వరద ప్రభావిత గ్రామానికి (RSS) 'రాష్ట్ర సేవికా సమితి' చేయూత |
గత సంవత్సరం నవంబర్లో జరిగిన వరదల కారణంగా కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామం (కడప జిల్లా రాజంపేటకు 25 కిలోమీటర్ల దూరం ) ఇంకా పరిసర గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. అందులో భాగంగా పులపుత్తూరు గ్రామం పూర్తిగా నేలమట్టమైంది. అప్పటి నుండి అనేక సంస్థలు ఆ గ్రామానికి పలు రకాలుగా సహాయం చేస్తున్నాయి. రాష్ట్ర సేవికా సమితి కూడా స్పందించి సహాయం అందించాలని నిర్ణయించింది.
రాష్ట్ర సేవికా సమితి అఖిలభారత దేవిఅహల్యాబాయి స్మారక సమితి ఆధార నిధి ద్వారా అక్కడ ఇళ్ళు కోల్పోయిన వారికి ఇళ్ళ నిర్మాణం కొరకు ఐరన్ పైపులు మరియు పంపిణీ చేయడానికి నిర్ణయించాము. 21/4/22 గురువారం నాడు మాననీయ సంధ్య టిప్రే గారు అఖిల భారత సేవా ప్రముఖ్ ప్రచారిక గారి చేతుల మీదుగా అక్కడి గ్రామ వాసులకు ఐరన్ పైపులను, కొబ్బరి మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. గ్రామంలోని అన్ని వర్గాల వారికీ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంత సంచాలిక డాక్టర్ సోమేశ్వరి గారు మరియు ప్రాంత సంపర్క ప్రముఖ్ దేవ కుమారి గారు విస్తారిక శ్రీవిద్య, రాజంపేట సేవికలు సంఘ బంధువులు పాల్గొన్నారు.
....Vishwa Samvada Kendram (ap)