మనకు రాణాప్రతాప్ చేతక్ గురించి తెలుసు..కరణ్ సింగ్ ‘ శుభ్రక్ ‘ గురించి తెలియదు..
నిజమైన చరిత్ర VS తప్పుడు కల్పిత కథ..
కుతుబుద్దిన్ ఐబాక్..
బానిస రాజవంశం యొక్క మొట్టమొదటి పాలకుడు..ఇతని మరణం గురించి చరిత్రలో చెప్పేది పోలో ఆడుతూ గుర్రం నుండి ప్రమాదవశాత్తు పడిపోవటంతో మరణించాడు అని పుస్తకాల్లో రాశారు..
కానీ మొదటిసారిగా 11 ఏళ్ళ వయసులో గుర్రాన్ని నడిపిన ఒక యుద్ధోన్మాది మరియు గుర్రాల స్వారీపై లెక్కలేనన్ని యుద్ధాలు చేసి అక్రమంగానో సక్రమంగానో విజయాలు సాధించిన ఒక వ్యక్తి నడుస్తున్న గుర్రం నుండి పడిచనిపోయాడు అంటే ఎలా నమ్ముతాము?
ఇదీ జరిగిన చరిత్ర..
ముస్లిం చరిత్రకారులూ కాంగ్రేస్ కమ్మీల సంయుక్త రాతగాళ్ళూ మనల్ని తప్పు దోవపట్టించారు.. కుతుబుద్దీన్ ఐబాక్ మేవార్ రాజును హతమార్చి రాజపుతానాను దోచుకున్నప్పుడు యువరాజు కరణ్ సింగ్ ను ఖైదు చేశాడు. మరియు దోపిడీ సంపదతో పాటు యువరాజు..అతను ప్రేమగా పెంచుకునే ప్రిన్స్ గుర్రం ‘ శుబ్రక్ ‘ ను కూడా తనతో లాహోర్ తీసుకువెళ్లాడు.
లాహోర్లో సమయం చూసి రాకుమారుడు పారిపోవాలని ప్రయత్నం చేశాడు కానీ దురదృష్టవశాత్తు ఐబక్ సైనికులకు దొరికిపోయాడు.. దొరికిన రాకుమారుడు కరణ్ సింగ్ తలను బహిరంగంగా నరికి ఆ తలతో గుఱ్ఱము మీద కూర్చొని పోలో ఆడాలని తద్వారా రాజపుత్రులను హిందువులను భయబ్రాంతులకు గురిచేయాలని భావించాడు..
కుతుబుద్దిన్ ఐబక్ శిరస్త్రాణం ధరించి రాకుమారుడి గుర్రం శుభ్రక్ పై మైదానానికి చేరుకుకున్నాడు..మెల్లగా మైదానంలోకి ప్రవేశించిన శుభ్రక్ దూరంగా సంకెళ్లతో నిలబడ్డ తన మాస్టర్ కరణ్ సింగ్ను తక్షణమే గుర్తించింది..ఆ క్షణంలో కరణ్ సింగ్ అవమాన భారంతో తలదించుకుని మౌనంగా కన్నీళ్లు కారుస్తున్నాడు…
తన ప్రియమిత్రుడు యజమాని అయిన కరణ్ సింగ్ దుస్థితిని గమనించిన శుభ్రక్ తన యజమానికి ఏం జరుగబోతున్నదో ఊహించింది..ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయింది రెండు కాళ్ళు గాల్లోకి లేపి తనమీద కూర్చున్న కుతుబుద్దీన్ ఐబక్ ను కిందపడేసి తన బలమైన గిట్టలతో ఛాతీ మీద మొహం మీద శక్తివంతంగా తాడనం చేసి వాడు మరణించాడు అని రూఢీ చేసుకున్న తర్వాత మెరుపు లాగా తన యజమాని కరణ్ సింగ్ వద్దకు పరుగెత్తుకు వెళ్లి అతను తనమీద అధిరోహించడానికి వీలుగా నేలమీద సాగిలపడి రాకుమారుడు తనను అధిరోహించగానే మేవార్ రాజ్యం వైపు పరుగులు తీసింది.. శుభ్రక్ తన జీవితంలో అత్యంత కష్టమైన ప్రయాణాన్ని ప్రారంభించింది..
ఈ సంఘటన చూస్తున్న ప్రతివ్యక్తి మ్రాన్పడిపోయి చూస్తుండగానే లాహోర్ ను దాటవేసింది.. షుమారు 600 కిలోమీటర్లు ఆగకుండా పరుగెడుతూ మేవార్ సామ్రాజ్యం యొక్క ద్వారాల వద్ద నిలిచింది.. రాకుమారుడు పూర్తి గాయాలతో అలసటతో ‘ శుభ్రక్ ‘ మీద నుండి దిగినప్పుడు ‘ శుభ్రక్ ‘ ఒక విగ్రహం లాగా నిలబడి పోయింది..
కిందకు దిగిన కరణ్ సింగ్ ప్రేమతో కృతజ్ఞతతో శుభ్రక్ తలపై తన చేతులను ప్రేమగా వేసి నిమురుతూ ప్రేమగా ముద్దిడినప్పుడు యజమాని కళ్ళలోకి చూస్తూ తన పని పూర్తి అయిందని అర్ధం చేసుకొని తన అంతిమ శ్వాస వదిలి భూమాత ఒడిలోకి జారిపోయింది.
మనం చాలా సార్లు చేతక్ గురించి చదివాము కానీ ఈ ‘ శుభ్రక్ ‘ కథ విశ్వాసానికి పరాకాష్ట.. ఇలాంటివి మన ఆధునిక విద్య వ్యవస్థలోని సిలబస్ లో భాగంగా ఎప్పుడూ లేవూ..ఉండవు. చాల మందిని విశ్వాసానికి యజమాని పట్ల ప్రేమను చూపించిన వాటిలో చేతక్ కాకుండా ఇంకేదన్నా పేరు చెప్పగలరా అని అడిగితే.. చాలా మంది మాకు తెలియదు అన్నారు.
ప్రస్తుతం భారత చరిత్రను సరైన కోణంలో తిరగ రాస్తున్న ఈ సందర్భంలో ‘ శుభ్రక్ ‘ లాటి అమూల్యమైన జాతి రత్నాల గురించి తలుచుకోవడం మనకు స్ఫూర్తిదాయకం గా భావిస్తున్నాము..
...విశ్వసంవాద కేంద్రము