: సంఘ్ స్థాపించి దశాబ్ది పూర్తయిన సందర్భంలో:
1935లో పుణేలో ప.ఫూ. డాక్టర్ హెడ్గెవార్ ప్రసంగం
ఆంగ్లంలో ఒక సామెత ఉంది. దానిలో ఎంతో నిగూఢమైన అర్ధం ఉంది. Knowledge Comes but wisdom Lingers . పరిజ్ఞానం వచ్చినంత సులభంగా వివేకం రాదు. అది రావాలంటే దానికై మరికొంత విశేషంగా శ్రమించవలసియుంటుంది. దీనిని మరాక విధంగా చెప్పాలంటే, ఏ విషయమైనా తేలికగానే అర్థం చేసుకోవచ్చు. కాని దానిని అమలుచేసి ఫలితం సాధించాలంటే కష్టపడవలసి యుంటుందన్నమాట. అమలుచేసి, దానినుండి పొందవలసిన ప్రయోజనం పొందినప్పుడేగదా, దానిని మనం పూర్తిగా అర్థం చేసుకొన్నట్లుగా అనుకోగల్లేది. ఈ సామెతలోని అంతర్థమేమిటంటే, ఒక విషయాన్ని మాటలలో అర్థం చేయించగలిగేవారు ఎంతమందైనా ఉండవచ్చు, కాని దానిని కార్యాన్వితం చేసేవారు కొద్దిమందే ఉంటారు. అంటే విషయం తెలిసిన తర్వాతకూడా, దానికి అమలుచేసి ప్రయోజనం సాధించి తీరాలనుకొనేవారు కొద్దిమందే ఉంటారు. చెయ్యాలి అనుకొనేవారు ఎక్కువమందే ఉండవచ్చు, లేదా అందరూ అనుకోవచ్చు. కాని ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో పూర్తిగా వివరంగా ఆలోచించి, తదను గుణంగా తాను సిద్ధపడి, దానిని సాధించటమనేది అందరివల్లా అయ్యేది కాదు. దానిని ఒక ప్రత్యేకమైన అంతఃకరణం అవసరమవుతుంది. శబ్దాలలో వ్యక్తీకరించే పరిజ్ఞానం ఎంతయినా ఉండవచ్చు, కాని దానిని అర్ధం చేసుకొని, అనుభవంలోకి తెచ్చుకోవడానికి మనుష్యులు దూరంగానే ఉంటారు. మరాఠీలోకూడా ఒక సామెత ఉంది దాని అర్ధమేమంటే, విశేషమైన పనులను ఎవరుబడితే వారు చేయలేరు; విశిష్ట వ్యక్తులే ఆ విశేషమైన పనిని చేయగలరు.
Dr. Hedgewar's Rare photo |
అంతఃకరణానికి సంబంధించిన విషయాలను అంతఃకరణం ఉన్నవారే గ్రహించ గలరు. హృదయ సంబంధమైన భాషను హృదయమే అర్ధం చేసుకోగల్టుతుంది. ఎవరితోనైతే భావన ఉందదో, ధ్యేయసిద్దిపట్ల పేరణ ఉండదో, ఎవరిలోనైతే అహంకారం ఉంటుందో, ఎవరైతే తర్మంతో అల్లుకున్న గూడులో చిక్కుకొని ఉంటారో-వారు ఏ పనీ చేయరు. వారు ఏపనీ చేయజాలరు. ఈ కాలంలో తమను తాము ఆలోచనా వపరులుగా, వేదాంతులుగా భావించుకొనేవారు కొందరు కనిపించుతూ ఉంటారు. “భార్యా, పిల్లలు, ఇల్లూ- వాకిలీ, సంపద -ఇవన్నీ మాయ. దేనిని నీవు అర్థం (సంపద) అనుకొంటున్నావో అదంతా అనర్థమే నని గ్రహించుకో” అని వారు చెప్పుతూ ఉంటారు. కాని ఇందులో ఉన్న జ్ఞాన సంబంధమైన అర్ధం ఏదీ వారు [గ్రహించరు. సంఘానికి ఇటువంటి శుష్మవేదాంతులతో పనిలేదు. మనకు కావలసింది విశిష్ట ధ్యేయవాదులైన వ్యక్తులు. విశిష్టధ్యేయవాదులైన యువకుల సంఘటనను నిర్మించేకార్యం మనం చేయవలసిఉంది. మనధర్నాన్నిి మన సంస్కృతిని, మన సమాజాన్ని సంరక్షించుకొని, సమాజాన్ని సర్వాంగీణ ఉన్నతమైనదిగా మనం చేయవలసి ఉంది. ప్రత్యక్షంగా పరమేశ్వరుడే వచ్చి ఎదురుగా నిలబడి ఈ దేశం హిందువుది కాదని చెప్పినా, మనకు ఈ విధానంపట్లగల (శ్రద్ధ చెక్కుచెదరదు. ఏమాత్రం చలించదు. ఎవరి అంతఃకరణంలోనైతే ఇంతటి శ్రద్ధ ఉంటుందో, వారే ముందుముందు చెప్పబోయే అంశాలను గ్రహించగలరు.
మొట్టమొదట సంఫుమంటే ఏమిటో (గ్రహించుకోవలసి ఉంటుంది. “సంఘమంటే ఒక బృందం, ఒక సమూహం, ఒక సంఘటని-- అని శబ్దకోశాల్లో వివరింపబది ఉంటుంది. మనదృష్టితోకూడా ఇది సరైనదే. మనం సంఘం ఒక సంఘటన -ఇది హిందూ సమాజపు సంఘటన, గత 75 సంవత్సరాలలో ఇక్కడ చాలాచాలా ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి. అనేక వివాదాలు, సమస్యలూ లేవనెత్తబడినవి. వాటిల్లో చాలావరకు ముగిసిపోయినవి కూడా. కాగా మన సంఘం ఈ వివాదాలను వెదకటంకోసం బయల్దేరింది కాదు. సంఘం పనిచేసే కార్యక్షేత్రం పూర్తిగా వాటికి భిన్నమైనది; స్వతంత్రమైనది.
ఇప్పటివరకూ ఈ క్షేత్రంలో ప్రవేశించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఇప్పటివరకు ఎన్ని రకాల ఉద్యమాలు, ఆందోళనలూ జరిగినవో, వేటికొరకు అనేకమంది మన నాయకులు పోరాటాలు చేశారో, వాటన్నింటియొక్క కార్యపద్ధతులను, జయ పరా జయాలనూ -అన్నింటినీ లోతుగా పరిశీలించి, ఆలోచించి, వాటి మూలాల్లో వెళ్లి ముందుకువెళ్లే మార్గాన్ని వెదికి పట్టుకొని మనం సంఘకార్యం ప్రారంభించాము.