సంఘటన విశిష్టత : విధానం
ప.ఫూ. డాక్టర్ హెడ్గెవార్, పుణే 1935 !
సంఘటనే రాష్ట్రానికి అపారమైన శక్తి. శక్తివల్లనే ప్రపంచంలో ఎంత క్రిషస్సమస్యయైనా పరిష్మరింపబడుతుంది. శక్తిలేని రామ్ష్రానికి ఎన్ని కోరికలున్నా ఫలించవు కాని శక్తిమంతమైన రామాలు తమ ఇచ్చానుసారం కోరిన పనిని నెరవేర్చుకుంటాయి. ఉదాహరణకు ఒక ధనవంతుని తీసుకోండి, అతని కోరికలు అతని కనుసన్నలపై నెరవేరుతుంటాయి. మేడలు మిద్దెలు కట్టుకోగలడు. ధనమెట్లా అని ఆలోచించవలసిన అవసర మతనికి లేదు. మేడ సిద్ధమవగానే ఒక చక్కని తోటకావాలని కోరితే అదీ వెంటనే నిర్మింపబడుతుంది. ప్రతిపనికీ అడుగడుగుకూ ఆగవలసిన అవసర మతనికి లేదు. శక్తిమంతమైన రాష్ట్రంకూడా ఇలాంటిదే. అన్ని ప్రశ్నలకూ శక్తి అనేది ఒక్కటే ప్రత్యుత్తరం. శక్తిలేనియెడల నీ మొర వినరు, నిన్ను గుర్తించరు. ఈ దుర్భలుడు చేసేదేమిటి అనే న్యూనభావమే దీనికంతకూ కారణం.
మానవులేకాదు. జంతువులుకూడా ఈశక్తి తత్వాన్ని సరిగా గుర్తించాయిసింహానికి వనరాజు అని బిరుదు. దాన్ని చూడగానే మిగతా జంతువులకు పైప్రాణాలు పైనే పోతాయి. నన్ను వనరాజుగా చేయండని సింహం ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. ఐనా జంతువులన్నీ నిరుత్తరంగా సింహాన్ని గుర్తించాయి. చిన్న చిన్న జంతువులే భయపడడం అటుంచి, పెద్దపెద్ద క్రూరమృగాలుకూడా
సింహగర్జన వినగానే తోకముడిచి పరుగెత్తుతాయి. ఎలాంటి ప్రచారమూ లేనిదే సింహాన్ని వనరాజుగా జంతువులన్నీ గుర్తించడంచూస్తే ప్రపంచంలో శక్తియే సర్వసమర్ధం అని స్పష్టమౌతూ వున్నది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ విషయాన్నే గుర్తించింది. సంఘ ఏదో క్రొత్త విషయాన్ని కనిపెట్టలేదు; క్రొత్తపని చేస్తున్నాననే మిథ్యాఖిమానంకూడా సంఘానికి లేదు. మరచిపోతున్న విషయాన్ని జ్ఞప్తి చేయడమే సంఘం చేస్తున్న పని. “ప్రపంచంలో శక్తియే సర్వస్వం” అనే సిద్ధాంతం సంఘం గ్రహించింది. ఆ శక్తి కొరకే సంఘం ఈ సంఘటనను నిర్మించింది. సంఘం రాజకీయాలలో ప్రవేశించనందుకు చాలామంది నేరాలు మోపుతూ వుంటారు. కాని బానిస దేశానికి స్వీేయరాజనీతి అనేది వుండజాలదు. అందుచేత సంఘం రాజకీయాలలో ప్రవేశించడమనే ప్రశ్నయే రాదు. అదీగాక మనకు రాజకీయాల అవసరమేమిటి ? హిందూదేశం హిందువులది అనే విషయాన్ని సంఘం నిరూపించదలచుకున్నది. హిందూదేశం కేవలం హిందువులభూమియే. అన్ని దేశాలలోవలె ఇక్కడకూడా ఈ దేశస్థులైన హిందువుల మాటయె చెల్లాలి అని సంఘ విశ్వాసం. సంఘం గ్రహించిన విషయం అదే. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మరో బరువును నెత్తికి ఎక్కించుకోదు.
సంఘం ప్రతిపాదించిన సిద్దాంతం ఇప్పుడు సంపూర్ణంగా జయించింది. మధురలో రెండు కసాయిశాలలు తెరువబడిన విషయాన్ని విమర్శిస్తూ ఇక్కడ పౌరభవనంలో నిన్ననే ఒక కాంగ్రెసు సోదరుడు “హిందూదేశం హిందువులదే” నని గర్జించాడు. ఈ వాక్యాన్ని ఆయన మూడుసార్లు ఉచ్చరించాడు. మూడుసార్లు చప్పట్లవర్షం కురిసింది. సంఘ మే విధంగా విజయాన్ని పొందుతున్నదో దీనివల్ల స్పష్టమవుతుంది. గడచినవారం నాగపూర్‌లో ప్రసిద్ధిచెందిన రెండు హైస్మూళ్ళ వార్షికోత్సవాల సందర్భంలో అధ్యక్షోపన్వాసం యిస్తూ ఈ విషయాలనే లోకనాయక బాపూజీ అణేగారు అన్నారు. “విద్యార్థులు తమ దేశాన్ని ధర్మాన్నీ సభ్యతనూ, సంరక్షించుకొనుటకు కావలసిన విద్యను పొందవలొనని ఆయన ఉపన్యాస సారాంశం. “విద్యార్ధులకు ఎన్ని మార్కులు వచ్చినా నాకు విచారం లేదు. కానిజీవితంలో అడుగుపెట్టిన తరువాత వా రేపని చేస్తారనేదే మనం ఆలోచించాలి” అని ఆయన అన్నారు. “నవయువకుల్లో ఆత్మగౌరవభావాన్ని మేల్మొల్పి, దేశ, ధర్మ, సంస్కృతి సభ్యతలను సంరక్షించగలిగి, క్రమశిక్షణతో ఒక నాయకుని అదుపాజ్ఞలకు లోనై పనిచేసే శక్తిమంతమైన సంఘటన నేడు దేశానికి ఎంతో అవసరం” అన్నారు. ఉపన్యాసంలో సంఘాన్ని పేర్కొంటూ స్పష్టంగా “నేను యువకుణ్ణి అయితే ఈ పాటికి సంఘంలో ప్రవేశించి ఉండేవాణ్ణి” అని ఆయన అన్నారు. సంఘం నిర్మిస్తున్న ఈ సమైక్యశక్తిని మన పెద్దలు ఎంతగా గుర్తిస్తున్నారో ఈ ఉదాహరణ స్పష్టీకరిస్తున్నది.
మొదటిరోజుల్లో ప్రజలు సంఘాన్ని సరిగా అర్ధం చేసుకొని యుందకపోవచ్చు. కాని సమైక్యతయే రాష్ట్రానికి మూలశక్తి అనే విషయం ఇప్పుడిప్పుడే ప్రజలుకూడా గ్రహిస్తున్నారు. స్వయంసేవకుల సంఖ్యను అత్యధిక వేగంతో పెంచాలి. ఇంగ్లీషులో ఒక సామెత ఉన్నది To Catch Time For-locks "కాలానికి ఒక మనిషిని పోలిన రూపం ఉందనుకుంటే, ఆ మనిషికి ముంగురులేగాని, ఇతరత్రా నెత్తిపై జట్టులేదని, కాబట్టి కాలాన్ని నిలువరించదలిస్తే, దానికంటే ముందుకు దూకి ముంగురులను పట్టి ఆపాలి, మనం వెనుకనే ఉండి దాని పిలకనో, జదనో పట్టుకుందామంటే కుదరదు అని దాని భావం. ఇది ముఖ్యమైన విషయం. మన జీవితంలో అమూల్యమైన కాలాన్ని వృధాచేస్తున్నాం. నూరు సంవత్సరాల వరకూ మీరంతా జీవిస్తారనుకోండి. మీకు పదిసంవత్సరాల వయసురాగానే ఇంకా మీ ఆయువు 90 సంవత్సరాలు మిగులుతుంది. వయస్సు పెరిగిన కొద్ది మిగిలే ఆయవు తగ్గుతూ ఉంటుంది. ఇలా మీ ఆయవు తగ్గుతూనే ఉంటుంది, కాని పెరగడమనేది లేదని గుర్తుంచుకోండి. అమూల్యమైన మన జీవితాన్ని వృధాచెయ్యక సంఘం ప్రతిపాదించిన ధ్యేయాన్ని పూర్తిచేయడానికి ప్రతి ఘడియా స్వయంసేవకులు వినియోగించాలి. సంఖ్యాభివృద్ధి కానిచో మనం చేయవలసిన పని నెరవేరదు. వ్యష్టికి సంబంధించిన కార్యంకాదు మనం చేస్తున్నది సమస్త రాష్ట్రకార్యాన్ని మనం చేయాలి. “రాష్ట్రీయ” అనే పేరు సార్థకమయ్యే తీరుగా మన కార్యక్రమాన్ని వృద్ది చేయాలి.
కేవలం సంఖ్య 'పెరగడంవల్ల లాభంలేదు. సంఖ్యాభివృద్ధితోపాటు స్వయం సేవకులలో కార్యకుశలతకూడా కావాలి. అన్ని పనులలో క్రమబద్ధంగా ముందడుగు వేయాలి. సంఘాన్ని దృష్టిలో ఉంచుకుని స్వయంసేవకుల జీవితాన్ని తదనురూపంగా తీర్చిదిద్దాలి, అతడు రోజూ చేసేదేమిటి ? అతని విశ్వాసం దృఢపడుతున్నదా లేదా ? తన మిత్రులను అతడు సంఘంలోకి చేరుస్తున్నాడా లేదా ? ఇలా చిన్నచిన్న విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించకపోతే కార్యాభివృద్ధి కావదం అసంభవం. సంఘకార్యం స్వయంసేవకుని మనస్సుకు సరిగా నచ్చిందా లేదా ? నచ్చినయెడల తదనురూపంగా అతను పనిచేస్తున్నాడా లేదా ? చేస్తున్నట్లయితే ఎంత చేస్తున్నాడు? ఈ విషయాలన్నిటినీ ఎంతో జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. ప్రతి స్వయంసేవకుడు చేసిన పనికి మనం విలువకట్ట కలిగి ఉందాలి. ఈనాడు స్వయంసేవకులు ఎంతో ఉత్సాహంతో పనిచేసి, మరునాడు మౌనంగా ఇంట్లో కూర్చోడం ఎన్నటికీ తగదు. కారణం ఏదైనాసరే స్వయంసేవకులు పనిచేయడం మానకుండా చూడడం ఎంతో అవసరం. ఒకరోజు ఎవరైనా శాఖకురాని పక్షాన వెంటనే అతని ఇంటికిపోయి రాలేకపోవటానికి కారణం తెలుసుకోవాలి. లేనిపక్షాన ఆ మరునాడుకూడా అతడు శాఖకు రాడు. మూడోనాడు శాఖకురావదానికి సంకోచిస్తాడు. నాల్గవరోజు కొంత భయంగా ఉంటుంది. అయిదో రోజునుంచి శాఖకు రాకుండా తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే స్వయంసేవకులు శాఖకు రావడం మానకుండా ఢ్రద్ధవహించి పనిచేయాలి.
ఒక్కొక్క ఊరిలో ఒక శాఖేకాక అనేక శాఖలు స్థాపించడానికి కారణం అదే. దీనివల్ల స్వయంసేవకులతో కార్యవాహకు ఎక్కువ పరిచయం, సన్నిహితత్వం ఏర్పడుతుంది. ఒకే శాఖ ఉన్నప్పుడు సంఖ్య వృద్ధిచెందుతూ ఉంటుందేకాని, సమ[గ్రంగా చూడడం అసంభవం గనుక శక్తి వృద్ధి కాదు. కార్యవాహ ఈ దృష్టితో పనిచేస్తేనే సంఘకార్యం ఫలిస్తుంది. మీరు చక్కగా సంచరిస్తూ దీక్షతో పనిచేస్తే స్వయంసేవకుల హృదయాలలో ఈ కార్యంపట్ల నిష్ట దానంతట అదే ప్రబలమవుతుంది. ఒకే పట్టణంలో అనేక శాఖలు స్టాపించినందువల్ల స్వయం 'సేవకులలో వర్గాలేర్పడి, సంకుచితత్వం వ్యాపించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా కనిపెడుతూ, కౌశల్యంతో ఇలాంటివాటిని ఆపుతుండాలి. ఎవరో ఒక వ్యక్తిపట్ల భక్తి (శ్రద్ధలు స్వయంసేవకులలో కలగకుండాకూడా చూడాలి స్వయంసేవకులలో పరస్పర (ప్రేమానురాగాలు వుండి తీరాలి. కాని ఆ ప్రేమానురాగాలు సంఘకార్య దృష్టా ఉండాలేగాని వ్యక్తిపరంగా ఉండకూడదు. కేవలం వ్యక్తి మీదనే భక్తి శ్రద్ధలు వృద్ద్ధిపొందడండల్ల సంఫఘుటనాకార్యానికి హాని సంభవిస్తుంది.
స్వయంసేవకులకు సంఘంపట్ల భక్తి శ్రద్ధలు వుండాలి. ఒకే వ్యక్తిపైననో, ఒకే శాఖపైననో, ఒకేస్థానంమీదనో మమత్వం వుండకూడదు. విచ్చిత్తికి దారితీసే ఈ విషయాలపట్ల అప్రమత్తులమై మెలగాలి. ఈ విషయాలు సంఘటనాకార్యానికి ఎంతో అవసరమైనవి. హిందూదేశంలో హిందువులు సంపూర్ణ మానవులుగా జీవించగలిగే హక్కు లభించేవరకు “సమాజకార్యంలో ప్రవేశించినా నా వ్యక్తిగత ఆశయాలు నాకు ఉండితీరాలి” అనే వాక్యాన్ని ఉచ్చరించకూడదు. తమ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నదీ, స్వయంసేవకులను ఎలా నిర్మించాల్సిందీ సంఘాధికారులూ, శిక్షకులూ ఆలోచించుకోవాలి. స్వయం సేవకులను సంఘంలో లీనంచేసి “నేనే సంఘాన్ని సంఘమే నేను” అని అనగలిగేంత పరిస్థితిని నిర్మించాలి. ప్రతి వ్యక్తి ముందు ఈ ధ్యేయ జ్యోతియే ఉండాలి. ఈ జ్యోతిపైనే మనస్సూ దృష్టీ ఏకాగ్రంకావాలి. మరొక్కసారి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వ్యక్తి ప్రేమ సంఘానికి అడ్డంకులు కల్పించే పక్షంలో మీ హృదయాలలో అలాంటి ప్రేమకు స్థానం ఇవ్వకండి. వ్యక్తులపట్ల ప్రేమకు తావు ఇవ్వకూడదు.
మనం ఒక పనిని చేయాలని సంకల్పించాం. ఆ పని చేయడానికి ప్రోత్సహించే ఒక మహోత్తమ ఆదర్శంకూడా మనసమక్షంలో ఉన్నది. ఆ ఆదర్శాన్ని సాధించడానికి ఎంతపని చేస్తున్నాం ? మనం ఎంత వేగంతో ఈ కార్యాన్ని విస్తరింపచేస్తున్నామో ఆ వేగం మన ఆదర్భంతో పోల్చుకుంటే సరిపోతుందా ? ఈ ప్రశ్నలను మనం ఎప్పుడూ తరచి తరచి చూచుకోవాలి. మన ఆదర్శం శీఘ్రంగా సఫలమవడానికి అవసరమైన మార్గాన్నే మనము అనుసరించాలి. లేనిపక్షంలో మన ధ్యేయం సఫలం కాజాలదు. మనముందున్న ఆదర్శాన్ని సాధించడానికి ఎంతో శక్తిని సమకూర్చుకోవాలి. దానికొణకై సంఘకార్యాన్ని వేగంగా కొనసాగిస్తూ ఉండాలి. అందుకని ఎంత త్యాగమైనాసరే చేయడానికి అందరూ సంసిద్ధులు కావాలి.
సంఘం ఈ భౌతిక ప్రపంచంలో సర్వోత్తమమైన కార్యాన్ని సాధించడానికి పూనుకున్నదని మీకు తెలుసు “చచ్చిన తరువాత మనం స్వర్గానికి ఎలా వెళ్ళగలం ? అక్కడ మనకేయేసుఖాలు లభిస్తోయనే ప్రశ్నలతో మనకు సంబంధం లేదు. సంఘకార్యాన్ని మనం జీవించివుండగానే సాధించాలి. అందుకే ప్రపంచంలోని అన్నిటికంటే అత్యుత్తమమైన ధ్యేయాన్ని సాధించడానికి సంఘం పూనుకున్నదనే విషయం మనం ఎప్పటికీ మరువకూడదు. భాగ్యవంతు డేరీతిగా కోరిన సదుపాయాలను సమకూర్చుకోగలడో సంఘటనశక్తికూడా సర్వాన్ని అలాగే సాధించుకోగలదు. రాష్ట్రీయాశయాలలో సంఘటనద్వారా సాధించుకోలేనిది ఒక్కటికూడా వుండదు. రాష్ట్రీయ దృష్టితోనే మనం నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. 24 గంటలూ రాష్ట్రీయ భావాలే మన చెవులల్లో మారు మ్రోగుతూ ఉండాలనే ఉద్దేశంతోనే మన సంస్థకు “రాష్ట్రీయ స్వయంసేవక సంఘమా” మనే నామకరణం జరిగింది. తీరా ఇంత కష్టించి సమైక్యతను సాధిస్తే దీనివల్ల ఉపయోగం ఉంటుందో ఉండదో అని శంకించే పెద్దలకు రాష్ట్రీయ సమస్యలన్నిటి పరిష్కారానికి ఈ సమైక్యతే శరణ్యం” అని ఘంటాపథంగా నేను సమాధానం ఇస్తున్నాను.
ఇక మన ఆచరణ విషయం. ఇతరులు స్వయంసేవకులను ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ ఉంటారు. అతడెలా కన్పిస్తున్నాడు ? ఎలా చూస్తాడు ? ఎలా సంచరిస్తాడు ? 24 గంటలూ అతడేమి ఆలోచిస్తూ ఉంటాడు ? తన ధ్యేయంపట్ల అతనికి విశ్వాసం, శ్రద్ధ ఎంత తీవ్రంగా ఉన్నాయి వీటన్నింటినీ ఇతరులు ఎంతో తీవ్రంగా పరీక్షిస్తుంటారు. సంఘం పది సంవత్సరాలక్రితం జన్మించింది. ఈ పది సంవత్సరాలలో మనం ఎంతపని చేశాం ? ధ్యేయాన్ని సాధించడానికి ఆ పని ఎంతవరకు సరిపోతుంది ? పరిస్థితులు చాలా క్షిష్టంగా వున్నాయని నేనుకూడా అంగీకరిస్తాను. సంఘం జన్మించినప్పుడుకూడా పనిచేయలేమేమోననే అనుమానం కలిగేంత క్లిష్టంగా పరిస్థితులుండేవి. అన్ని క్లిష్టపరిస్థితులు ఎదిరిస్తూ భయపడక ఎదురునిలచి పోరాడుతూ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తూవచ్చిన మనకు ఈనాడు క్షిషసమస్యలంటే భయం ఎందుకు కలగాలి ? ఇంతవరకు మనం నడచిన వేగం ఇప్పటివరకూ సరిపోయింది. ఇక ముందు మాట ఏమిటి ? ఇంతవరకు చేసింది చాలునని మీరు భావిస్తున్నారా ? ఇంతవరకు సాధించవలసిన విజయం సాధించలేదనీ, ఎంత చేయాలో అంతా చేయడంలేదనీ మనలోని ప్రతి స్వయంసేవకుడూ భావిస్తున్నాడని నా విశ్వాసం.
కొన్ని రోజులపూర్వం, ఒకనారి నా పర్యటనలో ఒక మిత్రుడు నాకు కన్పించాడు. “మిమృల్ని సంఘభూతం ఆవేశించిందా ?” అని నేను ఆయన్ను ప్రశ్నించాను. “ఈ సంఘభూతం ఏమిటి” అని నన్నాయన ఎదురుప్రశ్నించారు. నేనాయనకు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను. “భూతం ఒకసారి ఆవేశిస్తే మరేమీతోచదు, మరొకటి కన్పించదు. ఇలా తన ఇన్టంవచ్చినట్లు మనను నడిపించగలిగేదాన్న భూతమంటాం. ఇంకొకటి కనిపించడంమాట దేవుడెరుగు; భూతం ఆవేశించిన తరువాత వ్యక్తి తన్ను తానే మరచి పోతాడు. అలాగే ఒకసారి సంఘం ఎవరినైనా ఆవేశించిందో ఇక ఆ వ్యక్తికి ఇంకొకటి తోచదు. తన్ను తాను మరచి సంఘకార్యంలో లీనమవుతాడు. సంఘకార్యంతప్ప ప్రవంచంలో అతనికి ఇంకేమీ ఉండదు”
ఇలా చెప్పిన తరువాత ఆ మిత్రుడు తన కష్టసుఖాలను ఏకరువు పెట్టడం ఆరంభించి “ఎక్కడో ఉద్యోగంచేసే నేనేమిచేయగలనండీ” అని అన్నాడు. “మిమృల్ని ఏదైనా భూతం ఆవేశించిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ? వృత్తి ఉద్యోగాలను విస్మరిస్తారా లేదా ?” అని నేను ప్రశ్నించాను. ఆయన చాలా నిజాయితీగల్లిన మనిషి; వెంటనే అక్కడనించి లేచి వెళ్ళిపోయారు. రెండోరోజు నాదగ్గరకు వచ్చి “నిన్న మీరన్నమాటలనుగురించి రాత్రిఅంతా ఆలోచించాను. కాని మీరు నిన్న చెప్పిన భూతం నన్ను ఇంకా ఆవేశించలేదు” అని అన్నాడు.
నిజంగా ఆయన నిజాయితీ ప్రవృత్తిని చూచి నేను చాలా సంతోషించాను. అటు తరువాత చాలా రోజులకు పర్యటన సందర్భంలో ఆవూరికి వెళ్ళడం మళ్ళా తటస్థించింది. తనంతట తానేనా దగ్గరకు వచ్చి ఆయన “మీరు చెప్పిన భూతం ఆవేశించిదండీ” అని అన్నారు. ఆయన ఇప్పుడు ఎంతో పట్టుదలతో సంఘకార్యాన్ని చేస్తూ వున్నారు. స్వయంసేవక సోదరులారా ! మిమ్మల్ని నేను కోరేదొకటే. సంఘభూతాన్ని మీరంతా ఆవేశింపచేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని ఆవేశిస్తే తనంతట తానే అది ఇతరులను కూడా ఆవేళిస్తుంది. ఇక సంఘ సిద్ధాంతం సవలమవదడానికీ, కార్యాభఖీవృద్ది జరగడానికీ ఆలస్యంకానీ జాప్యంకానీ ఉందజాలదు.