హెచ్చరిక
మానవ జీవితంలోవలెనే సంఘజీవితంలోకూడా కష్టాలకు కొజత వుండదు. కాని ఎన్ని ఎన్ని కష్టాలు ఎదిరించినా ముందంజ వేస్తూనే ఉండాలి. పరమేశ్వరుడు మన భావాలను చక్కగా గ్రహించగలడు. అందుకే ఇంతవరకూ పరమేశ్వరుని కృపాదృష్టి మనలను కాపాడుతూ వచ్చిందనీ, ఇక ముందుకూడా అలాగే కాపాడుతూ ఉంటుందనీ నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. మన హృదయాలు నిష్కల్మషంగా పవిత్రంగా వున్నాయి. మన మెట్టిపాపం చెయ్యడంలేదు. హిందూజాతికి సేవ చేయాలనే భావమే మన పహృదయంలోనూ ప్రతిరక్తకణంలోనూ వ్యాపించి వున్నది. మరొక భావానికి మన హృదయాలలో తావులేదు. మరి పరమేశ్వరుడు మనలను కృపాదృష్టితో ఎందుకు కాపాడడు ? ఈనాడు వాతావరణమంతా మనకెంతో అనుకూలంగా ఉన్నది. మన కార్యకర్తలకు ఎక్కడికి వెళ్ళినా విజయమె లభిస్తున్నది. మన ఉద్దెశమూ, కార్యమూ అత్యంత పవిత్రమైనవేకాక ప్రజాక్షేమాన్ని ఆశించేవి కాబట్టై అవి ఈశ్వరీయకార్యమని అంటున్నాము. అందుకే ఎటువంటి పరిస్థితులలోనైనా సరే, ఏ ప్రదేశంలోనైనాసరే మనకు విజయమే లభిస్తుంది.
మనం సాధించడానికి ప్రయత్నిస్తున్న ధ్యేయ మేది? మన పవిత్ర హిందూ ధర్మమూ, మన హిందూ సంస్కృతీ ప్రపంచంలో గౌరవాన్ని అమృతత్వాన్ని పొందాలనే కోరిక ఒక్కటే మనం కోరుతున్నాం. మన ధర్మం, సంస్కృతి ఎంత గొప్పవైనా వాటిని రక్షించుకునే శక్తి మనకు లేనప్పుడు ప్రపంచం వాటిని గౌరవించదు. మనం శక్తిహీనులమై ఉన్నందు వల్లనే మన జాతీ, మన సంస్కృతీ ఇంత దీనదశలో నున్నవి. ఎన్నివున్నా ముఖ్యంగా అవసరమైనది శక్తి ప్రకృతి నియమం “జీవో జీవస్య జీవనం” “బలహీనులే బలవంతులకు ఆహారం” అని దీని తాత్పర్యం. ప్రపంచంలో గౌరవంగా జీవించే అధికారం బలహీనులకు లేదు. బలవంతులకు బానిసలై జీవించమనేది వారి నొసట వ్రాసియున్నది. అడుగడుగునా అవమానాలతో, బాధలతో చివికి జీర్ణించడమే వారి జీవిత సర్వస్వం. మనపై విదేశీయులు నిరంతరం దండయాత్రలు చేయడానికి కారణం ఏమిటి? మనకు శక్తి లేదు. ఎందుకూ పనికిమాలినవారలమైనాం. మన యీ దౌర్చల్యమే ఇన్ని కష్టాలకూ కారణం. కాబట్టి మొదట ఈ బలహీనతను వేళ్ళంట తెగటత్రెంచాలి. మనం శక్తిహీనులంగా వున్నంతవరకు, సహజంగా బలవంతులు మనపై దండయాత్రలు సాగిస్తూనేవుంటారు. బలవంతులపై నింద లారోపించినందు వల్లగాని, వారిని దూషించి నందువల్లగాని లాభమేమిటి ? ఇలా చేసినందువల్ల పరిస్థితుల్లో మార్చు రాజాలదు. మనం శక్తివంతులమై వుండినట్లయితే ఇతరులకు మనపై దండయాత్రలు జరిపే సాహసం వుందేదేనా ? ఇంకేవిధంగానైనా మనల నవమానించగలిగే వారేనా ? మరి యితరులను దూషిస్తే ఏమిలాభం ? దోషం మనదైనప్పుడు దానిని గమనించి ఆ దార్చల్యాన్ని రూపుమావడానికి ప్రయత్నించాలి. “మనం శక్తిమంతులు కావాలి” అనె వాక్యమొక్కటె యింతవరకు మనపై జరిగిన అన్యాయాలకూ, దండయాత్రలకూ సమాధానం. ఇప్పుడు కూడా అదే సమాధానం.
ఈ శక్తి సముపార్దనకు సంఘటన మొక్కటే శరణ్యం. ఇతర మార్దాలద్వారా శక్తిని సమకూర్చుకోవటం అసంభవం. నేడుకూడా మన హిందువులసంఖ్య అధికముగానే ఉన్నది. ప్రపంచ జనసంఖ్యలో మన సంఖ్య అయిదవవంతు. ఇంత విశాల జనసమూహం సమైక్యమవుతే ఈ సమాజంవైపు ఇతరులెవరైనా కన్నెత్తి చూడగలరా ? అప్పుడు హిందూశక్తి ప్రపంచంలో అజేయం కాగలదని విశ్వసించండి. శక్తిసముపార్దన చేయాలని మనం సంకల్పించుకున్నాం. ఆ శక్తి సముపార్ణనకు మార్గాన్ని తెలిసికొన్నాం. కేవలం కోరికవల్లనే మనం శక్తివంతుల మవగల మనుకోవడం పొరపాటు. దానికై రేయింబవళ్ళు పాటుపడడం ఎంతో అవసరం. సంఘటనాసూత్రాన్ని అమలులోనికి తీసుకొనివస్తేనే శక్తి నిర్మాణమవుతుంది. శక్తి మాటలలోగాక క్రియలో ఉంటుంది. ఎన్ని ఉపన్యాసాలు విన్నా వినిపించినా చెప్పినట్లుగా చేయలేని పక్షంలో ధ్యేయప్రాప్తి కాగలదని పొరపాటునైనా ఆశించకూడదు.
మన సంఘటన కావలసినంతగా వృద్ధికావడంలేదు. అభివృద్ధిని అడ్డగించే లోపాలు మనలో ఏవో వున్నాయని నేననుకుంటున్నాను. ఈ సమాజంలో వ్యాపించియున్న మంచిచెడ్డలు దానిలో భాగమైన స్వయంసేవకులలోకూడా వుంటాయంటే ఆశ్చర్వములేదు. కాని యీ దోషాలన్నీ నశించాలని సంఘం_వుంటాయంటే ఆశ్చర్యములేదు. కాని యీ దోషాలన్నీ నశించాలని సంఘం వాంఛిస్తున్నది. సమాజాన్ని నాశనంచేసే దుర్గుణాలను మనం సహించం. సంఘ స్వయంసేవకులు సాంఘిక దోషాలనుంచి ముక్తులై సంఘజీవనంలో లఖించే క్రొత్తసంస్మారాలను అలవరచుకోవాలనే మనం నిత్యమూ ప్రయత్నిస్తుంటాం. ఆకర్శ్మణ్యతయే మనలో ఉన్న మొదటి సాంఘికదోషం. సంఘంలో అకర్మణ్యత అనే పేరుకూడా వినిపించకుండా వుండేంత తీవ్రంగా మనం పనిచేయాలి. మనలో సంఘకార్యంపట్ల భక్తిశద్ధలూ, దాన్ని సాధించాలనే దృథనిశ్చయమూ వున్నట్లయితే ఈ ఆకర్మణ్యత మనను ఆవహించజాలదు.
సమాజసేవ చేయడానికై పరితపించే కార్యకర్తల నధికసంఖ్యలో నిర్మించడమే సంఘం చేయదలచుకున్న పని. మీలో పనిచేయాలనే వాంఛ ఉన్నట్లయితే, స్వయంస్స్ఫూర్తితో ఈ కార్యాన్నిగురించి ఆలోచించుకోవాలి. అప్పుడే మీరీ పనిని చేయగలరు. కేవలం చెప్పితేనే చేసేవాడు సరియైన కార్యకర్తకాదు. నిజమైన కార్యకర్తలు స్వయంగా ఆలోచించి తమ కార్యప్రణాళికను నిర్మించుకోవాలి. సంఘ కార్యకర్త ననుకొనే ప్రతి స్వయం సేవకుడూ తాను ప్రతిరోజూ ప్రతినెలా ఎంతపనిని చేస్తూవున్నాడో బాగా యోచించు కోవాలి. మనము చేసినపనిని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వుండాలి. మేము సంఘస్వయం 'సేవకులమనీ సంఘం 15 సంవత్సరాలలో ఇంతపని చేసిందనీ సంతోషంతో గర్విస్తూ, సోమరులుగా కాలం గడపటం వెర్రికావడమేకాకుండా కార్యహానికికూడా దారితీస్తుంది. గత 15 సంవత్సరాల కార్యంలో మనం గర్వించవలసిన దేమున్నది ? ఇన్ని సంవత్సరాలలో ఇంత కొద్దికార్యమే సాధించగలిగామనే విచారం నిజంగా మనలను వేధించాలి. ఇంకా ఎంతపని చేయవలసివున్నదో గమనించి మన బాధ్యతలను గుర్తించాలి. కొద్దిలో తృప్పిపొందడం మనకు పనికిరాదు. ఎంతపని చేసినా అది తక్కువే. మనలో తప్పులనేకంగా వుండబట్టే ఎక్కువపని జరుగలేదు. ఆ తప్పులను త్వరలో తొలగించుకోడానికి ప్రయత్నించాలి. మన తప్పులను మనం తొలగించుకోకపోతే మరెవ్వరు తొలగిస్తారు ? నాగపూర్ నగరం, నాగపూర్‌జిల్లా ఈ రెండూ మన సంఘ కార్యానికి కేంద్రస్థానాలు; ఇక్కడనుంచే ఉత్సాహతరంగాలు నాలుగువైపులా వ్యాపించాలి. మన కేంద్రాన్ని అన్ని విధాలా పుఠరోగమింపచేస్తూ, ఇతర ప్రాంతాలకు ఈ పనిలో సాయపడగలిగి ఉండాలి. సమస్త హిందూరాజ్యాన్ని మనతోపాటే ముందుకు నడిపించాలి. కేంద్రం అందరికన్నా ముందడుగువేస్తూ వుండనిపక్షంలో ఇతరులను ముందుకు నడిపించగలమా ? అనేక ఇతర ఉద్యమాలు అసఫలమవడానికి ఇదే కారణం. ఇతరులకు ఆదేశిస్తూ తాము వెనుకబడిపోయి నందువల్లనే ఆ ఉద్యమాలన్నీ అణగిపోయాయి. సంఘంలో ఇలాంటిది జరగకూడదు.
బాధలు వహించనిదే స్వార్డానికి స్వస్తిచెప్పనిదే ఏ కార్యమూ విజయవంతం కాదనే విషయాన్ని మీరు జ్ఞాపకముంచుకోండి. స్వార్ధత్యాగమనే శబ్దాన్ని నేను ఉపయోగించను. కాని హిందూజాతి సౌభాగ్యానికై మనమీ పనిని చేస్తున్నందువల్ల మన సౌభాగ్యంకూడా యిందులోనే ఇమీడివున్నది. మరి మన కింకొక స్వార్థం ఏమున్నది ౧? ఈ కార్యాన్ని మన హితవుకొరకే చేస్తూ ఉన్నప్పుడు స్వార్ధత్యాగం చేస్తూన్నామనుకోవడం దేనికి ? నిజంగా ఆలోచిస్తే దీన్ని స్వార్థత్యాగమనడానికే వీలులేదు. “స్వ” అనే శబ్దానికి వున్న అర్జాన్ని కొంత విశాలదృష్టితో చూడాలి. మన స్వీయహితవును సమస్త హిందూరాష్ట్ర హితవుతో ఏకరూప మొనరించాలి. అందుకే హిందూరాష్ట్ర సేవచేయడానికి ఏదో స్వార్ధత్యాగం చేశామనే అహంభావానికి కలలోనైనా మనసులో తావు ఇవ్వరాదని సంఘం పదేపదే చెప్పుతున్నది. సమాజ(ప్రేమ, కర్తవ్యపాలన ఈ రెండే జీవితానికి లక్ష్యాలుగా జీవించండి. ఇలా చేస్తే సమస్త హిందూరాష్టం మీవైపాకర్షింపబడుతుంది.
సాధ్యమైనంత త్వరలో సంఘకార్యాన్ని నెరవేర్చాలని మనం నిశ్చయించుకున్నాం. ఎంత వేగంతో పనిచేస్తే అంత త్వరగా ధ్యేయసిద్ది కలుగుతుందనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి కార్యవేగాన్ని అనేక రెట్లు అధికం చేయాలి. లోకులు నిందిస్తూవున్నా భయపడ నవసరంలేదు. మన హృదయాలు పవిత్రంగా వుంటే నిందా, స్తుతీ రెండూ సమానమే. మన సంఘటనవల్ల రాష్ట్రంలో వస్తూన్న మార్పునుచూచి మనలను నిరోధించే వారు సిగ్గుచే తలలు వంచుకుంటారు. సమాజాన్ని శక్తిమంత మొనర్చి, అజేయ మొనరించడమే మనం స్వీకరించిన కార్యం. దీన్ని చక్కగా నెరవేరిస్తే మిగతా పనులు వాటంతటవే చక్కబడతాయి. మనల నీనాడు బాధిస్తూవున్న సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమస్యలన్నీ సులభంగా పరిష్మరించబడుతాయి. సంఘం సమస్త హిందూ సమాజానికీ చెందినది. అందుకే పరిష్మరించబడుతాయి. సంఘం సమస్త హిందూ సమాజానికి చెందినది. అందుకే మనం సమాజంలోని ఏ వర్షాన్నీ ఉపేక్షాదృష్టితో చూడకూడదు. ప్రస్తుతం హెచ్చుతగ్గులు ఎన్నివున్నా హిందువులందరియెడల (ప్రేమార్ధమైన సోదరభావమే మన హృదయంలో వుండాలి. నీచుడని ఏ హిందూసోదరుణ్ణి తిరస్కరించినా అది మహాపాపమే. కనీసం సంఘ స్వయంసేవకుల హృదయాలలో ఇలాంటి సంకుచిత భావాలకు తావులేదు; హిందూదేశాన్ని హృదయపూర్తిగా పేమించే ప్రతి వ్యక్తినీ మనం సోదరునివలెనే పాటించాలి. ఇతరుల ప్రవర్తన, మాటలు ఎలావున్నా ఫరవాలేదు మన ఆచరణ ఆదర్శప్రాయంగా వుంటే హిందూ సోదరులు తప్పక మనవై పాకర్పించబడతారు. సమస్త హిందూరాష్ట్రమే మన కార్యభూమి. హిందువులందరినీ మనం హృదయాలకు హత్తుకోవాలి. మానావమానాలకు లెక్కచేయక ప్రేమతోను, వినయముతోను హిందూ సోదరులందరి దగ్గరికీ వెళ్ళండి. మీ మృదుత్వాన్నీ మీ ప్రేమ హృదయాన్నీ చూచి ద్రవించకపోవదానికీ, మీ ఆదర్శాలను వినకపోవడానికీ హిందువులు శిలాహృదయాలా ?
ఈ కార్యం కఠినమైనదని ఇతరు లెన్నిసార్లు అన్నా మన నోటినుండి మాత్రం కష్టమనేమాట రాకూడదు. ప్రపంచం దిగ్ర్భాంతి చెందేటట్లుగా మనం ఒక పనిచేసి చూపదలచుకున్నాం. సంఘం మొదట్లో ఎంత కొద్దిమందితో ఆరంభింపబడిందో మీకు తెలియదా ? ఆ నలుగు రైదుగురే తమ చెమటనోద్చి సంఘాన్ని అభివృద్ధిపరచి నేడు 70,000 మంది స్వయంసేవకులను నిర్మించారే. ఆనాడు వారిని ఏ కష్టాలూ ఎదిరించలేదా ? తప్పక ఎదిరించాయి. కాని కష్టాలన్నిటినీ అధిగమించి ముందుకు నడిచారు. నలుగురైదుగురు కలిసి తమ ప్రయత్నంవల్ల ఇంతమంది స్వయం సేవకులను నిర్మించారే. మరి ఈనాడు మనం 70,000 మందిమి వున్నాంకదా ! నేడు వేల రెట్లుగా సంఘకార్యం అభివృద్ధి చేయవచ్చు. కాని దీనికి ముందు స్వయంసేవకులు సంఘంతో లీనమవడం ఎంతో ఆవశ్యకం. ఒక సంవత్సరంపాటు సమయం దొరికితే అనేకమంది స్వయంసేవకులను నిర్మించే శక్తి ప్రతి సయం సేవకునిలోనూ ఉండాలి. కార్యకుశలురైన స్వయంసేవకులను నిర్మించలేని కార్యకర్త దేశంకొరకు ఏమీ చేయలేడు, తనవల్ల అనేక ప్రాణులు జీవించగలిగితేనే, అతడిని జీవించి వున్నవాణ్ణిగా పరిగణిస్తాం. అలాగే తనశక్తి ద్వారా అనేకమంది కార్యశీలురైన స్వయం సేవకులను నిర్మించగలిగే స్వయంసేవకుదే నిజమైన కార్యకర్త. మన యీ 70,000 మంది స్వయంసేవకులూ మరి 70,000 మంది స్వయంసేవకులను నిర్మించగలరని ఘంటాపథంగా మనం చెప్పగలిగివుండాలి. కాని ఈనాడు మనమలా చెప్పగలమా? ప్రతిఒక్క స్వయంసేవకుడు ఒక శాఖకు సమానమైనపుడే అది సాధ్యమవుతుంది.
దేశంలో జరుగుతూ ఉన్న అభ్యుదయాన్ని ఆటంకపరచాలని మనం సంఘ కార్యం చేయడంలేదు. సంఘటనవల్ల సమాజంలో అపారమైన శక్తి నిర్మింపబడుతుందని మనం చూపాలి. ఈ విషయం మనమంతా ఆలోచించాలి. క్రొత క్రొత్త మిత్రులను ఎలా సంఘంలో చేర్చాలి అనే ఆలోచన రేయింబవళ్ళు మనముందు వుండాలి. ఈ పని చేయాలనే తీవ్ర ఆవేదన మన హృదయంలో ఉందాలి. మరేపని రుచించినంతటి తీవ్ర ఆందోళన కలగాలి. ఇంత తీవ్రతతో పనిచేయని పక్షంలో సంఘం ఒక సంఘటనగా కాక నేడు దేశంలో ఉన్న సాధారణ “పార్టీలలో ఒక పార్టీగా, దేశానికి నిరుపయోగంగా మారుతుంది. మన కర్తవ్యం, మన కార్యం తప్ప మరో విషయంవైపు మనం ఆకర్షింపబదకూడదు. దేశాన్నీ సమాజాన్నీ సేవించాలనే మహత్తర ధ్యేయాన్ని ఉపాసించే స్వయంసేవకులకు ఇక సుఖాలకు తావెక్కడిది ( స్వయంసేవకులకు సంఘమే సర్వస్వం; కాబట్టి సంపూర్ణంగా కార్యరంగంలోకి ప్రవేశించాలి. అప్పుడే మన ఆదర్శాల సాఫల్యాన్ని మన కంథ్లతోచూడగలుగుతాం. సంఘంలోని ప్రతి సయంసేవకుడూ తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాడని నా విశ్వాసం.