హిందువులది హిందూస్థాన్
“అందరికీ అంగీకారమయ్యే ఒప్పందపు ముసాయిదా తయారు చేయండి” అని చెప్పుతున్నవారెవరు? అందరూ అంటే ఎవరు ? హిందూదేశానికి యజమానులెవరు? హిందూస్దానాన్ని ఈనాడు ఒక సత్రంగా మార్చేస్తున్నారు.
ఒకే సంస్కృతికి చెందనివారు, తమ మధ్య హితసంబంధాలు సమానంగా లేనివారు-ఇలాంటి విభిన్న దృక్పథాలు కలిగిన సముదాయాలతో కూడిన "కిచిడీ హిందూస్థానంలో తయారుచేస్తున్నారు. ఎవరికైతే ఇక్కడి మట్టిలోని కణకణమూ పవిత్రమైనదో, అటువంటి హిందూసమాజమనే కామథేనువునుండి అది పాలు ఇస్తున్నంతవరకూ పిదుగుగొని, ఆ తర్వాత కసాయివాళ్ళకు అమ్ముకొని, దాని మాంసంనుండి కూడా డబ్బు సంపాదించాలనుకొనే హృదయహీనులైన దోపిడీ గాళ్ళు ఇక్కడ మకాంవేసి ఉన్నారు. అటువంటి వారికికూడా అంగీకారమయ్యే విధంగా ముసాయిదా తయారుచేయాలా? ఇసుకనుండి తైలం తీయాలనుకొనే ఈ పని జరిగేనా ? ఆ తైలం తీసిన తర్వాత, మన శరీరంపై గాయాలకు పూస్తామని మనకు ఆశలు చూపిస్తున్నారు. అయితే అలాంటి తైలాన్ని తీయగల కార్థానా ఉంటుందా ? ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా ? కుందేటికి కొమ్ము వంధ్యకు సంతానములాగే ఇవి ఎప్పటికీ తీరని కోరికలే కావా ?
అందరికీ అంగీకారమైన తీర్మానం రూపొందించండి-అంటుంటారు. దాని అర్థం ఒకటే హిందూ-ముసల్మానుల ఐకమత్యం. ఈ రెండు సమాజాలు ఒకరికి దగ్గరగా మరొకరు రావాలి. ఇరువురూ మంచిగా మాట్లాడుకోవాలి. మనమూ ఇదే కోరుకొంటాం. అయితే మనుష్యసమాజం అంత త్వరగా, తేలికగా మారదు. నెయ్యిపోస్తే, అగ్ని మరింతగా ప్రజ్వరిల్లుతుందేగాని చల్లారదు. ప్రకృతి సహజమైన ఈ నియమం వర్తిస్తున్నందకాలం, ఈ సమస్యకు పరిష్కారం ప్రకృతిసిద్ధమైన జీవన సంఘర్షణ నుండే కనుగొనవలసి ఉంటుంది.
కాని హిందూదేశంలో నేడు విచిత్రమైన స్థితి ఉంది. ఇక్కడ హిందూ సంస్కృతి ప్రబలంగా ఉండాలనే న్యాయపూర్ణమైన విషయాన్ని కూడా అన్యాయంగా చిత్రీకరిస్తున్నారు. “నేను హిందువును, హిందూస్థానం నాది; నేను ఈ ధర్మంకోసం చావడానికైనా సిద్ధమే కాని, దీనిని నశించిపోన్విను” అని చెప్పటం తక్కువస్థాయి దేశభక్తిగా పరిగణింపబడుతున్నది. హిందూస్థానం హిందువులదేశం -అన్న మాట వినగానే కొందరు కోపంతో పిచ్చెక్కినవాళ్లై మందిపడుతుంటారు. హిందువులు ఉన్నతి సాధించగల ఏకార్యమైనా మతోన్నాదమేనని వారు ప్రకటిస్తుంటారు. అయితే వేలమంది జనులు వందలసార్లు ప్రకటించినా, అసత్యం సత్యం కాజాలదు. కాకిని పట్టుకొని, ఇది హంస అని ఎన్నిసార్లు ప్రకటించినా, దాని రంగు మారదు. గాడిద చెవులను కత్తిరించి చిన్నవిచేసినంత మాత్రాన అది గుజ్జింగా మారదు. గుల్జం చేయవలసిన పనులను అది చేయజాలదు. ఈనాడు హిందువులు అరణ్యవాసం చేస్తున్నంతమాత్రాన, వారిని గురించి ఏదిబడితే అది చెప్పటం సరైనదేనా ?
హిందూస్థానంమీద ఇతరులెవ్వరికీ ఇసుమంతైనా అధికారం లేదు-వారు ముసల్మానులైనా, క్రైస్తవులైనా, పార్ఫీలైనా, ఎవరైనా సరే వారు ఈ రోజువచ్చినవారా, వేయి సంవత్సరాలక్రింతట వచ్చినవారా అన్నది ప్రశ్చకాదు. ఆరువందలమైళ్ళ దూరంనుంది వచ్చారా, ఆరువేల మైళ్ళదూరం నుండి వచ్చారా- అన్నదీ ప్రశ్నకాదు. వారు హిందూస్సానానికి పరాయివారే. వారు కేవలం అతిథులు, అభ్యాగతులు మాత్రమే. ఇది నిర్వివాదమైన సత్యం.
సంఘం మతతత్వపూరితమైనదని ఆరోపణలు చేస్తున్నవారికి ఈ విషయంలో ఉండే కల్పనలు రోచకమైనది (విచిత్రమైనవి - తమాషా అయినవి) హిందూస్థానంపై అధికారం ఎవరికి ఉండాలి ? వారు అంటారు గదా ! ఇక్కడ ఉందే వారందరికీ ! అంటే ఇక్కడి ప్రజలను దోచుకొనడానికి, పంచుకొనడానికి వచ్చిన ముసల్మానులు కూడా ఇక్కడ యజమానులవుతారా ? ముసల్మాను మతమనే విషం వ్యాపిస్తున్న తరుణంలోతమ దేశంనుండి తరిమివేయబడి ఆశ్రయం పొందడానికి వచ్చిన పార్చీలు ఇక్కడ యజమానులవుతారా ? హిందూస్థాన్ ప్రజానీకం రక్తాన్నిపిండి, పీల్చి పిప్పిచేస్తూ వారిని బానిసలుగా చూస్తున్న పైలోకమున ఉన్న తండ్రి దూతలు ఇక్కడ యజమానులవుతారా ? తమదేశంనుండి వెడలగొట్టబడి ఇక్కడ శరణుపొందిన యూదులు ఇక్కడ యజమానులవుతారా ? భారతీయులను తమదేశంలోకి రానీయకుండా ఆంక్షలు, నిబంధనలూ విధిస్తున్న యూరోపియన్ అమెరికా దేశాలవారు ఇక్కడ మనదేశానికి యజమానులవుతారా ? చిమ్మచీకట్లో ఉండే అంధేరానగరంవంటిచోట్ల కూడా ఈ మాటచెప్పేనవ్వుతారు. హిందూస్థానం వారసులులేని అనాథసంపత్తి అనుకొంటున్నారా ?
ఈ రకమైన ఆలోచనలు మనకు ఏమాత్రం సమ్మతం కావు. హిందూన్థానం ఒక భౌగోళికమైన నేలచెరగు మాత్రమేకాదు. ఇది ఒక రాష్ట్రం. ఇది హిందువులది. ఎవరూ నివసించని ఖాళీప్రదేశాన్ని రాష్ట్రమని వ్యవహరించరు. సంస్కృతి, ధర్మం, చరిత్ర, పరంపర -వీటినిబట్టి రాష్ట్రం ఏర్పడుతుంది. చరిత్రలోని తొలిపుటల నాటినుండి దీనిపేరు హిందూస్థానం. దీనిని ఆర్యావర్తమని, భరతఖండమని ప్రస్తుతిస్తూ దీనిని ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేవిధంగానూ వ్యవహరించేవారు. ప్రస్తుతిస్తూ దీనిని ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేవిధంగానూ వ్యవహరించేవారు.
ఈనాడు హిందూదేశ వాసులను ప్రపంచంలో ఏపేరున పిలుస్తున్నారోగమనించండి. అందరి జన్మదినాలనూ తన కనులతో జూచిన అత్యంత పురాతనమైన రాష్ట్రానికి ఈనాడు క్రొత్తగా ఒకపేరు తగిలించాలన్న ఆలోచన, కోరిక ఎందుకు కల్లినది ? కాని దుర్మార్గులైన ఆంగ్లేయుల పాలనలో వారనుకొన్నట్లుగా సాగిపోతున్నది ! వాళ్ళు దీనికి ఇండియా” అని పేరుపెట్టగానే, ఎదగనిబుద్ధిగల మననాయకులు దానిని హిందూస్సాన్ అనే పేరుకు అనువాదంగా అంగీకరిస్తున్నారు. ఆంగ్లంలో ప్రాపర్‌నౌన్ Proper Noun నామవాచకంగా- ఒక వ్యక్తిపేరుగా, సంస్థపేరుగా నిర్దిష్టంగా చెప్పబడేదానికి అనువాదం చేసే అధికారం ఆంగ్రేయులకు ఎవరిచ్చారు ?
మన ప్రజలకు మనదేశంతో ఉన్న ఆత్మీయతాబంధాన్ని మాయంచేయడానికి, మన మనస్సులను చంపివేసి, మన స్వాభిమానాన్ని శూన్యం చేసే కుటిలదృష్టితో ఈ పని చేయబడింది. ఇదిగాక, మరో కారణమేదీలేదు. మనలోని స్వాభిమానాన్ని నష్టపరచటమూ, బయటనుండి ఈ దేశంలోకి వచ్చిన వారికి మనదేశం పైన అధికారం ఉన్నట్లుగా ద్యోతకపరచి, వారిని మనపై రెచ్చగొట్టి, కొట్లాటలు జరిగేటట్లుగా చేయటంకోసమే ఈవిధంగా పేరుమార్చబడింది. ఒక్కరాయి విసరి రెండు పక్షులను పడగొట్టాలనే వారి ఈ కుట్ర మనకు అంగీకారం కాదు. హిందువులు ఈ వలలో చిక్కుకుపోరాదు. ఇది మన మాతృభూమి. దీనిపేరుమార్చే అధికారం ఎవరికీ లేదు. ఏవిధంగా ఇంగ్లాండు ఇంగ్రీష్‌వారికి, ఫ్రాన్సు ఫ్రెంచివారికి, జర్మనీ జర్మనులకు చెందుతుందో అలాగే హిందూస్నాన్ హిందువులకే చెందుతుంది. అనాదికాలంనుండి ఇది మనదేశం. ఎప్పటికీ ఇది మనదేశంగానే ఉంటుంది. ఎప్పటివరకైతే, హిందూ రక్తం ప్రవహిస్తున్న ఒక్క పురుషుడైనా జీవిస్తూ ఉంటాడో, అంతవరకు ఇతరులెవరూ ఈ దేశానికి యజమానులు కాలేరు. హిందూదేశంలోకి చొరబడిన విదేశీయులు అన్యాయాలు, అక్రమణలు, దోపిడీలు, అత్యాచారాలు చేయడానికే చొరబడ్డారని మరువవద్దు. ఇప్పటివరకు నెలకొని ఉన్నవారి చరిత్ర ఏమి చెప్పుతున్నదంటే- ఈ సువర్ణభూమిలో మంగళ ప్రదములు సుందరములు, సుఖప్రదాయకములూ అయిన వాటినన్నింటినీ ధ్వంసం చేసి వారి తీవ్రమైన కోరికలను తీర్చుకున్నారు. అటువంటి విదేశీయులను మన ఈ రాష్ట్రానికి ఘటకులుగా హిందూస్థానంయొక్క సుపుత్రులుగా, దేశబాంధవులుగా భావించుకొని కౌగలించు కోవాలని చెప్పేవారు, తమ మనస్నిష్కాలను అమ్మేసుకున్నారని మాత్రమే చెప్పవలసి ఉంటుంది.
విదేశస్థులు ఎవరూ ఇక్కడికి రాకూడదని హిందువులు ఏనాడూ చెప్పలేదు. వారు ఇక్కడ సుఖంగా ఉంటూ, అన్ని రకాల సంపదలను వినియోగించు కోవడంగురించి కూడా ఎటువంటి అభ్యంతరమూ లేదు. జన్మతః హిందువు ఉదారుడు. కవచ కుండలాలను దానం చేస్తే, దానివల్ల తనకు మరణం సంభవించగల ప్రమాదం ఉన్నదని తెలిసికూడా- అందుకు అంగీకరించిన మహాపురుషులు జన్మించిన దేశమిది. “ఆత్మవత్ సర్వభూతేషు అని భావించే ఉదారవాద ప్రవృత్తి మనది. విదేశీయులు ఇక్కడికి రావచ్చు-కాని, వారు గుర్తుంచుకోవలసిందేమంటే-"తాము హిందువులకు చెందిన హిందూస్టాన్‌లో జీవిస్తున్నామని.”
ఇంటికి అతిథిగావచ్చి, ఆతిథ్యం స్వీకరించి, బాగా తిని, బలిసి, తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్ట నారంభిస్తే (ఇంటిని స్వంతం చేసుకోవాలనుకుంటే), ఆ ఇంటి యజమాని ఆ పనిని చేయనిస్తాడా ? అతిథిగా వచ్చినవాడు అతిథిగా తన స్థానం తెలుసుకొని మసలాలి. అంతేకాని, ఇంటి యజమానిమీద తన పెత్తనం చలాయిం చాలనే పద్ధతిలో ఏపనీ చేయకూడదు- ఇది అందరూ అంగీకరించే విషయం.
భారతదేశంలో నివసించుతున్న విదేశీయులు హిందూసమాజంమీద అత్యాచారాలు చేయదలచుకున్నాా హిందూధర్మానికి హాని కలిగించే ప్రయత్నాలు చేసినా, హిందూ సమాజం వారిని క్షమించదు. హిందూస్స్టానాన్ని మరల వైభవ సంపన్నం చేసేపనిని, హిందూస్థానపు ఉన్నతిని సాధించే పనిని హిందువే చేస్తాడు. హిందూస్టానం క్రీస్తుస్థానమో, పాకిస్థానమో అయిపోతే, ఉన్నతి పొందగల్లుతుందా ? అది ప్రాణం కోల్పోయిన శరీరానికి, శవానికి అలంకరణ చేయటమే అవుతుంది.
వాస్తవానికి ఈనాటి ఆఫ్గనిస్తాన్ మన ప్రాచీన గాంధారదేశం. ఈనాడు ఆఫ్గనిస్తాన్ తనను తాను ఒక స్వతంత్రదేశంగా ప్రకటించుకొని వ్యవహరిస్తున్నది. కాగా అసలు సత్యం ఏమిటంటే అది మననుండి విడివడిన గాంధారంయొక్క ప్రేతం మాత్రమే. గాంధారదేశంలోని హిందువులనందరినీ అంతమొనరించి, అత్యాచారాలతో భయ భీతులను చేసి బలవంతంగా మహమ్మదీయులుగా మార్చి, ఆప్టనిస్థాన్ పేరు పెట్టారు. అటువంటి నరకంతో సమానమైన జీవితాన్ని మనం ఎప్పటికీ సహించబోము. గాంధారంలోని హిందువులను సర్వనాశనంచేసి ముస్లింలు దానిని ఆఫ్గనిస్తాన్చే శారు. రెడ్‌ఇండియన్‌లను వేటాడి, చంపి, క్రైస్తవులు అమెరికా రాజ్యం ఏర్పరిచారు.
అయితే అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఇక్కడ భారతదేశంలో విదేశీయుల కుటిలనీతులకు సఫలత లభించలేదు. నేటికీ మనలో భేదభావాలను, వైరుధ్యాలను సృష్టించేప్రయత్నాలు ధారాళంగా జరుగుతునే ఉన్నవి. హిందూ స్థానాన్ని పాకిన్థానంగా మార్చి, మనకు ఇంద్రభోగాలు లభింపజేస్తామన్నా మనం అటువైపు చూడనే చూడబోము. సంఘము హిందూసమాజానికి చెప్పగోరుతున్నదిదే ! హిందూ సమాజంముందు మనంఉంచగోరుతున్న ఏకైకసందే శమిది మాత్రమే-మనం హిందు వులం; ఈదేశం మనది. ఇక్కడ మనసంస్కృతి యొక్కశ్రేష్టత సుస్థిరంగా నిలిచి ఉండాలి. ఈ విషయం మనకు పట్టినపుడు మనం సంఘటితులమై, మనలను దోచుకొనడానికివచ్చిన విదేశీయులకుట్రలపట్ల సావధానులమై మెలుగుతుండాలి.
హిందూస్థానం హిందువులది; ఇక్కడ హిందూహిత సాధనకై జరిగే ఆందోళనలు, ఉద్యమాలు ఏవైతే ఉంటాయో అవిమాత్రమే రాష్ట్రీయమైన ఆందోళనలు, ఉద్యమాలు అవుతాయి. మిగిలిన సంస్థలు, ఉద్యమాలు అరాష్టీయమైనవి లేక కులపరమైన సంకుచిత సాంప్రదాయిక (communal) సంస్థలు, ఉద్యమాలు అవుతాయి. హిందూస్థానంలో హిందువులద్వారా నడుపబడే ఉద్యమాలు మతత్త్వంతోకూడిన (communal) ఉద్యమాలు కాని, అరాష్ట్రీయ (Anti-National|) ఉద్యమాలుగాని కాబోవు. ఇంత స్పష్టంగా విషయం తెలిసిన తర్వాతకూడా - హిందూహితం కోరి ఆందోళనలు చేసినట్లయితే ముస్మలానులకు, క్రైస్తవులకు కిట్టదేమోగదా ! ఈ దృష్టితో ఏమి చెప్పవలసి ఉంటుంది ? వారు ప్రసన్నులు కాక అప్రసన్నులుగానే ఉంటే మనం ఏమి చేయవలసి ఉంటుంది ? వారు అలిగితే, కోపగిస్తే-అప్పుడు ఐకమత్యం సాధించటం ఎలా సాధ్యమవుతుంది ? మనం ఐకమత్యం సాధించజాలని పక్షంలో ఆంగ్రేయులు మనకుఅధికారాన్ని ఎలా అప్పగించగలరు ? ఇలా మాట్లాడుతూ ఉండటం యుక్తివాదం (తెలివితేటలు)గా భావింపబడుతున్నది. ఎంత విచిత్రమిది ? ఒకవేళ ముసల్మానులు కావాలని-- బుద్ధిపూర్వకంగా, హిందువులతో ఐకమత్యసాధనకు ముందుకురాక, దూరంగా ఉండిపోయినట్లయితే, అప్పుడు మనం చేయగల్లేదేముంటుంది ? మనం పూర్తిగా నిస్సహాయులమై పోతాంగదా- ఇటువంటి ఆలోచనలే ఈనాడు సర్వత్రా మనకు వినిపించుతున్నవి.
హిందువులలోని ఈ బలహీనతలను గమనించి, మహమ్మదీయులు తమ గుర్రాన్ని ముందుకు దూకిస్తున్నారు. “మీకు స్వరాజ్యం కావాలనుకొంటున్నారా? మీరు గనుక అలా కోరుకొంటున్నట్లయితే, మాకు మూడవవంతు భూభాగాన్ని ఇచ్చేయండి. ఏ ప్రాంతాల్లో అయితే, మేము అధికసంఖ్యలో ఉన్నామో, అక్కడ చట్టప్రకారంగా మేమే మెజారిటీ సభ్యులను కలిగి ఉండే ఏర్పాటు చేయాలి. మేము కోరుతున్న 14 కోరికలను నెరవేర్చాలి.” హిందూస్థానంయొక్క యజమానులకు ఎంతగా అన్యాయం చేసేవైనా, హిందూస్సానానికి ఎంతగా చేటు చేసేవైనా, వారు అడిగిన వాటినల్లా వారికి ఇచ్చేయాలి ! హిందూస్థానాన్ని ఖండించి పాకిస్థాన్ పేరుతో వేజుగా రాష్ట్రాన్ని ఏర్పడనివ్వాలి ! ఇంత మాత్రమే కాదు, తెల్లకాగితంమీద సంతకం పెట్టి (బ్లాంక్ చెక్) ఇచ్చేయాలి ! ఎందుకు అంటే, మీరు హిందువులకు స్వరాజ్యం కోరుకొంటున్నారు గదా ! ఇప్పటివరకు హిందూస్థానంలో జరిగిన ఉద్యమాలన్నింటికీ మహమ్మదీయులు దూరంగానే ఉన్నారు. అంలేకాదు, అవకాశం లభించిన ప్రతి సందర్భంలోనూ హిందువులపట్ల విశ్వాసఘాతానికి పూనుకొని వారి బలాన్ని క్షీణింపజేయడానికే ప్రయత్నించారు. హిందూస్టానానికి స్వరాజ్యం ఎలా వస్తుందనే విషయమై వారేనాడూ ఆరాటపడ లేదు. హిందూస్ట్థానంలో ముస్లింల రాజ్యాన్ని ఎలా న్థాపించగలమన్న విషయమై వారిలో రాత్రింబగళ్లు ఆలోచనలు సాగుతుంటాయి.
ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రహితంకోసం జరిగే రాష్ట్రీయ ఉద్యమాలన్నీ వారికి చెడ్డవిగా కన్పించటంలో వింతేమీలేదు. మన ఇంటిని భద్రంగా, సురక్షితంగా ఉంచుకోవటంకోసం మనం గోడలు నిర్మిస్తూఉంటే, దొంగకు ఏమనిపించుతుంది ? ఈ గోడలు కట్టడంవల్ల, ఇంటిని దోచుకోవటం కష్టమై పోతుందే అనిబాధపడుతూ ఉంటాడు. అయ్యో ! పాపం ! మనం గోడలు కట్టడంవల్ల దొంగలకు కష్టమౌతుందే అన్న ఆలోచన గృహయజమాను లకు ఎప్పుడన్నా వస్తుందా ? అలా ఆలోచించటం అసమంజసమేకాదు, మూర్ధత్వం కూడాను. హిందూసంఘటన జరిపితే, మహమ్మదీయులకు చెడుగా అనిపించుతుంది కాబట్టి, దానికి పూనుకోకూడదు -అనుకొనేవారికి మనహితం ఏమాత్రం పట్టదన్నమాట. మన ప్రజానీకానికి కొద్దిమేలు జరిగినా, ఈ బాపతు మనుష్యులకు కడుపులో బాధ ఉత్పన్నమవుతుంది. హిందువులమేలు అంటేనే-తమకు చేటు అనుకొనేవారు హిందువులకు మిత్రులుగాని, బంధువులుగాని కాగల్టుతారా ? ఇటువంటి వాళ్ళు పొరుగున ఉండడానికి కూడా యోగ్యులు కారు. మనమేలు, అభివృద్ధి చూసి సహించలేని సముదాయం ఏదైతేఉందో, వారి బాగోగులగురించి పట్టించుకోవలసిన అవసరం మనకేముంటుంది ? వారికి నచ్చుతుందా, లేదా, వారు మెచ్చుతారా లేదా- ఇది ఆలోచిస్తూ కూర్చోకుండా, మనం మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. మనసంఘటన అనే పరమపవిత్రమైనకార్యాన్ని ముందుకు నడిపించవలసి ఉంది.
మనం 25కోట్ల ప్రజానీకం ఉన్నాం. (1935నాటి లెక్స. మనమంతా ఒక్కటైనపుడు, ఈ భూమిమీదున్న ఏ శక్తి కూడా మనవంక వక్రదృష్టితో చూడజాలదు. అటువంటి స్థితిలో ఉన్న మనం బోచేవారెవరురా ? అంటూ ఎక్కడెక్కడికో దృష్టిని సారిస్తూ నిస్సహాయంగా కూర్చోవటం సమంజసమా ? అసలు ఇటువంటి కోరిక మనలో ఎందుకు కలుగుతున్నది ? మరొకరిపై ఆధారపడి బ్రతకాలన్న ఆలోచన ఎందుకు వస్తున్నది ?- దీనికి ఒకటే కారణముంది. మనం మనలను గుర్తించటంలేదు. మనలో ఆత్మవిశ్వాసం అడుగంటింది. మనశక్తి సామర్ధ్యాలు, పౌరుషపరాక్రమాలు ఎంతగా క్షీణించాయంటే -మనం ఏమీ చేయజాలమనే నీరసస్థితిలో పడియున్నాం. మనచేతులతో మనం ఏమీ చేయజాలం, అనే భమకు లోనైన వికటస్థితిలో మనం చిక్కుకుపోయాం. మన తప్పుడు అభిప్రాయమే మనకు బంధనమైంది.
పరిస్థితి జన్యమైన భయం ఎవరికి ఉంటుంది ? ఏమీ చేయనివారికి, పనికిమాలిన వారికి అలాంటి భయం ఉంటుంది ? ధ్యేయప్రాప్తిని కాంక్షిస్తూ, కార్యక్షేత్రంలో ముందు కురికేవారికి ఎలాంటి పరిస్థితిలోనూ భయం ఉత్పన్నం కాదు. అలా అడుగుముందుకు వేసేవారే తేజస్వులైన పురుషులు. వారు మాత్రమే తాము కోరుకున్న విధంగా పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నవనిగాని, భీషణంగా ఉన్నవనిగానీ, ఎన్నడూ కంగారుపడరు, భయపడరు. తన ఇచ్చానుసారంగా పరిస్థితిని మార్చుకోగలవాడే నిజమైన పురుషార్ధి. అలాకాకుండా ఏటిప్రవాహంలో కర్రముక్కలాగా పరిస్థితుల ప్రాబల్యంలో కొట్టుకుపోయేవాడు పురుషుడు అనిపించుకోతగడు. ఎదురుగా ఉన్న సంకటాలను చూసి కూడా ముందుకు ఈదుకొంటూ లక్ష్యానికి చేరగల్లిన వాడే-ఈతనేర్చినవాడు. కరృత్వశాలి అయిన పురుషుడు పరిస్థితులనుబట్టి పోవటం ఉండదు. తన ఇచ్చాను గుణంగా పరిస్థితులను శాసించి, నడిపించుతాడు.
ఇటువంటి పరిస్థితిలో మనం చేయగల్లినదేమీ లేదు అనుకొని, నిరాశతో కూర్చోవద్దు. పరిస్థితిని చూసి గాబరాపడవద్దు. మనలోని ఆత్మవిశ్వాసమనే దీపాన్ని ప్రజ్వలితం చేయాలి, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి-మన శక్తిని ఏకత్రితంచేయాలి. మనం మన ధ్యేయాన్ని చేరాలంటే, మనలో ప్రచండశక్తిని, అణచరాని నిశ్చయాన్ని ఆవహింపజేసు కోవలసి ఉంది. దీన స్వభావాన్ని విడిచిపెట్టవలసి ఉంది. వాస్తవానికి మనం దుర్చలురం కాదు. మనం ఎంతో సమర్థవంతులం. మనకు మనశక్తినిగురించి సరైన కల్పన లేకపోవటమే మన సమస్య.
హిందూ సమాజంలోనుందే కొందరు బాధ్యతగలనేతలు -హిందూదేశాన్ని ఉద్ధరించటమనేపని హిందువులవల్ల కాదుగదా, స్వర్గంనుంది దేవతలు దిగివచ్చినా, జరిగేది కాదని-అంటుంటారు. ఇలా ఏమాత్రం సాహసంలేని, ఆత్మవిశ్వాస భంగకరమైన వ్యాఖ్యలను చేసేవారు కేవలం తమ అజ్ఞానాన్ని అవివేకాన్ని బయట పెట్టుకొంటున్నారు. ఇప్పటివరకు హిందూస్థానంలో జరిగిన కొన్ని ఉద్యమాలు విఫలమైనవి; మనలో స్వాభిమానం లేకపోవటమే దానికి కారణం-ఫలితంగా హిందువు అంటేనే దుర్చలుదని, అవిటివాదని, కదలజాలనివాదని, దీనుదని, హీనుడని, ఇలా జాడ్యాన్ని (జడత్వాన్ని. ప్రకటించే భావం ఏర్పడి ఉంది- హిందూసంఘటనలో నిమగ్నమై ఉన్న నాయకులోనూ కొందరు 'ఎప్పుడూ దెబ్బలు తింటూ ఉందే హిందూ సమాజం ' అంటూ ఆత్మనిందకు పాల్పడుతూ మాట్లాడుతుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. మనలో దోషాలేలేవని కాదు. అయితే “మనలో కర్ఫత్వశక్తి శూన్యం, పరాక్రమం మచ్చుకైనా లేదు, పురుషార్ధం లేదు, మనం ఎప్పటికీ, ఏవిధంగా జూచినా అశక్తులము, నిస్సహాయులము” ఈవిధమైన ఆరోపణలు సత్యమైనవికావు. ఈ మిథ్యలు మనమధ్య ప్రచారంలో ఉన్నవి.
“నావల్ల ఏమీకాదు అని చెప్పటం మానండి. మీరు గొప్ప కర్తవ్యనిర్వాహ శీలురని, సామర్థ్య సంపన్నులనీ-చరిత్ర సాక్ష్యమిస్తున్నది. ఈ ఇతిహాసిక సత్యాన్ని ఎప్పుడూ మనస్సులో ఉంచుకొంది. పరాక్రమ మనేఅగ్ని ఎల్లావేళలా మీలో ఉంది. ఈ విషయాన్ని రేయింబవళ్లూ మనస్సులో స్మరించుకొంటూ సంకుచిత స్వార్ధబుద్ధి, కూపస్థ మండూక స్వభావమూ-ఈ రెండూకలసి నిప్పుమీద నివురు (బూడిదులాగా మీ మస్పిష్క్మంమీద పేరుకొని ఉన్నవని (గ్రహించి, దానిని దులిపివేయండి-అప్పుడు మూలంలోని అగ్ని కణకణమండుతూ ప్రకాశిస్తుంది. మీలోని స్వాభిమానాన్నిి ఆత్మవిశ్వాసాన్ని మేల్మొల్పటమే ఆలస్యం, మీ అంతః కరణంలో ధర్మంకోసం, దేశంకోసం సజీవమైన, చైతన్యవంతమైన (ప్రేమ, నిష్టా జాగృతమవుతాయి; దానితో మీరు వెళ్లవలసిన దూరంలో సగందూరం పయనించినట్లవుతుంది. ఇది మీరు ఎక్కవలసిన ధ్యేయమందిరంలో మొదటిమెట్టు. హిందువుయొక్క మనస్సులో స్వాఖిమానమనే భావాన్ని మేల్మొలిపి, తేజోవంతమైన సంఘటన కార్యం చేయగల్లితే, మనం ధ్యేయాన్ని చేరుకోవటంలో కఠినమైన అవరోధాలేవీ ఉండబోవు.
≫≫ తరువాతి వ్యాసము " శివాజి నుండి ప్రేరణ పొందాం " డా . ప . పూ . హెగ్డేవార్ జి..