ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ |
న్యూఢిల్లీ: సేవాభావంతోనే భారతీయ సంస్కృతి సజీవంగా ఉంటుందని, అనేక నాగరికతలు పుట్టాయి, ముగిశాయి… అయితే, భారతీయ నాగరికత ప్రపంచ నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తోందని, ఎందుకంటే అది అన్నింటిని తీసుకుంటుందని, నమ్ముతుంది, దానిని ఎవరూ నాశనం చేయలేకపోయారని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. ఇక్కడ జరిగిన సంత్ ఈశ్వర్ సమ్మాన్ సరోహ్‌లో వివిధ రంగాలలో నిస్వార్థ సేవ చేసిన వారిని భగవత్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
భారతీయ సమాజ నిర్మాణం ఎవరికీ వ్యతిరేకం కాదని మోహన్ భగవత్ అన్నారు. ఎవరైనా పూజా విధానాన్ని అవలంబించినా, లేకున్నా, తన శక్తి మేరకు సేవాభావంతో పనిచేస్తారు. ఇది మానవుని ఒక స్వరూపం, ఒక వ్యక్తి స్వచ్ఛత, మర్యాద. కరుణ ఉన్నప్పుడు, అందరినీ ఒకచోట చేర్చుకోవడంలో నమ్మకంగా ఉన్నప్పుడు, ఎవరినీ వ్యతిరేకించనప్పుడు మాత్రమే ఆ మనిషి ఈ గుణాన్ని పొందుతాడు. భారతీయ సమాజం అత్యుత్తమ గుణమేమిటంటే, అది యుగాల నుండి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. యువతను మంచి నడవడిక వైపు ప్రోత్సహిస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సమాజం ముందుకు వెళ్ళాల్సిన మార్గం నిర్మాణం కాలేదు. అహంకారాన్ని పక్కనబెట్టి, సున్నితత్వం, కరుణను ప్రాతిపదికగా పనిచేస్తే, సమాజం మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరి గురించి మోహన్ భగవత్ మాట్లాడుతూ… గడచిన 200 ఏళ్లలో అత్యధికంగా భారతదేశం నుండి గొప్ప వారు తయారయ్యారన్నారు.
మానవులలో సేవా భావన ఉంది, దాని కోసం అతను సామాజికంగా లేదా ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం లేదు. పనిచేయాలనే మన ఉద్దేశం నిజాయితీగా, చిత్తశుద్ధితో ఉంటే ఆ పనిలో పోటీ పడొచ్చు. ఎటువంటి అడ్డంకులు ఉండవు. మన జీవితం నీటిబుడగ లాంటిది… మనం చేసే మంచి ధర్మాలు ఏవైనా మన కుటుంబాలపై ప్రభావం చూపుతాయి. భవిష్యత్ తరాలు ఆ సంప్రదాయాలను అనుసరిస్తాయి, వాటిని ముందుకు తీసుకువెళతాయి.
విశిష్ట అతిథి, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ సమాజం కోసం పనిచేసిన వారి కోసం ఎలాంటి ఆదరణ, గుర్తింపు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అమృత్ మహోత్సవ్‌లో మనం కూడా కొత్త గిరిజన దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని మంత్రి అన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఇప్పటినుండి ఏటా జనజాతి గౌరవ్ దివస్‌గా జరుపుకొంటున్నందుకు మేము గర్విస్తున్నాము. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసేంత వరకు నవ భారత్ కల నెరవేరదని అన్నారు.
Source: VskBharat - vsktn