సందేశం - Sandesam
చాలా రోజుల తరువాత మీముందు మాట్లాడే సదవకాశం నాకు లభించింది. సంఘంలో మాట్లాడే ఆవశ్యకత -ఒక విధంగా చూస్తే-లేనేలేదు. ఇంకా చెప్పడానికి మిగిలినదేమిటి ? మనం ఏమార్గాన ముందుకు నడవాలో అది చక్కగా కన్పిస్తూనే ఉన్నది. మన కార్యక్రమంకూడా నిశ్చయింపబడి ఉన్నదే. దానిని సఫల మొనరించడానికి మనం ఎంతో ప్రయత్నించాలి. మనం పరస్పరం మాట్లాడుకోవడం దేనికి ? కేవలం మాట్లాడేందుకే మాట్లాడం కదా ! ఒకరి భావాల నొకరు అర్ధంచేసుకొని ముందడుగు వేయడానికే మన యీ సంభాషణ. మన భావాలను యితరులకు తెల్పడానికి ఎంతవరకు మాట్లాడడం అవసరమో అంతవరకే మాట్లాడుతూ ఉంటాం.
ఇప్పుడు సంఘవయస్సు 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలలో మన మెంత పని చేశామో మన అందరికీ చక్కగా తెలుసు. మన మార్గానికి అద్దువస్తున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే ఇప్పటికి జరిగిన కార్యం ఏమంత తక్కువకాదు. హిందూదేశం హిందువులదే నని ఉద్దాటిస్తే, ఈ దేశాన్ని రక్షించవలసిన బాధ్యతకూడా హిందువులదే ననే విషయాన్ని సంఘం మొదట్లోనే గుర్తించింది. ఈ యిల్లు మనది; కాబట్టి ఇంటిని నిర్వహించవలసిన బాధ్యతను కాదనడానికి వీలులేదు. ఈ దేశంపట్ల (పప్రేమకానీ, అభిమానంకానీ లేని విదేశీయులు మనకేదో సాయం చేస్తారనుకోడం అనవనరవేు కాక అనుచితంకూడాను. ఈ దేశాన్ని రక్షించవలసిన బాధ్యత మనదైనట్లయితే సంఘటనతప్ప మరోమార్గంలేదు. ఈ విషయాన్ని గ్రహించినందువల్లనే హిందువులను సమైక్యపరచే బాధ్యతను సంఘం స్వీకరించింది. కాని స్వీకరించిన కార్యం తేలికయైనది కాదు. సంఘం జన్మించినప్పటి పరిస్థితులు చాలా విచిత్రమైనవి. హిందువులదీ హిందూదేశ మనడం ఉన్మత్త ప్రలాపమనీ, హిందువులను సమైక్యపరచడం దేశద్రోహమనీ పరిగణింపబడేది. అలాంటి పరిస్థితుల్లోకూడా మన కార్యం వృద్ధి చెందుతూనే వచ్చింది. మన కార్యకర్తలు అహర్నిశలు పనిచేయడమే దీనికి కారణం. లోకదూషణ, విమర్శనలను లెక్కచేయలేదు. తెరపులేకుండా మనం చేసిన ప్రయత్నంవల్లా, మనలోని నిష్టవల్లా ఈనాడు “హిందువుల దీ హిందూదేశ” మనే నినాదం నాల్టు వైపులా వ్యాపిస్తూ ఉన్నది. ఇందులో మనకు సంపూర్ణ విజయం లభించిందని నా విశ్వాసం. సిద్ధాంతాలు ఆచరణలో విజయాన్ని పొందడమే నిజమైన విజయం. లోకులు ఏమనుకున్నా మనకు భయం లేదు. నాయకులూ ప్రజలూ ఈ సంఘటన అత్యవసరమని గుర్తించారు. కొంతమంది ఉత్సాహవంతులైన కార్యకర్తలు కష్టపడ్డందువల్లనే మన యీ సంఘటన కార్యం భారతవర్షమంతటా వ్యాపిస్తోంది. నేడు 600లకు పైగా శాఖ లున్నాయి. దాదాపు 70,000 మంది స్వయంసేవకులు పనిచేస్తున్నారు.
మరి ఇలా చెమట ఓద్చి చివరకు సంఘం చేయదలచుకున్నదేమిటి? సంఘం హిందూ సమాజాన్ని బలిష్ట మొనరించాలని ప్రయత్నిస్తున్నది. “ఎంత బలం కావాలి ? బలాన్ని పరీక్షించడం ఎలా ?” అని మీరడగవచ్చు. మన శక్తిని మనమే కాక ఇతరులుకూడా గుర్తించగలగడ మనేది దీనికి సమాధానం. బలాబలాలు ప్రత్యక్షంగా కన్పిస్తూనే వుంటాయి. హిందూజాతి బలహీనంగా వున్నదని చెప్పడానికి కారణం తన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టుకోడానికి అవసరమైన శక్తి లేకపోవడమేనని చెప్పాలి. హిందువులపై ఇతరులెవరూ దండయాత్రలు చేయలేనంతగా హిందూజాతిని శక్తివంతం చేయాలని సంఘం ప్రయత్నిస్తున్నది. ప్రపంచంలో మనకు అజేయమైనశక్తి లభించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
15 సంవత్సరాలనుంచి మనం పనిచేస్తూ వున్నాం. ఇది అల్ప్బకాలంకాదు. మరి ఇన్ని సంవత్సరాల ప్రయత్నం తర్వాత మనం ధ్యేయానికి ఎంత దగ్గరగా వచ్చాం ? ఈ 15 సంవత్సరాలలో పంజాబ్, బెంగాల్, బీహార్ మొదలైన అనేక దూరప్రాంతాలలో కార్యవిస్తరణ జరిగింది; మధ్యప్రాంత, బొంబాయి ప్రాంతాలలో ప్రతి తాలూకాలోనూ, ప్రతి జిల్లాలోను మన సంఘశాఖలు చక్కగా నడుస్తున్నాయి, ఇది నిజమే. కాని ఈ సంఘటనవల్ల తమశక్తి వృద్ధి అవుతూన్నదనే విశ్వాసాన్ని హిందువులందరిలో వ్యాపింపచేయగలిగామా అనేది ముఖ్యమైన ప్రశ్న హిందువు లీ సంఘటనద్వారా తమ శక్తిని గుర్తించగలిగారా ? మన ప్రాంతాన్నో లేదా మనజిల్లానో చూడండి. ఇక్కడి ప్రజల్లో మన సంఘటనపట్ల విశ్వాసాన్నీ ఆదరభావాన్నీ సృష్టించగలిగామా ? “సంఘటనాశక్తి” యొక్క మవాత్తును యితరులేమిటి, మనమే గుర్తించలేక పోయినాం. ప్రజలు ఆశ్చర్యచకితులయ్యేంత అభివృద్ధిని ఈపాటికి మనం సాధించవలసింది. సంఘం వ్యాయామశాలకాదు. సైనికశిక్షణాలయం అంతకంటే కాదు, హిందూరాష్టమంతటా ఉక్కుకన్నా సుదృఢమైన సమైక్య శక్తి దుర్గాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్న సంఘటన సంస్థ యిది. మనం ఏ క్లబ్ రూపంలోనో విద్యాసంస్థగానో వుండదలచుకుంటే ఇంత వరకు చేసిన అభివృద్ధివల్ల మనకెంతో గౌరవం లభిస్తుందని అనుకోవచ్చు. కాని అలాంటి సంస్థలకన్నా మన ధ్యేయమూ ఆదర్శమూ ఎంత గొప్పవి ! ఎంత మహత్తరమైనవి ! ఎంత విభిన్నమైనవి ! మనం సాధించిన ప్రగతిని మన గమ్యంతో పోల్చి చూచుకోవాలి, మనం ఎంత అభివృద్ధిని సాధించాం ? ఈ పాటికి సాధించవలసినదానిలో ఎంత సాధించాం ? ఎంత వెనుకబడివున్నాం ? ఈ ప్రశ్నలనుగురించి మననం చేసుకోక తప్పదు.
సంఘం ఒక మూకకాదు, బుద్ధిమంతులూ ఆదర్శవాదులూ, బాధ్యతా యుతులూనైనా వ్యక్తులతో కూడినది. కాబట్టి యిక్కడవున్న ప్రతి స్వయంసేవకుడూ కార్యకర్తగానూ నాయకుడుగానూ రాణించగలిగిన యోగ్యత ఉండాలి. కాని ఈనాడది కన్చడుతున్నదా ? హృదయాన్ని తరచి, కొంత ఆత్మపరీక్ష చేసుకొనితీరాలి. అప్పుడే మన మెక్కడ వున్నదీ తెలుసుకో గలుగుతాం.
సంథుకార్యకర్తలూ, నాయకులూ, అధికారులూ ఎక్కువ సంఖ్యలో నిర్మింపబడడానికే మనమీ శిక్షణ శిబీరాన్ని ప్రతిసంవత్సరం నడుపుతూ వుంటాం. ఇందులో పాల్గొని మనం యోగ్యతకలిగిన కార్యకర్తలుగానూ అధికారులుగానూ కావచ్చును. కాని ఎంతమంది ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటున్నారు ? చాలా కొద్దిమంది మాత్రమే. ఇలా జరగడానికి కారణం ? గంభీర హృదయంతో ఆలోచించకపోవడమూ, ఆత్మపరీక్ష చేసుకోకపోవడమూ-ఈ రెండే దీనికి కారణాలు. మనం ప్రతిరోజూ సంఘపనిని ఎంతచేస్తున్నామో, యోగ్యులైన స్వయంసేవకుల సంఖ్యను ఎంతవరకు వృద్ధిచేస్తున్నామో ప్రతి స్వయంసేవకుడూ ఎల్లప్పుడూ ఆలోచించుకోవాలి. అందరివలె దైనిక కార్యక్రమంలో మనంకూడా పాల్గొంటాం. కాని సంఖ్యను పెంచడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నామా ? సంఘం సజీవమైన సంఘటన సంస్థ ఐనందువల్ల పెరుగుదల తప్పక జరుగుతూవుండాలనే విషయాన్ని మీరు విస్మరించకూడదు. అప్పుడే మనవుద్దేశాలు సఫలమవుతాయి. ధ్యేయసిద్ధికి సంఘట నాఖభివృద్ధి వేగంగా జరగాలి. సంవత్సరం మొత్తంలో ఒక్క ఐదుగురు కొత్త స్వయంసేవకులనైనా సంఘంలోకి తీసుకురాని స్వయంసేవకుణ్ణి సరియైన స్వయం సేవకుడని అనవచ్చునా ? కాని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నది ? ప్రతి సంవత్సరం కనీసం అయిదుగురినైనా సంఘంలో చేర్చే స్వయంసేవకులు మీలో ఎందరు ఉన్నారు ? చాలా కొద్దిమంది. కొత్తవారిని సంఘంలో చేర్చడమనేది చాలావరకు ఆగిపోయింది. దీనికి కారణం ? అటుయిటూ తిరుగుతూ కాలంగడిపే నవయువకులు మన పట్టణాలలో ఎంతమంది కన్పించడంలేదు ? వారిని సంఘంలోకి ఎందుకు తీసుకొనిరావడంలేదు ? హృదయపూర్తిగా ఉత్సాహంతో పనిచేసే కార్యకర్తలు కొందరు మనలో వున్నారని నేనంగీకరిస్తాను. వారి ప్రయత్నంవల్లనే సంఘం నడుస్తూన్నది. కాని అలాంటి కార్యకర్తలు చాలాకొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారుకాక సంఘంలోవున్న మిగతా స్వయంసేవకులు ఏం చేస్తున్నారు ? “నేను ఎంతమందితో స్నేహంచేస్తున్నాను ? ఎందరిని సంఘంలోకి తెస్తున్నాను” అని ప్రతి స్వయంసేవకుడూ హృదయాన్ని ప్రశ్నిస్తే ప్రత్యుత్తరం నిరాశాజనకంగా వుంటుందనే నా భయం. స్వయంసేవక సోదరులారా ! మీరొక పరమపవిత్రమైన కార్యాన్ని స్వీకరించారు, దాన్ని స్మరించండి. మీరు హిందూ రాష్ట్రాన్ని సయంపోషకమైన నిర్భయ రాష్ట్రంగా నిర్మించదలచుకున్నారు. నిజమైన జాతీయ వాదులమని భావిస్తున్నారు. కాని మీరు స్వీకరించిన ధ్యేయంతో పోలిస్తే మీరెంతవరకు సంసిద్ధులై ఉన్నారో ఎప్పుడైనా గమనించారా ? సంవత్సరంలోపల అయిదుగురినైనా సంఘంలోకి తీసుకుని రాలేకపోవటం ఎంత దుఃఖకరమైన విషయం ! ఇదేనా మీ యోగ్యత ? కొంత గంభీరంగా యోచించండి, మీ హృదయాలను మోసగించుకోకండి. మనం స్వీకరికంచిన ప్రతిజ్ఞను పాలించడానికి నిస్వార్థబుద్ధితో తను మనో ధనాల నర్చించి ప్రయత్నిస్తున్నామా ? మన యీ ప్రియతమ హిందూజాతిని ప్రపంచంలో అజేయ మొనరించడానికీ గౌరవశాలినిగా చేయడానికీ నిత్య ఆహుతి ఇస్తున్నామా ? కొద్దిగానైనా పనిచేస్తున్నామా ? మనలో ఆవేదన ఎంతవరకున్నది ? హృదయోద్వేగం కొంతయైనా వున్నదా ? పైగా "ఈ వొంటితో ఈ కంటితో” మన ఉద్దేశం ఫలించే పర్వదినం చూడాలని మనం నిశ్చయించుకున్నాం. మరి ఇది ఎలా సంభవమవుతుంది ? శతాబ్దాల పర్యంతం ఏ పాఠశాలవలెనో, ఏ వ్యాయామశాల వలెనో ఏదోవిధంగా కాలం గడపాలనే కోరిక సంఘానికి లేదు. చూస్తూ వుండగానే హిందూత్వజ్వాలలు దేశాన్నంతా ఆక్రమించాలనే మహత్తర ఆదర్శాన్ని సంఘం స్వీకరించింది.
ఈ పని చాలా కఠినమైంది; దారిలో బాధలు అనేకంగా ఉన్నాయని చాలామంది అంటారు. కష్టాలు ఉంటే ఉండవచ్చు. మనమార్దం కంటకాకీర్ణమైనదని మొదలే గ్రహించాల్సింది. మెత్తని గులాబీపువ్వులు ఈ మార్దాన వెదజల్లబడివుంటాయని ఆశించిందెవరు ? దేశానికి పూర్వవైభవం లభింపచేయడం మాటలుకాదు. అదొక అమూల్యరత్నం. దానిని కొనడానికి పూర్తిగా వెలయిచ్చి తీరాలి. ఒక్క కాణీ తక్కువైనా లభించదు. మనదేశాన్ని వైభవోపేతంగా చేయడానికి మనం వినా ఇతరులెవరు వచ్చి సర్వస్వం త్యాగం చేసి కష్టిస్తారు ? భారతభాగ్యలక్షిని మీరుకాక మరెవ్వరు ప్రసన్నం చేసుకోగలరు ? మీరే ఈ పనిని చేయాలి. రెండు మూడు వేల సంఖ్యవున్న నాలుగైదు శాఖలు నడిపినందువల్ల ఈపని నెరవేరగలదని భ్రమిస్తున్నారా ? ఎవరోవచ్చి మీ దేశాన్ని వైభవయుతంగా చేయగలరని ఆశిస్తున్నారా ? ఐతే మీరు ఉన్నది దేనికి ?
మనం అన్నీ చేయగలం. పది, పదిహేనుమంది స్వయంసేవకులను చేర్చడమేమిటి ? పర్వతాలను సహితం పిండిగొట్టగల సామర్థ్యం మనలో వున్నది. స్వయంసేవకులను చేర్చేపని బాలురుకూడా చేయగలుగుతారు. అసలు విషయం ఒకటే. సోమరితనాన్ని మనం త్యజించాలి. అదే మనకు నిజమైన శత్రువు. ఈ మాంద్యతవల్లనే సంఘస్ఫ్థానానికి పోవడంతప్ప మరొక పని చేయలేకపోతున్నాం. ఈ మాంద్యతకు స్వస్తిచెప్పి మన సర్వశక్తులూ వినియోగించి ఈ కార్యానికై తలపడితే దిగ్భ్రమ కలిగించేంత అభ్యున్నతిని మనం పొందగలుగుతాం. సోమరితనం వదిలితే చాలు. పని జరుగుతుంది. పనిచేసే పద్ధతి తెలుసా, తెలియదా అనే విషయానికి ఆరంభంలో ప్రాధాన్యం లేదు. మీరంతా ధీమంతులు. చక్కగా ఆలోచించి పనులు చేయగలరు. సమాజంలో వ్యక్తులతో ప్రవర్తించవలసిన పద్ధతులూ మెళకువలూ మీకు చక్కగా తెలుసు. పాఠశాలల్లో ఎలా వ్యవహరించాల్సిందీ, ఇంట్లోనూ, చుట్టుప్రక్కల్లోనూ వున్నవారిని ఎలా ఆకర్షించు కోవలసిందీ, మిత్రులమీదా, బంధువులమీద మన సద్గుణాలను ఎలా అంకితం చేయాల్సిందీ మీకు బాగా తెలుసు. ఐనా కార్యాభివృద్ధి కాకపోవడానికి కారణం ? శరీరంలో లోతులంట వ్యాపించిన మాంద్యమే దానికి కారణం. దానిని తుదముట్టించి చూస్తూ మీలో ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందీ మీరే చూడగలుగుతారు.
ముందుకు రంది ! మనమంతా ఒక్షటె అద్భుతమైన ఉత్సాహంతో కార్యరంగంలోకి ప్రవేశిద్దాం. స్వయంసేవకుడు నిజాయితీతో ప్రయత్నిస్తే పదుల సంఖ్యలో ఏమిటి ? అసంఖ్యాకంగా మిత్రులను సంఘంలో చేర్చగలుగుతాడు. ఈ సంవత్సరం కనీసం పదిమందినైనా కొత్త మిత్రులను సంఘంలో చేర్చితీరగలనని ప్రతి స్పయంసేవకుడూ నిశ్చయించుకోవాలి. మీరు మీ మీ నిశ్చయాలను తప్పక నెరవేర్చుకోగలరనే విశ్వాసం నాకు సంపూర్ణంగా వున్నది. కార్యారంభం తక్షణమే చేయాలి. పరీక్షల ముందు తాపత్రయపడే విద్యార్థిలా ప్రయత్నిస్తే శూన్యహస్తాలతో తిరిగి రావడమే గతి అవుతుంది. నేడే పని నారంభించండి, ఆపకుండా చేస్తూనే ఉ౦డండి.
“రేపు చేయవచ్చునని భావిస్తే మోసపోక తప్పదు. భవిష్యత్తుపై యిలా ఆశలు మోపడం శ్రేయస్కరం కాదు. ముందు పరిస్థితులు ఎలా మారనున్నాయో ఎవరి కెరుక ? ముందు ముందు బాధలు ఎప్పుడు మనపై పిడుగులు కురిపిస్తాయో ఏమో ? పనిచేయవలసింది నేడే! 'రేపులో ఆశలు నుంచుకున్నవారికి నిరాశ తప్పదు. అందుకే నేడే పని ప్రారంభించండని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు ఏర్పరచుకున్న అవధిని గుర్తుంచుకుని నిరంతరం చేస్తూనే వుండండి, పదో, పదిహేనో - మీరనుకొన్నంత మందిని సంఘంలో చేర్చడానికి ఇప్పటినుంచే ప్రయత్నించండి. కాని ఎంతమంది లభించినా వారు మాత్రం దృఢనిశ్చయం కలిగిన స్వయంసేవకులుగా, గుణవంతులుగా, సంఘానికి ఉపయోగపడేవారుగా ఉండాలి.
నేడీపని ఆరంభించకపోతే ముందుముందు మనకు విజయం లభించడం కష్టం. రెండు మూడునాళ్ళలో స్వరాజ్య మొస్తుందని మన మాశించడంలేదు. కాని శతాబ్ధాల తరబడిగా ఇలా ప్రయత్నం చేస్తూనే వుండాలని కూడా మన కోరిక కాదు. మనం జీవించి ఉండగా మన యీ ఆదర్శం సఫలమవాలని మనం కోరుకొంటున్నాం. ఇదే యుక్తియుక్తమైన కోరిక. మన పనిలో రహస్య మేమీలేదు. మనం సమాజంలో పనిచేస్తున్నాం. సమాజం మన కార్యాభివృద్ధిని తదేకంగా చూస్తున్నది. మన నాలుగువైపులా స్నేహితులూ, విరోధులూ వ్యాపించివున్నారు. స్నేహితులను మనలో లీన మొనర్చుకుంటాం. కాని మనలను శత్రువులుగా భావించుకునే పెద్దలపట్ల మనకు విద్వేషం వుండకూడదు. అలాంటివారిని చూస్తే జాలి కలగాలి. పరిపూర్ణ శ్రద్ధతో మనదారిన మనం పనిచేస్తూ నడిస్తే, దారినడ్డగించడం మాని ప్రక్కకు తొలగడంతప్ప వారికి మరొక మార్గం లేదు. మన ప్రచండ శక్తి ప్రవాహానికి వారు ఎదురు నిలువజాలరు.
ప్రస్తుత పరిస్థితి భయంకరంగానూ, సంకటమయంగానూ, వున్నదని కొందరు అంటున్నారు. కాని ఇంతకన్నా అనుకూలస్థితి ఇంతకు ముదెన్నడూ లభించలేదని నా విశ్వాసం. ప్రాణపణంగా ప్రయత్నించేందుకు అనువయిన సమయం ఇదే, ఇలాంటి అనుకూలత ఇంతకు ముందు రాలేదు. ఇకముందు ఏర్పడుతుందో లేదో చెప్పలేము. చేయవలసినదంతా ఇప్పుడదే సర్వశక్తులనూ ఉపయోగించి చేయండి. ముందు ముందు ఏమీ చేయలేని పరిస్థితు లేర్చడవచ్చు. తుపానువేగంతో నేడు ప్రపంచం ముందుకు పరుగెత్తుతూ వున్నది. మనం వెనుకంజ వేస్తే ఎలా ? చాలా క్లిష్టమైన పరిస్థితులు వచ్చాయని భయపడకండి. వెనుకంజ వేయకండి. ముందుకే సాగిపోతూ ఉండండి. ప్రతికూల పరిస్థితులనుకూడా జయించి ముందుకు నడవగలిగినవాడే ప్రపంచంలో విజయాన్ని సాధిస్తాడు. ప్రపంచం అతల్లే పువ్వుల్లోపెట్టి పూజిస్తుంది. మీరు భయపడడం దేనికి ? మనకార్యం అతణ్జ పువ్వల్లొపెట్టి పూజిస్తుంది. మిరు భయపడడం దెనికి ? మనకార్యం ఈశ్వరీయమైనది. అందుకని పరమేశ్వరుని కృపావలోకనం మనను నిరంతరం రక్షిస్తూనే ఉంటుంది. పరమేశ్వరుని ఆశీస్సులూ, మహర్షుల దీవెనలూ మనకు అండగా ఉన్నాయి. గత పధ్నాలుగు సంవత్సరాలూ విజయాన్ని సాధిస్తూవచ్చాం. ఇంతవరకు మనకు వెనుకంజ అనేది లేనేలేదు. మరి ఇంత అనుకూల పరస్థితుల్లో వెనుకంజ వేయడమా ?ద్విగుణీకృతోత్సాహంతో మనం ముందుకు నడవాలి. అలాగే నడుస్తూ వుందాం. మన ధ్యేయప్రాప్తి విషయంలో నాకు లేశమైనా అనుమానం లేదు. ఇకముందు అపారమైన వేగంతో మన కార్యం అభివృద్ధి చెందితీరుతుంది.