స్వయంసేవకులు ఎలా ఉండాలి ?
ప.ఫూ. డాక్టర్ హెడ్గెవార్, పుణే 1935 !
రాష్ట్రీయ స్వయంసేవక సంఘములో బాధ్యత కలిగిన స్వయంసేవకులంతా ఇక్కడ సమావేశమైనారు. వయసులో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, ప్రతి స్వయంసేవకుడూ దేశంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తియే. దేశంలో మిగిలినవారు ఈ బాధ్యతకు దూరంగా ఉండవచ్చునని నా అభిప్రాయం కాదు. రాష్మ్రానికై స్వీయ బాధ్యతలను నిర్వహించాలనే సంకల్పంతో మనం సంఘములో ప్రవేశించాం; కనుక మనపై ఎక్కువ బాధ్యత ఉన్నది. ఉదాహరణకు ఒక కుటుంబాన్ని తీసుకోండి. కుటుంబంలో అందరికీ ఒక పెద్ద ఉంటాడు. అతనిపైనే కుటుంబ పోషణ బాధ్యత ఉంటుంది. కాని దీనివల్ల కుటుంబంలోని ఇతరులు తమతమ బాధ్యతలను మరువరాదు. ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను నిర్వహించి తీరాలి. కేవలం ప్రముఖ బాధ్యత ఇంటి పెద్దపై ఉంటుంది.
ఈ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకొని తమ తమ బాధ్యతలను అందరూ నిర్వహించాలి. నిత్య జీవితాన్ని కూడా, ధ్యేయాన్ని దృష్టిలో ఉంచుకొనే మనం నడుపుకోవాలి * నా శీలం ఎలావుంది” అనే ప్రశ్న ప్రతి వ్యక్తి హృదయంలోనూ ఉండాలి. “శీలం”లో ఎలాంటి కళంకం ఉండకూడదు. ఏ ఉద్యమంలోనైనా సరే, కార్యకర్త చేసే పనిమీదకంటే అతని వ్యక్తిగత శీలంమీదనే ప్రజలదృష్టి ఉంటుంది. అందుకే వెతికినా మచ్చుకుకూడా మచ్చ కన్ప్సించనంత స్వచ్చంగా మన శీలం ఉండాలి. మనం ఏపని చేసినా నిస్వార్ధబుద్ధితో చేస్తున్నామని ప్రజలు విశ్వసించాలి. ఇతరులు మన నిష్మళంకతను చూచి ముగ్గులై అన్ని విధాల మనతో మైత్రి నెరపి, మనకు సహాయ పడడానికి పరుగులెత్తేంత ఉదాత్తమైన శీలాన్ని అలవరచుకోవాలి. సంఘాన్ని ఎదిరించి, అపహాస్య దృష్టితో చూచినవారెందరో ఈనాడు మన స్వయంసేవకుల నిష్కళంక శీలాన్ని చూచి ముగ్గులై సంఘంపట్ల అత్యంత సౌహార్దాన్ని ప్రదర్శిస్తున్నారు. మన శీలంలో ఏదో కొణత ఉన్నదని ఏ కారణంచేతనైనా వారు భావించినట్లయియితే ఇంతవరకు మనపై ఉన్న ఆదరాభిమానాలు, సంఘంపట్ల ఉన్న సౌహార్దం తొలగిపోతాయి.
ఇతరులు మనవైపు చూడడంలేదని అనుకోవడం పొరపాటు. మన కార్యక్రమాన్షీ వ్యక్తిగత జీవితాన్నీ ఎంతో పరిశీలనాత్మకమైన దృష్టితో చూస్తూ ఉంటారు. అందుకనే కేవలం వ్యక్తిగతశీలంతో తృప్పిపడడంవల్ల లాభం లేదు.సామాజిక, సాంఘిక క్షేత్రాలలోకూడా మన శీలం ఉదాత్తతనే ప్రకటించాలి. ఐతే నిష్కల్మషులం అనే తలంపువల్ల, ఇతరులకంటే మన మేదో గొప్పవారమనే భావం పొరపాటునైనా మనలో కలుగకూడదు. ఎటువంటి పరిస్థితులలోనైనాసరే, స్వప్నంలోకూడా నేను ఇతరులకన్న శ్రేష్టుడను అనే అభిమానానికి మన మనస్సులలో తావు ఇవ్వకూడదు. మనలో ఇలాంటి దురభిమాను లెవరూ లేరనే నా విశ్వాసం. “నేను రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నాను. కనుక ఇతరులకన్నా శ్రేష్టుడను, ఇతరులను కించపరచే దృష్టితో చూడడానికి నాకు అధికారం ఉన్నదని ఎవరైనా ఇక్కడ ఉన్న వారిలో భావిస్తూ ఉన్నట్లయితే, వారు అలాంటి మిథ్యాభిమానాన్ని వెంటనే తమ హృదయాలనుంచి తొలగించి వేయాలని హెచ్చరిస్తున్నాను. ఏకాంతంలో కూర్చుని గత జీవితాన్ని పూర్వపు సంఘటనలనుగురించి ఎవరికివారు పునరాలోచించుకున్నట్లయితే ఎవరితప్పులు వారికి తప్పక కనబడతాయి. “తనలోని తప్పులు తనకు కన్పించక, తాను దోషరహితుడనని భావించే వ్యక్తి” బాగుపడడం అసంభవం. తన శీలంలోని దోషాలను చూచుకోగలిగినవాడే తన జీవితాన్ని సరిదిద్దుకోగలడు. “ఇప్పుడు నా జీవితం దోషరహితంగా ఉన్నది; గతాన్ని గురించి ఇంకా ఎందుకు తర్శవితర్మాలు” అని ఏ స్వయంసేవకుడైనా భావిస్తున్నట్లయితే, అతనిలో అభివృద్ధి ఉండదు. అందుకని ఆత్మ పరీక్ష చేసుకుంటూ మనలోని దోషాలను మొదలంట తెగత్రెంచుతూ, సంఘనకార్యానికి పోషకంగా, లాభదాయకంగా వుంటూ ఇతరులను మనవైపు ఆకర్షించుకో గలిగే సుగుణాలనే అలవరచుకుందాం.
మన ఆచరణ ఇంత స్వచ్చంగా ఉంటూ స్వచ్చమైన భావాలు హృదయంలో మొలకలెత్తితే చాలు. “మనం ఎవరం ? మనకర్తవ్యం ఏమిటి? మనం ఏపని చేయాలి ? మనం ఎంతపని చేసాం ? ధ్యేయసిద్ధికి ఈ వేగంతో నడుస్తే చాలా 7” ఇలాంటి భావాలు వాటంతట అవి మన హృదయంలో మొలక లెత్తుతాయి. పై ప్రశ్నలను నిజంగా మనలో మనం తర్మించి చూసుకుంటే మనం స్వీకరించిన కార్యందృవ్టా, ప్రతిరోజూ మనం చేస్తున్నపని చాలనేచాలదు. హిందూదేశం హిందువులదనే విషయాన్ని చూపవలసినబాధ్యత మనది. ప్రపంచానికంతటికి బుజువుచేసి అందుకుగాను సంఘకార్యం ఎంత వేగంగా పురోగమించాలో మీరే ఆలోచించండి.
గత పదకొండు సంవత్సరాలనుంచి హిందూదేశం హిందువులది అని సంఘం ఉద్దాటిస్తూన్నది. సంఘం ప్రారంభింపబడిన రోజుల్లో ఈ శబ్దాన్ని ఉచ్చరించడం మహాపాపమని భావింపబదేది. ప్రజలు ఈ విషయాన్ని బిగ్గరగా అనడానికికూడా జంకేవారు. సంఘమే మొట్టమొదట ఈ వాక్యాన్ని ఉద్దాటించింది. కాని బహిరంగసభల్లో వేదికలమీద నిల్చుని ఉపన్యాసాలివ్వడమూ సంఘ సిద్ధాంతాలనుగురించి పత్రికలలో వ్యాసాలు ప్రచురించడమూ సంఘపద్ధతి కాదు. ఆధునిక ప్రపంచంలోని ప్రచార సాధనాలను ఆశ్రయించకుండానే సంఘం “కాందూదేశం హిందువులది” అనే సిద్ధాంతాన్ని కేవలం స్వయంసేవకులలోనే ప్రచారం చేసినా ఈ ప్రచారంవల్ల ప్రభావితులై ఈనాడు అనేక వేదికలమీదనుంచి అనేకులు ఈ సిద్ధాంతాలను ఉద్దాటిస్తున్నారు. కాని ఇంతటితో మనకార్యం పూర్తికాదు. ధర్మమన్నా ధర్మానికి సంబంధించిన విషయాలన్నా హిందువులకు ముఖ్యమైన విషయంగా గోచరించడంలేదు. “దేశం, ధర్మం” మొదలైన విషయాలనుగురించి ఆలోచిస్తే సంఘస్వరూపాన్ని అర్థంచేసుకోవడం కష్టంకాదు. కాని వారి హృదయాలకు ధర్మ సమాజ, రామ్మ్రాది విషయాలు నీచమైనవిగా గోచరిస్తాయి. నాలుగుగోడలమధ్య మురిగిపోవడమే వారి ఏకైక వాంఛ. దేశంలో ఏదైనా ఉద్యమం మొదలైతే దానిని “వినోదసాధనం”గా చూస్తారు. ఇలా స్వదేశోద్య మాలను “వినోదసాధనాలుగా చూడడానికి ఏకైక కారణం ఆయావ్యక్తుల్లో ఉందే సంపూర్ణస్వార్థమే. అందుకే గత 50 సంవత్సరాలనుంచి దేశాన్ని మేలుకొలపడానికి అనేక కార్యక్రమాలు నడుస్తున్నా ఈ ప్రయత్నాలవల్ల నిర్మింపబడిన కార్యకర్తల సంఖ్యను (వేళ్ళమీద లెక్కించవచ్చు. ఈ స్వార్థంవల్లనే సంఘాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సంఘధ్యేయాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం అటుంచి సంఘమెంతగా అభివృద్ధి పొందుతూవున్నదో కూడా గ్రహించలేకపోతున్నారు.
ప్రారంభంలో చెప్పినట్లు ఎలాగైతే వ్యక్తులు తమలోని లోపాలను తొలగించుకొని చక్కని జీవితాన్ని అలవరచుకోవాలో అలాగే సంఘటనలో కూడా దోషాలు ఉండకూడదు. సంఘటనలోకానీ కార్యపద్ధతిలోకాని తప్పులకు తావులేదు. సంఘం యే ఇతర రంగంలోనూ దిగదు. అందువల్లనే సంఘంమీద ఇతరుల ప్రభావం కన్పించదు. సంఘానికి సంఘటనే సర్వస్వం. ఇతర పార్టీలలోకానీ ఉద్యమాలలో కానీ ప్రవేశిస్తే సంఘంమీద ఆయా సంస్థల రంగులు కన్పించి తీరుతాయి. ఇలా సంఘం ఇతరుల ప్రభావాలకు లోనుగాదలచుకోలేదు. ఇలా ఇతర కార్యక్రమాలకు నిర్లిప్తంగా ఉన్నందువల్లనే సంఘం నిర్మాణాత్మకంగా ఏమీ చేయడంలేదనే అవవాదు బయలుదేరింది. అలా అవవాదులు వ్యాపింపచేసేవారికి సంఘటనశాస్త్ర మంటే ఏమిటో తెలియదని అనాలి “సంఘటనాద్వారా ఒక శక్తి నిర్మింపబడుతుంది. “సంఘటనలో” ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఈ విమర్శకులు ఒక విషయాన్ని గ్రహించాలి. సంఘటనలోని ప్రతిసభ్యుడు తన భావాలను ఆచరణలోనికి తీసికొనిరాకుండా ఉండలేడు. సంఘపని చేయడానికి 24 గంటలు సరిపోవనే విషయము ప్రతి స్వయం సేవకునికి తెలియును. అలాంటప్పుడు మిగతాపనులు చేయడానికి అవకాశములేకపోతే అది అతని దోషముకాని, సంఘటనదోషముకాని కాదు.
గత 50 సంవత్సరాలలో రామ్ష్రాన్ని జాగృత మొనరించడానికి జరిగిన ప్రయత్నాలవల్ల సంఘటన చాలా ఆవశ్యకమైనదని నిర్వివాదంగా అందరికీ స్ఫురించింది. రాష్ట్రానికి సంఖథుటన వినా మరొక ధ్యేయమే ఉండదని స్వయంసేవకుల విశ్వాసం. అందుకని సంఘటన కార్యక్రమం తప్ప మరి ఇతర కార్యక్రమాలకు అవకాశం లభించనియెడల వారికి ఎలాంటి విచారమూ ఉండదు. సంఘటనలో అపారమైన సామర్థ్యం వుంటుంది. ఇది ప్రతి సంఘ సభ్యుడూ గ్రహించాలి. మిగతా కార్యక్రమాలన్నింటికంటే సంఘటనే శ్రేష్టమైన కార్యం, కనుకనే మనం ఈ పనిని నెరవేరుస్తున్నాం. వ్యక్తివలె సంఘటనకూడా దోషరహితంగానే ఉండితీరాలి. మనం ఎప్పుడు ఏ తప్పుచేశామోకూడా ఒక్కొక్కసారి గుర్తువుండదు. అందుకే సంఘకార్యం చేస్తూన్నప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. సంఘంలో ప్రవేశించిన తరువాత వ్యక్తులకు “వ్యక్తిగత” మనేది ఏమీవుండదు. సంఘటనకు లాభకారి అయ్యేపనులే స్వయంసేవకులు చేయాలి. స్వయంసేవకులు వ్యక్తిగతంగా ఏపనీ చేయకూడదని దీని తాత్పర్యంకాదు. వ్యక్తిగత బాధ్యతపైన ఏ పనైనా సరే చేయవచ్చును. కాన స్వయంసేవకులు వ్యక్తిగతంగా చేసే పనుల ప్రభావం ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని సంఘంమీద పడకూడదు. వారు చేసే పనులవల్ల సంఘానికి అపకీర్తి రాకూడదు. ఈ పని చేస్తున్నందువల్ల అతని దృష్టి సంఘధ్యేయంనుంచి వేరుకాకూడదు. సంభాషణలో, ఆచరణలో, జీవితంలోని ప్రతి రంగంలోనూ తాను చేసినపనివల్ల సంఘానికి ఏ విధమైన హాని కలుగకుండా జాగ్రత్తగా
ప్రవర్తించాలి.
ఇలా దోషరహితమైన ఈ కార్యక్రమాన్ని అనుష్టించాలంటే పవిత్రశీలంతోపాటు తెలివితేటలు, ఆకర్షణశక్తి, బంగారానికి తావి అబ్బినట్లు ఉందాలి. శీలం, ఆకర్షణశక్తి, చాతుర్యం-ఈ మూడింటికి సరియైన సమన్వయం జరిగినప్పుడే సంఘం ఉత్తమన్థాయికి చేరుకుంటుంది. శీలమున్నా చాతుర్యం లేనప్పుడు సంఘకార్యాన్ని విజయవంతంగా చేయలేము. సంఘకార్యాన్ని చక్కగా నడపడానికి లోకసం[గ్రహ తత్వాన్ని పూర్తిగా గ్రహించగలిగి ఉండాలి. మీలో ఎందరో స్కూళ్ళలోనూ, కాలేజీలలోనూ చదువులు ముగించుకొని అన్యస్థానాలకు వెళ్తారు. ఆయా స్థానాలలో మీరే బాధ్యత వహించి పనిచేయాలి. పైన చెప్పిన గుణాలు సరిగాలేని పక్షంలో మీరు సంఘకార్యాన్ని సరిగా చేయలేరు. అందుకని ఇప్పటినుంచే మీరీ పనిలో అనుభవాన్ని సంపాదించండి. ఇప్పుడుచెప్పిన విషయాలను అర్ధం చేసుకొని చక్కని శీలాన్ని అలవరచుకోండి. శీలానికి ఆచరణకుశలతనూ, ఆకర్షణశక్తినీ, తెలివితటలనూ జోడించండి.