Dr. Mohan Bhagwat ji |
“సత్యం, కరుణ, పవిత్రాత్మ, ఆధ్యాత్మిక సాధన అనేవి మన ధర్మానికి నాలుగు చక్రాలు. ఇది మన జాతి జీవనానికి మూలాధారమైనది. యావత్ ప్రపంచాన్ని ఉన్నతీకరించడమనే ఒక గొప్ప లక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము” అని రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్ (RSS) సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్‌జీ గురువారం నాగపూర్‌లో అన్నారు. తృతీయ వర్ష్ సంఘ్ శిక్షా వర్గ్ సమాపన్ సమారోహ్ సందర్భంగా స్వయంసేవకులను ఉద్దేశించి సర్‌సంఘ్‌చాలక్ జీ ప్రసంగించారు.
“మనం ఎవ్వర్నీ జయించాల్సిన పని లేదు, మనం అందర్నీ ఏకం చేయాలి. ఎవరినో ఓడించడానికి భారత్ పనిచేయదు” అని డా. మోహన్ భగవత్ జీ అన్నారు.
“కరోనా సమయంలో అందరికి సుపరిచితమైన సంఘ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కానీ సంఘ్ కార్యకలాపాలు ఇళ్ళ వద్ద కొనసాగాయి. కోవిడ్-19 సందర్భంగా సేవ అనేది కీలకమైన కార్యంగా స్వయంసేవకులుగా మారింది” అని తెలిపారు.
“మన ధర్మం సౌభ్రాతృత్వం, మానవత్వంలో మనుగడ సాగిస్తున్నది. అదే మన రాష్ట్ర స్వీయత్వం. అది సనాతన సంస్కృతి లేదా హిందుత్వ తప్ప మరొకటి కాదు” అని సర్‌సంఘ్‌చాలక్ జీ అన్నారు.
“హిందువులకు ప్రత్యేక భక్తి భావన ఉన్న ప్రాంతాలపై అంశాలు రేకెత్తుతున్నాయి. ముస్లిములకు వ్యతిరేకంగా హిందువులు ఆలోచించరు. నేటి ముస్లిముల పూర్వీకులు కూడా హిందువులే. వారికి శాశ్వతంగా స్వ-తంత్రం లేకుండా చేయడానికి, వారిలో నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి అది జరిగింది. కనుక వాటిని (ధార్మిక ప్రాంతాలు) పునరుద్ధరించాలని హిందువులు భావిస్తున్నారు” అని తెలిపారు.
“ఆలోచనల్లో ఏవైనా అంశాలు ఉంటే అవి బైటపడతాయి. అది ఓ ఒక్కరికి వ్యతిరేకం కాదు. దానిని ఆ విధంగా పరిగణనలోకి తీసుకోరాదు. ముస్లిములు దానిని అలా పరిగణించరాదు. హిందువులు కూడా అలా భావించరాదు. అలాంటిది ఏదైనా ఉందంటే, పరస్పర ఒప్పందం ద్వారా దానికి ఒక మార్గం కనుగొనాలి. ఒక మార్గం అనేది ఎప్పుడైనా వచ్చేది కాదు. ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఏదైతే నిర్ణయిస్తుందో దానిని ఆమోదించాలి. మన న్యాయ వ్యవస్థ సదాచారి, సర్వోన్నతమైనదిగా పరిగణించి అది తీసుకునే నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండాలి. న్యాయస్థానం తీసుకునే నిర్ణయాలను మనం ప్రశ్నించరాదు” అని డాక్టర్ మోహన్ భగవత్ జీ అన్నారు.
“మనం ఏ విధమైన పూజా పద్ధతులకు వ్యతిరేకం కాదు. వాటిని ఆమోదిస్తాము. పవిత్రమైనవిగా పరిగణనలోకి తీసుకుంటాము. వారు అలాంటి ఒక పూజా పద్ధతిని అవలంబిస్తూ ఉండవచ్చు. కానీ వారు మన రుషులు, మునులు, క్షత్రియులకు వారసులు. మనం అదే పూర్వీకులకు వారసులం” అని మాననీయ సర్‌సంఘ్‌చాలక్‌జీ తెలిపారు.
“అదృష్టవశాత్తూ, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ ఒక సమతూకమైన వైఖరిని చేపట్టింది. భారత్ దాడిని సమర్థించలేదు. రష్యాను వ్యతిరేకించలేదు. ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని రష్యాను భారత్ పదేపదే కోరుతున్నది. వ్యతిరేకిస్తున్నవారికి ఎలాంటి సదుద్దేశ్యాలు లేవు. వారు ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తున్నారు. అదెలాగంటే.. గతంలో పాశ్చాత్య దేశాలు భారత్, పాకిస్తాన్‌లను బరిలోకి దింపి వాటి సొంత ఆయుధాలను పరీక్షిస్తుండేవి. అలాంటిదే ఇక్కడ జరుగుతున్నది. భారత్‌కు సరిపడ శక్తి ఉన్న పక్షంలో అది యుద్ధాన్ని నిలువరించి ఉండేది. కానీ భారత్ అలా చేయలేదు ఎందుకంటే భారత్ శక్తి వృద్ధి చెందుతున్నది. పూర్ణ శక్తిని సంతరించుకోవలసి ఉంది. చైనా ఎందుకు వారిని నిలువరించలేదు? ఎందుకంటే అది ఈ యుద్ధంలో ఏదో కొంత చూస్తున్నది కాబట్టి. ఈ యుద్ధం మనలాంటి దేశాల భద్రత మరియు ఆర్థికపరమైన అంశాలను మెరుగుపరిచాయి. మనం మన ప్రయత్నాలను మరింత బలోపేతం చేయాలి. మహాశక్తిగా అవతరించాలి. భారత్ చేతిలో అలాంటి ఒక శక్తి ఉన్న పక్షంలో అలాంటి ఒక ఘటన ప్రపంచం ముందుకు వచ్చేది కాదు” అని డాక్టర్ మోహన్ భగవత్ జీ అన్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన భాగ్యనగర్ రామచంద్ర మిషన్ అధ్యక్షులు దాజీ ఉపాఖ్య కమలేష్ పటేల్ ప్రసంగిస్తూ “మన దేశంలో 3,000కు పైగా కులాలు, వర్గాలు, తెగలు ఉన్నాయి. ప్రతి వర్గం తమ కోసం ఏదో ఒకటి ఆకాంక్షిస్తుంటుంది. కానీ, మనమంతా దేశం కోసం ఏమి చేయగలము అనే విషయాన్ని తప్పనిసరిగా ఆలోచించాలి. మనందరితోనే దేశం ఉన్నది” అని తెలిపారు.
రేషిమ్‌బాగ్‌లోని డాక్టర్ హెగ్డేవార్ స్మృతి భవన్ ప్రాంగణంలోని మహర్షి వ్యాస్ సభాగృహ వద్ద మే తొమ్మిదవ తేదీన తృతీయ వర్ష్ సంఘ్ శిక్షా వర్గ ఆరంభమైంది. దేశవ్యాప్తంగా ఎంపికైన స్వయంసేవకులు 25 రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 96 మంది శిక్షకులు సహా మొత్తంగా 735 మంది ఈ సంవత్సరపు వర్గ్ కు హాజరయ్యారు.
Dr. Mohan Bhagwat ji |
Dr. Mohan Bhagwat ji |
Dr. Mohan Bhagwat ji |
Dr. Mohan Bhagwat ji |
Courtesy: Vishwa Samvada Kendra