ముంబై: కొంతమంది ఇస్లాంవాదులు ఎంతో చరిత్ర కలిగిన మహా కోటలను ఆక్రమిస్తున్నారు. కల్పిత పాత్రలను సృష్టించి, చరిత్రను తారుమారు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో, ఇస్లాంవాదులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుచరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ, నిబంధనలను గాలికి విసిరి, ఒక మసీదును రాయగఢ్ కోటలో అక్రమంగా నిర్మిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది.
యువరాజ్ శంభాజీ రంగంలోకి దిగి, రాయ్‌గఢ్ కోటలో నిర్మాణం గురించి పురావస్తు శాఖ వద్ద ప్రస్తావించారు. దీంతో బీజేపీ నాయకుల ప్రతినిధి బృందం ఇప్పుడు మహారాష్ట్ర కోటల వద్ద అనధికారిక నిర్మాణాలపై దృష్టి పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్, కులబాతో సహా పలు కోటల వద్ద అనధికారిక నిర్మాణాల సమస్యపై బీజేపీ నాయకులు వినయ్ సహస్రబుద్ధే, సునీల్ దేవధర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం కేంద్రానికి పిటిషన్ వేసింది.
రాజ్యసభ సభ్యుడు సహస్రబుద్ధే, బీజేపీ జాతీయ కార్యదర్శి దేవధర్, ఢిల్లీ మరాఠీ ప్రతిష్ఠాన్‌కు చెందిన వైభవ్ డాంగేల బృందం ఈ విషయమై కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ను కలిసింది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని ఫోర్ట్ విశాల్‌గడ్ నుండి ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని సహస్రబుద్ధే చెప్పారు. ‘తీవ్రమైన పరిస్థితి’ దృష్ట్యా అక్కడికక్కడే అంచనా వేయడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మేఘవాల్‌ను కోరారు.
Source: Hindupost