సంఘటనమే సామర్ద్యానికి ఆధారం
1935 పుణేలో ప.ఫూ. డాక్టర్ హెడ్గెవార్ ప్రసంగం
ఏ ఉద్యమానికైనా, దానిశక్తి దాని అంతర్గత నిర్మాణంలో ఉంటుంది. ఇది ఒక మూలభూత సిద్దాంతం. ఏ జాతి (రాష్ట్రం కైనా దాని సామర్థ్యం ఆ రాష్ట్రయొక్క సంఘటన అనే ఆధారంమీదనే నిర్మితమై ఉంటుందనేది సత్యం. చెల్లాచెదిరిపోయి, ముక్కలైపోయి విడివిడిగా ఉంటున్న సమాజం ఒక గుంపు మాత్రమే అవుతుంది. గుంపు, సంఘటన -ఈ రెండుమాటలూ సమూమహాన్ని గురించి చెప్పేవే అయినా- ఈ రెండింటికి వేజువేజు అర్థాలున్నాయి. గంపలో కూరగాయలు రకరకాలవి కలసి ఉంటాయి- అది సాధారణమైన మిశ్రణం. కాగా రసాయన మిశ్రణం భిన్నంగా ఉంటుంది. గంపలోని కూరగాయలు గుంపువంటివి కాగా, రసాయన మిశ్రణంలో జరిగేది సంఘటనం.
సాధారణ మిశ్రణంలో అణువులు- పరమాణువుల స్థాయిలో ఏవిధమైన మార్పులూ ఉండవు. దైవయోగవశాన అవి ఒక దాని ప్రక్కన ఒకటిగా చేర్చబడి-రాసి పోయబడి ఉంటాయి. వాటిని విడదీయాలనుకుంటే చాలా సులభంగా చేసిచేయవచ్చు. కాగా రసాయనిక మిశ్రమణంలోని పరమాణువులమధ్య ఎంత సన్నిహితమైన సంబంధం ఉంటుందంటే, వాటిని వేజువేజబు చేయటం దుష్మరమౌతుంది. గుంపులో రకరకాల ఆలోచనలు, స్వభావాలూ కలిగి, పరస్పరం ఏమాత్రం సంబంధం లేనివారు ఉంటారు. కాగా సంఘటనలో ఒక విశేషమైన అనుశాసనం ఉంటుంది. అనుశాసనమంటే సామర్థ్యమన్నమాట |! సంఘటనలోని పరమాణువులు అనుశాసనంతో, మనము అనేభావంతో, సమాజహితభావనతో -ఈవిధమైన సూత్రాలలో అల్లుకొన్న వారై ఉంటారు. వారిలో పరస్పరం స్నేహ ఆకర్షణ బలంగా ఉంటుంది. రాయి బరువుగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, పగలనిదిగా ఉంటుంది-అందులో ఉండే పర మాణువులు ఒకదానికి ఒకటి బాగా దగ్గరగా అంటిపెట్టుకొని ఉండటమే అందుకు కారణం. వాటిమధ్య సంఘటన ఎంత గట్టిదంటెే, సుత్తిపెట్టి కొట్టినా, దానిని పగల గొట్టటం సులభంకాదు. కాని ఏదైనా ఒక పదార్థంలో అణువులు, రేణువులు అంత సన్నిహితంగా ఉండవో దానిని ముక్కలు చేయటం సులభంగా జరిగిపోతుంది. ఈ సరళమైన, స్పష్టమైన తత్వాన్ని ధ్యానంలో ఉంచుకొని సమాజాన్ని సంఘటితం చేయాలి- అభేద్యమైన బలశాలిగా చేయాలి- ఇందుకోసమే సంఘమేర్పడింది.