బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్‌రావు |
- బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్‌రావు
మంచిర్యాల: సోషల్ మీడియాలో హిందూయిజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జి పొలసాని మురళీధర్‌రావు పిలుపిచ్చారు. భారత్ నీతి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని నిర్వహించిన డిజిటల్ హిందూ ఇంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ హిందువులపై, హిందుత్వ భావాలపై ఇటీవల కాలంలో దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి బయటకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, వాటికి తొత్తుగా ఉన్న మీడియా సంస్థలు కప్పిపెడుతున్నాయని ఆరోపించారు. సామాన్యుల చేతిలో అస్త్రమైన డిజిటల్ మీడియా ద్వారా హిందుత్వంపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో హిందూ దేవాలయాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని చెబుతూ అధికార పార్టీల నేతలు, బడాబాబులు ఆలయాల భూములను కజ్జా చేస్తున్నారని మండిపడ్డారు. వాటిపై పోరాటం చేయాలని మురళీధర్‌రావు కోరారు. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, బోధన్లలోనే కాకుండా రాష్ట్రం, దేశమంతటా హిందూ ధర్మానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
...విశ్వసంవాద కేంద్రము