జ్ఞానవాపి |
ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో గతంలో పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండి హయా(ఏఎస్‌ఐ) నివేదిక వెల్లడించిన నేపథ్యంలో.. ముస్లింలు ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు. ‘జ్ఞానవాపిలో ఆలయం ఉన్న ట్టు అన్ని ఆధారాలూ బయటపడ్డాయి. ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని ముస్లిం సోదరులను కోరుతున్నా’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు.
Hindu Mahasabha president Swami Chakrapani Maharaj |
ప్రస్తుత నిర్మాణానికి ముందు హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్‌ఐ నివేదిక స్పష్టం చేస్తున్నందున ఆ స్థలంపై హక్కులను తిరిగి హిందువులకు అప్పగించి ఆదర్శంగా నిలవాలని హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ ముస్లిం వర్గానికి విజ్ఞప్తి చేశారు. తాజా పరిణామాలతో వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
....vskteam