మథురలో చాలాకాలంగా వివాదాల్లో నలుగుతున్న మందిర్–మసీద్ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అక్కడ షాహీ ఈద్గా స్థానంలో కృష్ణునికి ఆలయం నిర్మించడంపై గట్టిగా దృష్టి సారిస్తామని సంకేతాలిచ్చారు. ‘‘కాశీ, అయోధ్య అనంతరం ఇప్పుడిక మథుర వంతు. అక్కడ మందిరం రూపుదిద్దుకోకుంటే కృష్ణుడు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ ఇందుకు వేదికైంది. ‘‘కాశీ, అయోధ్య, మథుర విషయంలో మొండితనం, రాజకీయాలు కలగలిసి ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారి పరిస్థితిని సంక్లిష్టంగా మార్చేశాయి’’ అంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలపై విమర్శలు గుప్పించారు. మథురలో కృష్ణుని పురాతన ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారన్న వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే.
__vskandhra