ఆర్.యస్.యస్ భగవాధ్వజము - రాష్టధ్వజము
సంఘం మననుందు నిలుపుకున్న ధ్వజము దివ్యమూ, స్ఫూర్తిదాయకమూనైన ధ్వజము. ఇది అందరు హిందువులకూ, హిందూ సంస్కృతికి ప్రతీక అయినందున ఇది మన రాష్ట్రానికి కూడా ప్రతీక అవుతున్నది. దీనిని రాష్ట్రధ్వజము (జాతీయ పతాకము) అనటం సముచితంకాదని కొందరు అంటుంటారు. వారి ఇతరులకు భయపడుతూ ఉండటమే అందుకు కారణం. ఈ కారణంగానే వేఱువేఱు జనసముదాయాలకు ప్రాతినిధ్యం వహించేలా భిన్నమైన రంగులను కూర్చి మూడురంగుల జెండానో, లేదా వెండిలా మిలమిలామెరిసే తెలుపురంగు జెండానో రూపొందించాలని యత్నిస్తూ ఉంటారు. అయితే అలా రూపొందించేది రాష్ట్రీయధ్వజం అవుతుందా ? వేల సంవత్సర ములుగా సాగివస్తున్న పురాతన రాష్ట్రానికి (జాతికి) ధ్వజం ఇప్పుడు క్రొత్తగా కూర్చియివ్వటమేమిటి ? దీనికి గుర్తింపు ఎలా వస్తుంది ? హిందువులది హిందూదేశం అయినట్లుగానే, భగవాధ్వజమే రాష్ట్రీయ ధ్వజము. మనదేశానికి అభ్యాగతులుగా వచ్చిన వారికి ఇది రుచిస్తుందా లేదా అనేది ఆలోచించవలసిన అవసరం లేదు. దీని గురించి చాలా చెప్పవలసిందేమీలేదు. ఈ రాష్ట్రీయ ధ్వజాన్ని మన పరంపరనూ, మన జాతీయ విధానాలనూ- వీటిని గౌరవించకుండా ఉండేటట్లయితే, ఎవరికీ ఇక్కడ నివసించే అధికారం ఉండదు. భగవాధ్వజం త్యాగానికి నిదర్శనం. మన ధర్మంలో త్యాగానికి అత్యంత ఉన్నతన్థాయి గౌరవముంది. సమాజంకోసం కష్టాలను సహించటాన్ని సమాజంకోసం శ్రమించిపనిచేయటాన్ని త్యాగమంటారు. ఈ త్యాగాలనుండే దేశంలో సుఖసంపదలు, సమృద్ధి సాధ్యమవుతాయి. మోక్షప్రాప్తికి త్యాగమే ఏకైక మార్గమని చెప్పబడుతున్నది... నధనేన ప్రజయా బహుధా సమేత్య, త్యాగేనైకే అమృతత్త్వం మానవాఃస్యుః అని గదా ఉపనిషద్ వ్యాకం !
కాని ఎప్పుడైనాగాని మన సమాజం త్యాగభావననే వదిలివేసి, ప్రలోభాలను తన స్వభావంగా చేసుకొనేటట్లయితే, తన ధర్మాన్ని విస్మరించినట్లయితే, తన సంస్కృతినీ ఉపేక్షించేటట్లయితే -అప్పుడు రాష్ట్రానికి (జాతికి) దుర్దినాలు సంప్రాప్తిస్తాయి. తద్వారా సంపూర్ణ మానవజాతిపై అరిష్టాలతోకూడిన సంకటాలు ముసురుకుంటాయని ప్రత్యేకించి వివరించనక్కరలేదు. అందుకే చరిత్రలో తొలిపుటలు ఆరంభమైననాటినుండి త్యాగానికి ప్రతీకగా భగవాధ్వజాన్ని మన రాష్ట్రధ్వజంగా గుర్తిస్తూ వచ్చాము. ఛత్రపతి శివాజీ ధర్మరక్షణకు సంకల్పించినపుడు ఈ ధ్వజాన్నే ఆయన స్వీకరించాడు. అంతమాత్రాన ఈ ధ్వజాన్ని శివాజీమహారాజే రూపొందింపజేశాడని అనటం సరైనదేనా ? కాదుగదా ! ఇది హిందువులందరికీ ప్రతీకగా ఉంటూ వచ్చిన ధ్వజం. హిమాలయాలలోని సర్వోచ్చశిఖరం పైన ఎగురుతూ ఉండి, హిందూధర్మంయొక్క మహత్వాన్ని యావత్రపంచానికి చాటిచెప్పే పనిని వేలసంవత్సరాలుగా చేస్తూవచ్చిన అభఖిలభారతదేశం యొక్కసనాతనహిందూ ధర్మంయొక్క విశ్వోద్ధరణ లక్ష్యంగల్లిన హిందూసంస్కృతికి చిహ్నమిది. కాబట్టిరాష్ట్రీయత్వాన్ని సూచించే గౌరవానికి ఈ ధ్వజమే అర్దమై, పాత్రమై ఉన్నది.
స్వార్థసాధనకోసం పాలన సాగించటం, అధికారం చలాయించటం, ఇతరులపైన పాలన చేయగోరటం, ప్రజలపై అత్యాచారాలు చేయటం -ఇవేవీ రాజు కర్తవ్యాలు కావు. ఇతర సమాజములపై ఆక్రమణచేయటమూ, రక్తం చిందించటమూ -రాజధర్మంకాదు. రాజు అందరినీ రక్షించేవాడు కావాలి. ప్రజలను తన కన్నబిడ్డలవలె సాకాలి. పాలన-పోషణ చూడాలి- ఇది రాజుయొక్క కర్తవ్యం. ఈ ధ్వజాన్ని చూస్తూనే రాజులో ఉదారభావాలు, కర్తవ్యమూ సహజంగా జాగ్భతమవుతాయి. హిందూధర్మం ఎంతగా ఉదాత్తమూ, ఉజ్వలమూ భవ్యమూ అయినదంతే, దీనత్వంగాని, సంకుచితమైన భావనలుగానిన స్వార్ధపూరితమైన తలంపులుగాని దీనిని తాకనైనా తాకజాలవు. యావత్తు ప్రపంచంయొక్క కల్యాణమే (సంక్షేమమే) మన ధ్యేయం. దీనికై మనమందరం తనుమనధ నాలను త్యాగంచేయాలి-మానవునికి ఈ ధ్వజం యిచ్చే సందేశమిదే. ఇంతటి ఉదాత్తమైన సందేశాన్ని దేవతుల్యమైన భగవాధ్వజం కాక మరింకేది యివ్వగల్గుతుంది?
బృహత్మార్యాలు సఫలంకావటమూ, కాకపోవటమూ ఆ కార్యాన్ని లేక ఉద్యమాన్ని నిర్వహించే, అందులో భాగస్వాములయ్యే వ్యక్తులు చేసే త్యాగాలపై ఆధారపడి ఉంటుంది. ఉద్యమంలో పాల్గొనేవారిలో స్వార్ధపరులు ఉన్నట్లయితే ఆ ఉద్యమం నామమాత్రావశేషం అయిపోవడానికి ఎంతోకాలం పట్టదు.
హిందూసమాజం చాలాకాలంగా త్యాగాలు చేయటం మరచిపోయింది. అందువల్లనే ఇప్పటి ఈ అవస్థ దాపురించింది. మనం గనుక ఉజ్జ్వలమైన భవిష్యత్తు కోరుకొంటున్నట్లయితే, త్యాగాన్ని సూచిస్తూ ఉందే భగవాధ్వజానికి మించిన గురువుఎవరూ మనకు లభించరు. ఈ గురువు బోధిస్తున్న పాఠాన్ని రాత్రింబగళ్లు మనముందు నిలుపుకొని ధ్యేయసాధనకై ప్రయత్నాన్ని అనుదినమూ సాగించాలి. మనలో సోదరప్రేమభావం అఖండంగా ధ్యేయనిష్ట అచంచలమైనదిగా ఉంచుకోవాలి. అప్పుడు సాఫల్యం తప్పక లభిస్తుంది.
హిందూస్థానంలో హిందూసంస్కృతి యాజమాన్యం వహించే స్థానంలో ఉండటం దానికి గల సహజసిద్ధమైన అధికారం. ఈ ధ్వజంయొక్క ఛాయలో ధ్యేయసిద్ధికొరకై పరిశ్రమిస్తూ వేలకొలదిగా మన పూర్వీకులు తమ జీవితాలను సమర్పించారు. ఈ ధ్వజంయొక్క గౌరవాన్ని నిలబెట్టటంకోసం తమ జీవితాలను బలిదానం కావించారు కూడా. తేజోమయమైన ఈ సంపూర్ణ ఇతిహాసానికి ఈ స్ఫూర్తిదాయకమైన పరంపరకూ త్యాగమయమైన దివ్యతత్త్వజ్ఞానమునకు, ఒక గొప్ప సంస్కృతికి ప్రతీకగా ఉండే సౌభాగ్యం లభించిన ఈ ధ్వజం మనకు స్వాభిమానాన్ని సూచించే సంకేతం, కర్తవ్యాన్ని నిర్దేశించే గురువు. ఇటువంటి పవిత్రమైన, ప్రాచీనమైన భగవాధ్వజం మనవద్ద ఉండగా, మరేదో జెండావైపు చూసి దానిని రాష్ట్రీయధ్వజంగా భావించుకోవలసిన అవసరం లేదు. హిందూస్సాన్ హిందువులది (హిందూస్సాన్ హిందువోంకాహై) అన్నది సంఘంయొక్క ఉత్కృష్టసిద్ధాంతం. భగవధద్ధ్వజం మనకు గురువు అన్నది సంఘంయొక్క నిష్ట.
ఇప్పటివరకు చెప్పినదానిని అనుసరిస్తూ ఆచరిస్తూ కార్యరతులు అవ్వండి. మనం యావత్తు హిందూదేశంలోనూ మన సంఘటనను విస్తరింపజేయవలసి ఉంది. సంఘ శాఖలను మొత్తం హిందూస్థానంలో వ్యాపింపజేయవలసియుంది. ఆ శాఖల చల్లని నీడలో హిందూసమాజము మరియు సంపూర్ణ భరతఖండానికి చెందిన దేవతలూ నిర్భయంగా విశ్రాంతి తీసుకోగల్తాలి. మనం విశ్వకల్యాణమనే మంగళకార్వ్యాన్ని, ఎటువంటి బాధలూ లేకుండా నిరంతరంగా నిర్వహించగల్తాలి. ఇటువంటి సామర్ధ్యాన్ని సంపాదించుకొనే కార్యం ఎంతో బృహత్తరమైనది. స్వయంసేవకులు లక్షల సంఖ్యలో ఉన్నా చాలరు. ఇంత పెద్ద సంఘటన తంత్రాన్ని నిర్మించటంలోను, ఆపైన దానిని పెంపొందించుకొంటూ నిలబెట్టుకోవటంలోనూ రెండు విధాలైన బాధ్యతలను మనం మనమీద వేసుకొన్నాం. మనమీద ఉన్న ఈ బాధ్యతను గ్రహించుకొని మనం పనిచేయవలసి యుంటుంది.
సంఘంయొక్క ఆత్మ ఎక్కడున్నదంటే-దాని తత్త్వజ్ఞానంలో ఉన్నది. అయితే సంఘకార్యం యొక్క రీతి, నీతి, దృష్టి బాగా అర్ధమైతేనేగాని కార్యవిస్తరణ సాధ్యంకాదు. అది పట్టువడాలంటే విశిష్టమైన వాతావరణం అత్యంత ఆవశ్యకం.ఈ విషయం ఏమరరాదు.
సంఘతత్వానికి సంబంధించిన మనం ఉపయోగించే పదజాలంలోని ఒక్కొక్క శబ్దం మోక్షానికై ఆతురపడుతున్న హిందూసమాజాన్ని పునరుజ్జీవింపజేసే సంజీవని అని[గ్రహించుకొని వేలాదిగా యువకులు మీవైపు వస్తారు. వారితో మాట్లాడుతున్నపుడు మన బాధ్యతను గుర్తెరిగి మాట్లాడాలి. సంఘటన కార్యం ఒక శాస్త్రం. అది ఒక కళకూడా. సకలశాసస్తాలలో, కళలలో రాణించడానికి ఉపయోగించే ఆధారము, ప్రగతి చెందడానికి పైకి ఎక్కడానికి ఉపకరించే నిచ్చెన, పైన మెరుస్తూ అందరికీ కనువిందు చేసే కలశముకూడా- ఈ సంఘటన కార్యమే. ఇతర శాస్తాలకంటే ఇది వందరెట్లు కఠినమైనది. ఈదారిలో నడుస్తున్న వారి నిష్టను అడుగడుగునా పరీక్షకు గురిచేస్తూ ఉండే శాస్త్రమిది. కొద్దిపాటి అశ్రద్ధ, పొరపాటు కూడా చాలా పెద్ద హానికి దారితీయగలవు. పెనుప్రమాదములకు నెలవైన ఈ వ్యాయామంలో ఏ కొంచెం పట్టు తప్పినా, సంతులనం కోల్పోయినా, భారీగానష్టం, హానీ పొంచివుంటాయి.
మనలోని భావన(ఆవేశము)లను పెంపొందించుకోవాలి. అవి ఆవిరిలాంటివి. అవి ప్రేరకశక్తి అనేమాట ఎంత వాస్తవమో, అవి ఆలోచనారహితమైనదిగా, చంచలమైనవి ఉండే ప్రమాదమూ దానిలో ఇమిడి యున్నదనేదికూడా అంతే వాస్తవం. అందుకని వాటిని తేజోవంతము, ఉత్క్మటమూ అయినవిగా చేసుకోవాలి. సామర్శాన్ని పెంచేవిగా చేసుకోవాలి. శ్రద్ధ అనే సుదృథమైన పాథేయం (దారిబత్తెం) తోడుగా ఉంటే, భావనలలోనుండి కూడా పనితీసుకోవటం కష్టంకాదు. శద్దాశీలురు, అంతఃకరణ యుక్తులు, నివ్రాపూర్వకులు అయి పనిని చేసే నిర్భయ మనస్ములైన తరుణ వయస్కులు ప్రచండమైన కార్యాన్నికూడా స్వల్ప వ్యవధిలోనే చేసి చూపించగలరు. సంఘటనం వేగంగా గుణమిచ్చే బెషధం. అది మన రోగాలనన్నింటినీ దూరం చేసే “హేమగర్భ' బషధం. స్వయంగా ధన్వంతరియే ఆ బెషధాన్ని మనకొరకు పంపించాడు. దానిని సేవించి, జీర్ణింపజేసుకోవటం మన పని. ఓషధిని తీసికొంటున్నపుడు దానికి తగిన విధంగా పథ్యమూపాటించవవలసియుంటుంది. ఈ విషయం మనం ఏమరరాదు. ఆవేశాలను మనస్సులో అదిమిపెట్టుకొని, జరుగవలసిన పనిని రాత్రి-పగలు ఆలోచనా పూర్వకంగా చేస్తూ పోవాలి.
సంఘంయొక్క ధ్యేయదృ్భష్టి అనుదినమూ వృద్ధిచెందుతూ సంఘటనలో ఎలా చోటుచేసుకోగలదు? దీని గురించి ప్రయత్నం చేయటమే మన పని.కార్యసాఫల్యము గురించిన చింత, వ్యాకులపాటు వదిలిపెట్టండి. ఇప్పుడు సంఘం బాల్యావస్థలో లేదు. ఇప్పటికి అది 10 సం॥ల వయస్సు పూర్తిచేసుకుంది. ఇది సంస్కారాలను అందిపుచ్చు కోగల వయస్సు. సంఘానికి సంస్కారాలమీద విశ్వాసం ఉంది. సంస్కారాలనుబట్టి వ్యక్తియొక్క ప్రవృత్తి రూపుదిద్దుకొంటుంది. ఒకేవిధమైన మనఃప్రవృత్తిగల వందలాది జనులు ఒకచోట చేరినపుడు సంఘటనకు పోషకమయ్యే వాతావరణం నిర్మాణ మవుతుంది. పవిత్రమైన శ్రద్ధతో నిండిన హృదయంతో, కార్యనిష్టకు అర్చితమైన వారిగా మనస్సులో నిరాశకు చోటివ్వని వ్యక్తులుగా ధైర్యాన్ని పెంపొందించుకొంటూ చైతన్యము పరవళ్లు త్రొక్కే వాతావరణం మనం నిర్మించుకొందాం- ప్రతిఒక్క స్వయంసేవకుడూ ఎక్కడికిపోయినా, తనతోపాటు సంస్మ్కారక్షమ వాతావరణాన్ని వెంట తీసికొని పోవాలి. ఆ బలం ఆధారంగా, ఎటువంటి సంస్మ్కారాలనైనా వారు నిర్మించగల్టుతారు. ఏవిధంగానూ వాతావరణాన్ని కలుషితం కానివ్వరాదు. దానిని శుద్ధంగా ఉంచటంకోసం అవసరమైతే తన పంచప్రాణాలనూ పణంగాపెట్టి రాత్రింబవళ్లూ కాపలా కాయాలి. ఎటువంటి పరిస్థితులలోనైనా సరే, తను మన ధనాలలో దేనిని కోల్పోయినా ఫరవాలేదు, ఆఖరికి ఆత్మార్పణ చేసైనా సరే, కార్యక్షమ వాతావరణాన్ని అనివార్యంగా నిలిపి ఉంచుకోవాలి. మనలో ఈ ప్రవృత్తి ఉంటే, సంఘం ఇక దేనికీ భయపడదు. సంఘంయొక్క విచారధార పవిత్రమైనది. ఆ ప్రవాహం ఏ అంతఃకరణంలోంచి ప్రవహిస్తూ ఉంటుందో, అది ఆ ప్రవాహంలో ఒక బిందువై అలరారుతుంది.
♦♦♦♦