- మతం మార్చుకోవాలని పాఠశాలలో చిత్రహింసలు
- తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థిని… చివరకు ఆత్మహత్య
తమిళనాడు: : క్రైస్తవ మతంలోకి మారాలని ఓ విద్యార్థినిని నిత్యం పాఠశాలలో చిత్రహింసలకు గురిచేయడంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఎం.లావణ్య అరియలూరు జిల్లా వడుగపాళయం గ్రామానికి చెందినది. తిరుకట్టుపల్లి సేక్రెడ్ హార్ట్ హైస్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది.
క్రిస్టియన్ సంస్థ అయిన ఆ పాఠశాల లావణ్యను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చింది. అయితే, లావణ్య ప్రతిఘటించడంతో పండగ సెలవులకు ఆ బాలికను ఇంటికి పంపలేదు. బదులుగా, ఆమె పాఠశాలలోనే ఉంచి, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం, వంట చేయడం వంటి పనులను పాఠశాల యాజమాన్యం చేయించింది.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన లావణ్య పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఈ నెల తొమ్మిదో తేదీన జరిగింది. ఆమెకు మొదట వాంతులు కావడంతో సమీపంలోని క్లినిక్‌కి తీసుకెళ్లారు. హాస్టల్ వార్డెన్ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. ఇంటికి తిరిగి వచ్చినా లావణ్య పురుగుమందు తాగినట్లు చెప్పలేదు.
తీవ్ర అనారోగ్యానికి గురైన బాలికను తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారికి దాదాపు 85% ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. చివరకు ఆ సరస్వతీ పుత్రిక నిన్న(బుధవారం)ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది.
Source: Organiser - విశ్వసంవాద కేంద్రము