Ayodhya Ram Temple |
అయోధ్య రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కాబోతుంది. ఈ ఆలయంలో రాంలల్లా ప్రాణప్రతిష్ట కోసం భారత్ పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్యకు ప్రతి రోజూ మూడు లక్షల మందికి పైగా ప్రజలు సందర్శిస్తారని అంచనాలు వేస్తున్నారు. వాటికన్ సిటీ, కంబోడియా, జెరూసలేంతో పాటు భారతదేశంలోని పలు రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
కాగా, అయితే, రాబోయే మూడు-నాలుగేళ్లలో రోజుకు మూడు లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న జనాభాతో పాటు పర్యాటక అవసరాలకు అనుగుణంగా... రోడ్లు, వంతెనలు, మురుగునీటి వ్యవస్థతో పాటు యుటిలిటీస్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలను రూపొందిస్తున్నారు. ఇక, ఆలయానికి వచ్చే భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లతో పాటు సత్రాలు, హోమ్‌స్టేలపై అధికారులు దృష్టి సారించారు. అయోధ్య నగరం యొక్క చారిత్రక, సాంస్కృతిక స్వభావాన్ని తెలియజేస్తూ.. మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని సీపీ కుక్రేజా ఆర్కిటెక్ట్స్ మేనేజింగ్ ప్రిన్సిపాల్ కుక్రేజా తెలిపారు. అయోధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వారసత్వ ఆస్తులతో పాటు ఇతర వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ష్లాన్ చేస్తున్నట్లు కుక్రేజా వెల్లడించారు.