మకంగా నిరూపించవచ్చు. పురావస్తు శాస్త్రం ప్రకారం నిరూపించవచ్చు. అలా వారి ప్రయత్నాలు విఫలం అవుతూ వస్తున్నాయి.
వాళ్లు ఎలాంటి కష్టం లేకుండా రాజకీయం చేయాలనుకుంటున్నారు. కానీ సంఘ్ క్షేత్రస్థాయిలో పని చేస్తుంది. ప్రతి కాలనీలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటికి చేరువ అవుతుంది. సంఘ్‌కు చెందిన పలు కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఇన్ని కార్యక్రమాల చేరుతున్నప్పటికీ అసత్యాన్ని పెద్ద పెద్ద మైకులు పెట్టి ప్రచారం చేసినా..సంఘ్ కార్యక్రమాలు ఇంటింటికి చేరిన తర్వాత..వారు ఎంత పెద్దగా అరిచి గీపెట్టినా..నిజం అనేది బయటకు వస్తుంది.
ఇది వాళ్లను కష్టపెడుతుంది. ఇలాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే 1947లో చేసిన రాజకీయంతో దేశ విభజన జరిగింది. ఇప్పుడు కూడా అలాంటిదే చేయాలని వారు అనుకుంటున్నారు.
కానీ హిందువులు అందరూ ఐకమత్యంతో ఉన్నారు. సంఘ్ 143 కోట్ల జనాభాను సొంతవారిగా భావిస్తుంది. దేశాన్ని వ్యతిరేకించేవారికి, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే శక్తులకు వ్యతిరేకంగా సంఘ్ నిలబడుతుంది. అటువంటి వారి కుట్రలు ఇప్పటివరకు సఫలం కాలేదు. ఎవరైతే మనల్ని విభజించారో వారే విభజించబడ్డారు. ప్రపంచం సైతం వ్యతిరేక శక్తులకు ఎదురొడ్డి నిలుస్తోంది. సంఘ్‌లో ఎన్నో విలక్షణతలు ఉన్నాయి. దేశ ఐక్యత, అఖండత, రక్షణ, మన దేశ ఉజ్వల భవిష్యత్‌కు సంబంధించి..ఇలా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందడుగు వేస్తున్న భారత్‌కు సంఘ్ వెన్నుదన్నుగా నిలుస్తోంది.
చందమామకు చేరిన ఘట్టంలో దేశానికి తోడుగా సంఘ్ నిలిచింది. న్యూక్లియర్ పవర్ విషయంలో సంఘ్ మద్దతుగా నిలబడింది. ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ విషయాలను వ్యతిరేకించే వాళ్లు, అలాగే ఈ అంశాలను ఆధారంగా చేసుకొని ఎవరైతే ముందుకు వెళ్లాలనుకుంటున్నారో వారి యుక్తులు ఫలించడం లేదు. వాళ్లు క్రమంగా బలహీనపడుతున్నారు. ఎవరైతే ముక్కలు చేయాలనుకుంటున్నారో వారే ముక్కలు అవుతున్నారు. ఈ కారణంగానే చాలా మంది సంఘ్‌తో విరోధిస్తుంటారు. మేము మా పని చేస్తాము..మాకు బాధ్యత ఉంది..మాటల రూపంలో కాదు చేతల రూపంలో..
గౌరవనీయులు సునీల్ అంబేకర్ గారు, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్