Rashtrotthana |
కర్ణాటక: అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ రాష్ట్రీయతనా బుక్లెట్లను పంపిణీ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల గ్రంథాలయాలకు ఆరెస్సెస్ రాష్ట్రీయోత్తన పరిషత్ ప్రచురించిన భరతభారతి బుక్ లెట్లను ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ పంపిణీ చేస్తోంది. ఈ పుస్తకాలు నిజమైన భారతీయ చారిత్ర మరియు దేశభక్తులు యొక్క జీవిత చరిత్రలు తెలియజేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
కర్ణాటక టెక్స్ట్ బుక్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి పాఠశాలకు సుమారు 700 శీర్షికలు లభిస్తాయని. ఫిబ్రవరిలో రూ .౧.౯ (1.9) కోట్ల బడ్జెట్ తో ప్రభుత్వం నుండి ఆర్డర్ వచ్చిందని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డిపిఐ) తెలిపింది.
బుధవారం బుక్ లెట్ లను (పుస్తకాలను) తీసుకెళ్లాలని స్థానిక విద్యాధికారులు ఉన్నత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను కోరారు. ఈ బుక్ లెట్ల కోసం ప్రభుత్వం మొదట తొమ్మిదేళ్ల క్రితం ఉత్తర్వులు జారీ చేసిందని, కానీ అది ఎప్పుడూ అమలు కాలేదని సీనియర్ డీపీఐ అధికారులు తెలిపారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈ ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసి నిధులును విడుదల చేశారు.
Courtesy : R.