హోలీ |
-బలుసా జగతయ్య
ఫాల్గుణ పౌర్ణమి మన్మథుని పునఃజన్మ జరిగిన రోజు కామదహనంగా ఉత్సవం చేసుకొనుట హిందువుల సంస్కారం. పునఃస్థాపనకు ముందు గతాన్ని అంతమొందించబడుతుందని గుర్తించలేని మూర్ఖులు నాస్తిక వాదం పేరుతో ‘కామిని’ అనే రాక్షస స్త్రీని హిందువులు దహనంచేస్తుంటారు. హిందువులు పురుషాధిక్యంకలవారు, మనుస్మృతులే వీరికి ఆదర్శం కాబట్టి మనువాదులను అంతమొందించాలని వీడులకెక్కుతారు. కలియుగంలోని పరాశర స్మృతులను గుర్తించలేక కృతయుగంలోని మనుస్మృతులను ప్రస్తావించడం ‘నాస్తికుల’ అజ్ఞానానికి నిదర్శనం. వీరి పిడివాదం జాతికి, ధర్మానికి విరోధం. సనాతన సంస్కృతికి చెందిన హిందూ ధర్మం అనుసరణీయులు నాస్తికవాదుల పిడివాదుల కోరలకు బలికాకండి.
హిందూ సమాజంలోని కొంతమంది “నాస్తికులమని” అపసవ్య పదజాలానికి కంకణ బద్ధులై, విదేశీ భావజాలానికి ఊడిగం చేయుటకు సిగ్గుపడక, స్వయంప్రకటిత మేధావులుగా చెలామణి అవుతున్నారు. వీరు “జన విజ్ఞాన” వేదిక, “జన చైతన్య” వేదిక మొదలైన అనేక పేర్లతో సంస్థలను నడుపుచున్నారు. ఈ సంస్థలవారు వారి వారి వేదికల ద్వారా హిందూ సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, ధార్మికపరమైన ఉత్సవాలను, దేవీదేవతల ఆకారాలను వారి వస్త్రధారణలను, పూజా విధానాలను పరిహాసం చేస్తుంటారు. దేవతలకు జరిపే అభిషేకాలకు, అలంకరణలకు ఖర్చుచేసే డబ్బు అనాథలకు ఖర్చు చేయవచ్చు కదా? అని హిందువులను అపహాస్య ధోరణిలో నిందిస్తున్నారు. నాలుగైదు తరాల నుండి నిరంతరంగా కొనసాగుతున్న బత్తిని సోదరులు ఇచ్చే చేపమందుకు ప్రామాణికత ఏమిటని ప్రశ్నిస్తూ, దానిని నిలుపుదల చేయాలని పత్వా జారీ చేస్తుంటారు. ఇందుకు ప్రామాణికత మందు వాడిన రోగగ్రస్తులే ప్రత్యక్ష సాక్షం. వీరికి ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా? వీరి అనైతికతకు తార్కాణం.
విద్యాలయాలలో ‘లవ్ ఆఫ్ కీస్’ పేరుతో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి బహిరంగ ముద్దుల పర్వం కొనసాగించడాన్ని ప్రశ్నించకపోవడం వీరి మానసిక దౌర్బల్యం కాదా? ఇట్టి “లవ్ ఆఫ్ కీస్” కార్యక్రమాలు లవ్ జిహాద్ కు, అత్యాచారాలకు, యాసిడ్ దాడులకు, విడాకులకు, ఆత్మహత్యలకు అమాయకపు అమ్మాయిల బలిదానాలు వీరికి ఆటవిడుపులా? ఇలాంటి కార్యకలాపాలను ప్రశ్నించేవారు, ఎదిరించేవారు అభ్యుదయ భావాలను, అభివృద్ధిని అడ్డుకునేవారని, మానవ హక్కుల నిరోధకులని గొంతు చించుకుంటాడు ఈ మతి తప్పిన నాస్తికులు.
సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలలో “బీఫ్ ఫెస్టివల్” నిర్వహించడం వేల సంవత్సరాలుగా గోవులను పెంచి పోషించేవారు ఈ కార్యక్రమం చేసుకోవడం వారి హక్కని వాదిస్తారు. “బీఫ్ ఫెస్టివల్” చేయకూడదని ప్రశ్నించే వారు బీదలు మాంసం తినడాన్ని ‘మనుస్మృతు’ల ఆరాధకుల అహంకారమని, దళితుల విరోధుకులని నిందిస్తుంటారు ఈ నాస్తికులు.
“నరకాసురుడు” అనే రాజు తన రాజ్యంలోని “అప్సరస”లాంటి యవ్వన పతులను వేల సంఖ్యలో చెరబట్టి వెకిలి చేష్టలతో పైశాచికానందం పొందుతుండేవాడు.
రాజ్యాన్ని పరిపాలించే రాజు తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డలుగా భావించి వారి యోగక్షేమాలను పరిరక్షించవలసినవాడు, స్త్రీలోలుడై పురకాంతలను హింసిస్తున్న “నరకాసురుడు” ధర్మభంగం చేస్తున్నాడని గుర్తించిన శ్రీకృష్ణుడు “సత్యభామ” సమేతుడై నరకాసురున్ని వధించి ధర్మాన్ని పరిరక్షించినాడు. నరకాసురుని బందీలుగా ఉన్న స్త్రీలకు ముక్తి ప్రసాదించినాడు. తమస్సు నుండి ఉపస్సుకు వచ్చిన “కస్యలు” కృతజ్ఞతగా సత్యభామా సమేతుడైన యదుకుల కృష్ణుడిని చుట్టుముట్టి నృత్యాలతో, ఆటపాటలతో అంబరాన్నంటే సంబరాలు జరుపుకున్నారు. రాజ్యంలోని నాగరికులందరు తమ బిడ్డల జీవితపు వెలుగులను విరజిమ్ముటకు వారి వారి గృహాలను, వీధులను పుష్పాలతో అలంకరించి దీపాలతో దేదీప్యకాంతులను వెలిగించి బాణసంచా శబ్దాలతో ఆనందాన్ని వెలిబుచ్చినారు. ఇట్టి సంబరాన్నే ‘దీపావళి’ పండుగగా ఆనాటి నుండి ఈనాట్వరకు జరుపుకొనడం హిందువుల సంస్కారానికి
దర్శ హిందూ సంస్కారాలను చూపి ఓర్వలేని ‘నాస్తికులు’ దీపావళి పండగ సంబరాలు వాతావరణ కాలుష్యానికికారణమని, వాటిని జరుపకూడదని ప్రత్యక్ష ప్రసార మాధ్యమాలలో ప్రత్యక్షమై గొంతుకలు చించుకుంటారు. “దీపావళి” పండుగను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ పార్లమెంటులతో సహా ప్రపంచమంతా జరుపుకుంటున్నారన్న విషయం వీరి కండ్లకు కనిపించదు.
చేసిన పాపాలను పోగొట్టుకొనుటకు ‘నాల’ పేరుతో వేలసంఖ్యలో గొట్టెలు, ఆవులు, ఒంటెలను నిర్దాక్షిణ్యంగా ‘కబేళాలను’ మైమరిపించే విధంగా బహిరంగ ప్రదేశాలలో వాటి గొంతులు తెగ సరికి భూమినంతటిని రక్తపు దారలతో తడుపుట ‘నాస్తికులకు’ అనాగరికం అని కాని వాతావరణ కాలుష్యం అని అనిపించదా? వీటిని ప్రశ్నించే దమ్ములేని నిస్సహాయులు. హిందువుల సంస్కారాలను మాత్రమే ప్రశ్నిస్తారు. వీరు విదేశీ భావజాల
తన తండ్రి “దక్షుడు” నిర్వహిస్తున్న యజ్ఞానికిపోయి తండ్రి చేత అవమానించబడిన “సతీదేవి” అగ్నికి ఆహుతి అయినది. ఆహుతి అయిన తన ధర్మపత్ని సతీదేవిని చూసిన మహాదేవుడి మనస్సు కకావికలం చెంది ఆమె పార్థివ శరీరాన్ని భుజాన వేసుకొని ఆహా కారాలు చేస్తున్న ఘటనను గమనించిన శ్రీ మహావిష్ణువు సృష్టిని రక్షించుటలో భాగంగా ఆయన చక్రాయుధంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా అట్టి శరీరం 18 ఖండికలుగా విభజింపబడి వేరు వేరు ప్రాంతాలలో విసిరివేయబడినవి. “సతీదేవి” శరీర ఖండికలు పడిన ప్రాంతాలే అష్టాదశ పీఠాలుగా, సనాతనులైన హిందువులకు పుణ్యక్షేత్రాలు.
నిస్సహాయస్థితిలోని మహాదేవుడు ధ్యానంలో నిమగ్నమైనాడు. లయకారుడు (సృష్టిని ప్రేరేపించేవాడు) అయిన మహాశివుడి కొఱకు తపస్సు చేస్తున్న పార్వతీదేవి తపస్సు సఫలీకృతం చేయుటకు, సృష్టికార్యం స్థంభించకుండా ఫలప్రదం చేయుటకు దేవేంద్రుడి ఆజ్ఞమేరకు ‘మన్మథుడు’ శివుడిని ధ్యానం నుండి స్పృహలోనికి రప్పించుటకు ‘కామాన్ని’ (కామము అనగా కోరిక) ప్రేరేపించుటకు సంధించిన బాణానికి, కోపోద్రిక్తుడైన మహాదేవుడు త్రినేత్రం ద్వారా మన్మధుని భస్మం చేసినాడు. దేవతలు, ఋషల ప్రార్థన మేరకు మహాదేవుడు తిరిగి మన్మధునికి పునఃజన్మ ప్రాప్తింప జేసినాడు. మన్మథుని పునఃజన్మనే సృష్టికార్య పునః స్థాపన చిగురింపచేయబడుతుంది. ప్రకృతిలోని వృక్షాలు, శిశిర ఋతువు అంతానికి ఆకులు రాల్చి, వసంత ఋతువు ప్రారంభానికి చిగురించుట ప్రకృతి ధర్మం మనకు ప్రత్యక్ష సాక్షం. సనాతన సంస్కృతికి చెందిన హిందూ ధర్మం అనుసరణీయులు నాస్తికవాదుల పిడివాదుల కోరలకు బలికాకండి.
...విశ్వసంవాద కేంద్రము (తెలంగాణ) సౌజన్యంతో...