ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్‌పై మళ్లీ గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఓ ప్రత్యేక యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా వెల్లడించడం కలకలం రేపుతోంది. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్టు దర్యాప్తు సంస్థ వెల్లడించినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
దేశవ్యాప్తంగా కుట్రలకు..
దావూద్ ఇబ్రహీంపై ఇటీవల ఎన్‌ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలను పేర్కొన్నట్టు తెలుస్తోంది. దావూద్, తన ప్రత్యేక యూనిట్‌తో కలిసి భారత్ వ్యాప్తంగా భీకర దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఎన్‌ఐఏ పేర్కొంది. బాంబు పేలుళ్ళు, కాల్పులతో దేశంలో విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్టు తెలిపింది.
ముఖ్యంగా దిల్లీ, ముంబయిపై దావూద్ దృష్టిపెట్టినట్టు వెల్లడించింది. దావూద్ హిట్ లిస్ట్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల పేర్లు ఉన్నట్టు దర్యాప్తు సంస్థ అభియోగ పత్రంలో పేర్కొందని ఆ కథనాలు తెలిపాయి.
Source: EtvBharat