Sahakari Sammelan |
సహకార భారతి ఆధ్వర్యంలో 3వ అఖిల భారత మహిళా సమ్మేళనం 2023 డిసెంబర్ 15 & 16 వ తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేగూర్లోని కన్హ శాంతి వనంలో జరుపుటకు నిర్ణయించారు. ఈ మేరకు నవంబర్ 22న సమ్మేళనానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సహకార భారతి అధ్యక్షులు యెక్కటి ఉపేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగిళ్ల కుమార స్వామి, అఖిల భారత సహ ప్రముఖ్ శ్రీమతి కాటమోని రమాదేవి గారు మాట్లాడారు. డిసెంబర్ 15,16 జరిగే సమ్మేళనానికి భారతదేశంలోని నలుమూలల నుండి వివిధ సహకార సంఘాల నుండి 3000 మందికి పైగా మహిళలు పాల్గొంటారు. మహిళా సాధికారత ప్రధాన ప్రేరణ. వివిధ సహకార రంగాలకు చెందిన ప్రముఖ మహిళా ప్రముఖులు పాల్గొని ఉత్పత్తి మరియు మార్కెటింగ్లో తమ అనుభవాలను పంచుకుంటారు. వివిధ మహిళా సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులను వాటి కోసం కేటాయించిన స్టాల్స్ ప్రదర్శిస్తారు.
సహకార భారతి అఖిల భారతీయ స్థాయిలో 1979 సంవత్సరంలో శ్రీమాన్ దివంగత లక్ష్మణ్ రావు ఇనామ్ దారు (వకీల్ సాబ్) గారు ప్రారంభించారు. సహకార రంగంలో అతిపెద్ద ఏకైక ప్రభుత్వేతర సంస్థ (NGO). సహకార భారతి ప్రధాన లక్ష్యం పారదర్శకత, అభివృద్ధి, విస్తరణ (శుద్ధి, వృద్ధి, సంవృద్ధి). నినాదం ” సంస్కారం లేనిదే సహకారం లేదు – సహకారం లేనిదే అభివృద్ధి లేదు. “
ప్రస్తుతం ఇది భారతదేశం అంతటా 29 రాష్ట్రాల్లో 650 కంటే ఎక్కువ జిల్లాల్లో సేవలను నిర్వహిస్తున్నది. ఈ సహకార సంస్థలలోని 12 రంగాలలో చురుకుగా పని జరుగుతోంది. అవి పొదుపు సంఘూలు, పాల ఉత్పత్తులు, మత్స్యకార, స్వయం సహాయక బృందాలు, హౌసింగ్, చేనేత, వినియోగదారుల సంఘం, మహిళా, సహకార బ్యాంకులు, మార్కెటింగ్, రైతు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థ (FPO), పారిశ్రామిక సహకార సంస్థలు మొదలైనవి. సహకార భారతి వివిధ సహకార సంఘాల సభ్యులకు, పాలకవర్గ సభ్యులకు శిక్షణ ఇస్తోంది. వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి పారదర్శకంగా చట్టం, నిబంధనలకు అనుగుణంగా సంఘాలను నడపడానికి వారికి మార్గదర్శనం చేస్తోంది. సహకార భారతి సహకార సంఘాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య కీలక పాత్ర పోషిస్తోంది, రిజిస్ట్రేషన్, కార్యకలాపాలు, మార్కెటింగ్ సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరిస్తోంది. ఇది మన దేశంలోని అన్ని సహకార సంఘాలకు మార్గదర్శక కేంద్రం. సహకార భారతి సంఘల కార్యకలాపాలను బలోపేతం చేయడం, అభివృద్ధి చేయడంలో వారికి మార్గదర్శనం చేయడానికి పెద్ద సంఖ్యలో సభ్యులకు వివిధ సహకార సంఘాల కోసం అఖిల భారత సమావేశాలను నిర్వహిస్తోంది.
సహకార భారతి సాధించిన విజయాలు.
- నిరంతరం కృషి వలన భారత ప్రభుత్వం సహకారం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.
- ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బహుళార్థ ప్రయోజన సహకార సంఘంగా అధికారం కల్పించేందుకు చట్టం సవరణ.
- బ్యాంకులలో ఖాతాదారులకు డిపాజిట్ బీమా కింద రూ. 1 లక్ష నుండి 5 లక్షలకు పెంచబడింది DICGC (డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారెంటీ పథకం).
- రాష్ట్ర ప్రభుత్వ హామీ లేకుండా సహకార సంఘాలకు NCDC రుణాలు.
- అర్బన్ కో-ఆప్ బ్యాంకులకు బ్రాంచ్ పాలసీ యొక్క సరళీకరణ.
- సహకార సంఘాల రిజిస్ట్రేషన్ మరియు కార్యకలాపాలను సులభతరం చేయడానికి బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టానికి సవరణ.
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో సహకార సంఘాల ప్రతినిధి. ప్రస్తుతం శ్రీ సతీష్ మరాటే సహకార సంఘాల నుండి RBI బోర్డులో డైరెక్టర్గా ఉన్నారు.
- సహకార సంఘాలకు ఆదాయపు పన్ను తగ్గింపు.
- సహకార సంఘాల సభ్యులకు వారి వద్ద ఉన్న డిపాజిట్లపై TDS లేదు.
- సహకార సంఘాల యొక్క వివిధ సమస్యలపై రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వాటి పరిష్కారాలను మరియు సొసైటీల అభివృద్ధి కొరకు కృషి చేయుచున్నది.
.....VSK telangana