Rashtra Sevika Samithi |
రాష్ట్ర సేవికా సమితి శిక్షా వర్గ భాగ్యనగర్ లోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో మే7 నుండి 22 వరకు జరుగుతున్నది. ఈ సందర్భంగా 14వ తేదీ ఉదయం 8.00 గం.లకు మైలార్ దేవ్ పల్లి గ్రామ వీధులలో పథ సంచలన్ 500 మంది ఘోష్ తో జరిగింది . అదే సమయంలో ఈ గ్రామంలోనే వేరే వీధులలో 300 మంది సేవికలతో దుర్గానగర్ లో శోభాయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాంత సహ కార్యవాహిక మాననీయ షహమీర్ జ్యోతిర్మయి గారు మాట్లాడుతూ సమితి తన శాఖల ద్వారా స్త్రీలలో ఆత్మరక్షణ, సంస్కారాలు, శక్తిసముపార్జన పెంపొందే విధంగా కార్యక్రమా లుంటాయని, మాతృశక్తిని చైతన్య పరచ డానికి కృషి చేస్తుందని తెలిపారు.
...విశ్వసంవాద కేంద్రము