కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని శైవక్షేత్రం యాగంటి. ఈ దేవాలయ సమీపంలో ఉన్న విలువైన నాపరాయి నిక్షేపాల కోసం మైనింగ్ మాఫియా మోతాదుకు మించి పేలుళ్లు జరుపుతోంది. ఫలితంగా ఎంతో ప్రాచీనమైన ఆలయ ప్రాంగణం దెబ్బతింటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయనగర సామ్రాజ్య రాజు హరిహర బుక్కరాయలు 1336లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెప్తోంది. పోతులూరి వీరబ్రహ్మేంద్రరస్వామి వారు ఈ పరిసరల్లోనే కాలజ్ఞానాన్ని రచించారు. అలాంటి ప్రసిద్ధ ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరుపుతున్న పేలుళ్లతో ప్రమాద స్థితికి చేరుకుంది. మెట్ల మార్గం, ప్రధాన గాలిగోపురం దెబ్బతిన్నాయి. ప్రసిద్ధి చెందిన బసవన్న మండపం ముప్పు బారిన పడి.. కూలిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.
....విశ్వసంవాద కేంద్రము