ప్రకాశకుల మనవి
నేడు యావద్భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తూ నిస్వార్ధసేవకు సర్వదా సంసిద్ధంగా (Ready for Selfless Service) ఉన్న సంస్థగా, హిందూదేశపు అభ్యుదయానికి అవతరించిన కల్పవృక్షంగా గుర్తింపబడుతున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తెలిసినంతగా ఆ సంస్థ స్థాపకులు ఎవరో చాలామందికి తెలియదు. ప్రసిద్ధికి దూరంగా ఉంటూ కార్యాన్ని ప్రామాణికంగా నడిపించటంలో, విస్తరింపచేయటంలో స్థాపకులు (శ్రద్ధవహించటం ఇందుకు కారణం. సంఘం విస్తరించడానికి, దృఢపడడానికి సంఘంయొక్క తత్త విజ్ఞానం ఎంత ప్రధానమైనదో, తపోమయమైన ప్రేరణదాయకమైన డా॥ హెద్దేవార్‌గారి జీవితము అంతగా ప్రధానమైనదేనని వారి జీవితంలోకి తొంగిచూసినవారు గ్రహిస్తారు.
1925లో సంఘం ప్రారంభించబడినా, రామాయణ మహాభారతాలవంటి ప్రాచీన సాహిత్యమును, కొలంబోనుండి ఆల్మోరావరకు వివేకానందస్వామి ప్రసంగములు వంటి పుస్తకాలను చదివించటమేగాని సంఘం తనదైన సాహిత్యాన్ని ప్రసంగములు వంటి పుస్తకాలను చదివించటమేగాని సంఘం తనదైన సాహిత్యాన్ని ముద్రించేపనికి చాలా సంవత్సరాలవరకు పూనుకోలేదు. 1940లో డా॥ హెడ్దేవార్ మరణించిన తర్వాతనే వారి జీవితాన్ని సంక్షిప్తంగా పరిచయంచేసే పుస్తకం హిందీలో వెలువరింపబడింది. 1962లో నాగపూర్‌లో డా॥ హెద్దేవార్‌గారి స్మృతి మందిరం నిర్మాణమైన తర్వాత ఆ వివరాలు తెలియజేసే అధ్యాయం జోడింపబడినది.
తెలుగులోకి అనువదింపబడిన ఈ పుస్తకం 1971లో మొదటిసారిగా ముద్రింపబడినది. ఆ తర్వాత సంవత్సరాలలో అనేక పర్యాయాలు ముద్రింపబదినా, 1989లో దాక్టర్‌జీ శతజయంతి సందర్భంగా తెలుగులో మరికొన్ని పుస్తకాలు ప్రచురింపబడినందునకాబోలు. కొంతకాలంగా ఈ పుస్తకం పునర్ ముద్రణం కాకుండా వుంది.
సంఘాన్ని స్థాపించి 10 సం॥లు పూర్తిఅయిన సందర్భంలో 1985లో పుణె నగరంలో డాక్టర్‌జీ చేసిన ఉపన్యాసం యొక్క హిందీ అనువాదరూపం ఇటీవల లభ్యమయింది. డాక్టర్‌జీ పలికిన వాక్యాలలోనే లభ్యమౌతున్న ఈ ఉపన్యాసానికి గల ప్రాధాన్యాన్ని గ్రహించి, దానిని తెలుగులోకి అనువదించి ప్రచురించ పూనుకున్నప్పుడు దానిని విడిగా ముద్రించటంకంటే డాక్టర్‌జీ జీవితాన్ని పరిచయం చేసే పుస్తకంలో భాగంగా ముద్రించటమే యుక్తమని తోచింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వారి ప్రచురణల విభాగం వారు వెలువరించే “నవభారతనిర్మాతలు” గ్రంథావళిలో భాగంగా డా॥ రాకేశ్‌సిన్హా రచించిన డా॥ కేశవ బలిరాంహెగ్డేవార్ గ్రంథం 2003లో హిందీలో ప్రచురితమై నాటి ప్రధాని అటల్ బిహారి వాజపేయిగారి ద్వారా ఆవిష్కృతమైంది (దాని తెలుగు అనువాదం 2004లో విడుదలైంది-అనువాదకులు వడ్డి విజయసారథి) సంఘన్థాపనకుముందు డాక్టర్‌జీ స్వాతంత్ర్య సాధనకు జైలుయాత్ర చేసిన ఘట్టం ఈ (గ్రంథంలో ఎంతో ఆసక్తికరంగా వివరింపబడినందున దానినిగూడ ప్రత్యేకానుబంధంగా చేర్చడం సముచితం అనిపించింది.
ఈ విధమైన చేర్చులతోకూడిన ఈ [గ్రంథాన్ని తెలుగుపాఠకులకు అందజేయడం నవయుగభారతి ద్వారా విశ్వభారత్'కు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తూ పాఠకులు దీనిని స్వాగతిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
- ప్రకాశకులు
విషయ సూచిక
ఈ క్రింద ఇవ్వబడిన లింకుల ద్వారా పాఠకులు online లో చదవచ్చును
కుటుంబ పరిచయం -బాల్యంలో సంస్కారాలు -వందేమాతరం ఉద్యమం-కలకత్తాలో ఆరు సంవత్సరాలు- తీవ్రజిజ్ఞాస- జైలుయాత్ర-హిందూరాషానికి తారకమంటత్రం- రాష్ట్రీయ సంఘటనోద్యమానికి అంకురార్పణ -కష్టాలు దీవెనలైనాయి. సంఘకార్యమే జీవిత లక్ష్యం-
వ్యాధి చరిత్ర-డాక్టర్జీ అంతిమ సందేశం-అంతిమ సమయం-తపోభూమిలో అంత్యక్రియలు.
ప్రాంత సంఘచాలక్ శ్రీపాధ్యేగారి ఉపన్యాసం -వృద్ధమూర్తి ఆబాజీ హెడగేవార్ ప్రసంగం-నూతన సర్ సంఘచాలక్ పూజనీయ గురూజీ ఉపన్యాసం- ప్రథమ మాసికంలో నూతన సర్‌సంఘచాలక్‌గారి ఉపన్యాసం.
రూవకల్పన -నిర్మాణం. పారంభోత్సవం -కంచి వరమాచార్యుల సందేశం-పూజనీయ శ్రీ గురూజీ ప్రసంగం-స్వయంసేవకులకు బౌద్ధిక్ వర్గ సంఘ్ స్తాపించి దశాబ్ది పూర్తయిన సందర్భంలో సంఘంయొక్క ఆత్మ దాని తత్వజ్ఞానంలో ఉన్నది-అందులోని ఒక్కొక్క శబ్దం హిందూసమాజానికి సంజీవని.
- పరమ పూజనీయ దాక్టర్‌జీ ప్రథమ మాసికం (నాగపూర్)
- 1985లో పుణేలో ప.పూ పూ. డాక్టర్ హెడ్గెవార్ ప్రసంగం :
- సంఘటనమే సామర్దానికి ఆధారం-స్వరాజ్యం బిచ్చమెత్తితే వచ్చేది కాదు, సంపాదించుకొనేది.
- హిందువుల సంఘటన బలం దేనికోసం ?.
- హిందువులది హిందూస్టాన్ .
- శివాజీనుండి ప్రేరణ పొందుదాం.
- భగవాధ్వజము - రాష్టధ్వజము.
- " మన హిందూ స్త్రీలను రక్షించుకోవాలి ".
- అమృతవాణి
- నేటి ప్రపంచం: హిందువుల స్థితి
- మనపతనానికి మూలకారణం
- స్వయంసేవకులు ఎలా ఉండాలి ?
- సిద్ధాంతము: ఆచరణ
- సంఘటన విశిష్టత: విధానం
- మన ఆదర్శం
- హెచ్చరిక
- సందేశం
- డా॥ హెడ్గేవార్ జీ పై బ్రిటీషు ప్రభుత్వ “రాజద్రోహా” నేరవిచారణ