File photo: Dr. Mohan Bhagwat ji |
సామాజిక సమరసత ఉపన్యాసాలతో వచ్చేది కాదు- Social harmony does not come with speeches, Dr. Mohan Bhagwat ji
(నాగపూర్ నాగరిక సహకారీ బ్యాంక్ ఆధ్వర్యంలోబాళాసాహెబ్ దేవరస్ శతజయంతి సందర్భంగా ఫూజనీయ మోహన్ భాగవత్ ఉపన్యాసం 16-12-2015)
మనదేశంలో సామాజిక అసమానతలను రూపుమాపాలనే ప్రయత్నాలు గతకొన్ని దశాబ్దాలనుండి జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్ర్యం పూర్వంనుండి అనేకమంది వ్యక్తులు, సంఘసంస్కర్తలు, ఆలోచనాపరులు, సామాజిక కార్యకర్తలు, తత్త్వవేత్తలు గట్టి ప్రయత్నమే చేశారు. అయితే వారి కృషి పూర్తిగా ఫలించిందని చెప్పలేము. కులవైషవ్యూలు తగ్జి, ఏ మాత్రమూ వివక్షలేని సమాజంగా మన సంఘం రూపాంతరం చెందిందని గట్టిగా చెప్పలేము. గణనీయమైన మార్పు వచ్చినమాట వాస్తవం. ఇంకా చేయవలసింది, సాధించవలసింది చాలా ఉంది.
సామాజిక సమరసత ్రాధాన్యతగురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. ఏ దేశమైనా అత్యున్నతస్థాయికి చేరుకోవాలంటే ముందుగా కావలసింది ఆ దేశపు ప్రజలలో ఐక్యత. ఐకమత్యమే బలం. ఐకమత్యంతోనే ప్రగతి సాధ్యం. ప్రజలమధ్య సామరస్యం ఉంటే ఐకమత్యం దానంతట అదే నెలకొంటుంది. కనుక సామరస్యం ముందుగా సాధించవలసిన అత్యంత అవసరమైన అంశం. అసమానతలతో, అంతరాలతో ఛిన్నాభిన్నమయిన సమాజం ఎన్నటికీ ప్రగతిమార్గాన పయనించలేదు. పూర్వవైభవాన్ని పొందలేదు. అందుకే సామాజిక సమరసతకు అంత ప్రాముఖ్యం. ఈ సందర్భంగా అబ్రహాం లింకన్ మాటలను మనం గుర్తుచేసుకోవాలి “ A house divided against itself cannot stand".
నూటికి నూరుపాళ్ళు సమానత్వం సాధించటం ఏ సమాజంలోనైనా సాధ్యంకాదు. ఎందుకంటే ప్రతిభాపాటవాల్లో వ్యక్తివ్యక్తికి తేడాలుంటాయి. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనవాడే. శక్తియుక్తులలో కొట్టవచ్చినట్లు కన్పించే తేడాలు సహజసిద్ధంగానే ఉండేవి. ఆ తేడాలవల్ల ఏర్పడే అసమానతలుగురించి మనం ఎక్కువ ఆందోళన చెందవలసిన పనిలేదు. పుట్టుక కారణంగా, సామాజిక నేపథ్యం కారణంగా మన సమాజంలో కొనసాగుతున్న సామాజిక అసమానతలగురించే మన ఆందోళన, ఆవేదన అంతా.
వివిధత్వంలో ఏకత్వం - భారతదేశపు విశేష లక్షణం
అటువంటి అసమానతలను, అంతరాలను రూపుమాపటానికి మనం చేయవలసిన మానవ ప్రయత్నమంతా తప్పక చేయాలి. మనం చేస్తున్న ఈ కృషిలో మనం తప్పక విజయం సాధించాలి. మన సంకల్పం కారణంగా, కృషి కారణంగా సామాజిక అసమానతలు తగ్గినప్పుడే మనదేశం ఆర్థికంగా, సామాజికంగా ముందడుగు వెయ్యగల్గుతుంది. సుసంపన్నదేశంగా, దృఢమైన సమాజంగా వెలుపటి సవాళ్లను లోపటి సవాళ్లను ఎదుర్కొనగల్లుతుంది. అయితే సామాజిక అసమానతలను రూపుమాపటం అంత తేలికైన విషయంకాదు. ఎంతో పెద్ద దేశం మనది. ఎంతో వైవిధ్యంగల దేశం కూడా. సహజసిద్ధంగా ఏర్పడే అసమానతలతోపాటు, భిన్నత్వం కారణంగా కూడా ఎన్నో అసమానతలు నెలకొన్న దేశం మనది.
మన కుటుంబాలనే తీసుకోండి. కుటుంబంలోని అందరు సభ్యులూ ఒక్కలా ఉండరు. ఒకేలా ఆలోచించరు. కొందరికి చదువు బాగా వస్తుంది. కొందరికి బాగా సంపాదించే సత్తా ఉంటుంది. మరికొందరు ఇతరులమీద ఆధారపడేవాళ్ళుగా ఉంటారు. అయినా అందరిమధ్య ప్రేమాభిమానాలు ఉంటాయి. వారిమధ్య ఉండే స్వల్పమైన తేడాలకు వారు విలువయివ్వరు. తేడాలు ఉన్నా ఒకే మాటమీద ఉంటారు. ఒకే బాటలో నడుస్తారు. ఒకే కుటుంబానికి చెందినవారమనే భావనతో కుటుంబ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారు జీవనం కొనసాగిస్తుంటారు. సమానత్వం ఆధారంగానే కుటుంబ సభ్యులమధ్య సంబంధబాంధవ్యాలు నెలకొని ఉంటాయి. వెల్లివిరిసే సమత, మమతలే ఒక సంతోషకర కుటుంబంయొక్క కీలకబలం. అలాంటి కుటుంబంలో సభ్యులమధ్య భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ప్రతివారికి కనీన అవనరాలు ఉంటాయి. ఆకాంక్షలు ఉంటాయి. కాని అందరూ కుటుంబశ్రేయస్సుకోసమే పనిచేస్తుంటారు. బరువు బాధ్యతలను ఉమ్మడిగా భరిస్తారు. పరస్పర సమరసతతో, సహకారంతో ఒకరికోసం అందరూ, అందరికోసం ఒక్కరూ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు.