శ్రద్ధాంజలి
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ద్వారా డాక్టర్‌జీ ఆత్మకు శ్రద్ధాంజలి నర్పించడానికి, మరణానంతరం 13వ రోజు అంటే 1940 జూలై 3న భారతదేశంలోని 700 సంఘ శాఖలలోనూ సంఘపద్ధతిలో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో స్వయం సేవకులు హృదయ ద్వారాలను తెరచి, తమతమ భావాలను ప్రకటించారు. డాక్టర్‌జీ గుణాలను కీర్తించి పవిత్రులైనారు. తమ సర్వస్వాన్ని అర్చించి సంఘకార్యాన్ని సఫల మొనరించ గలమని ప్రతిజ్ఞలు చేశారు. డాక్టర్‌జీ స్మృతికై ఆద్య సర్‌సంఘచాలక్ ప్రణామ్ సమర్చింపబడింది.
కేంద్ర సంఘస్థానంలో
జూలై 3వ తేదీ సాయంకాలం 6 గంటలకు రేశమ్‌భాగ్ కేంద్ర సంఘస్థానమందు దహనభూమికి ఎదురుగా నాగపూర్‌లోని ఉపశాఖలన్నీ సమావేశమైనాయి. ఆ సమావేశంలో మధ్యప్రాంత సంఘచాలక్ శ్రీ బాబాసాహెబ్ పాధ్యే, పూజనీయ ఆబాజీ హెడగేవార్, పరమ పూజనీయ శ్రీ గోళ్వల్మర్‌గార్లు ఉపన్యసించారు. పరమపూజనీయ దాక్టర్టీ ఇచ్చ్భానుసారం, పరమ పూజనీయ శ్రీ గోళ్వల్కర్ నూతన సర్ సంఘచాలక్‌గా నియుక్తులైనట్లు మధ్యప్రాంత సంఘచాలక్ శ్రీ బాబా సాహెబ్ పాధ్యేగారు ప్రకటించారు. అప్పుడు జరిగిన ఉపన్యాసాలు ఈ దిగువన ఇవ్వబడినాయి.
ప్రాంత సంఘచాలక్ శ్రీ పాధ్యేగారి ఉపన్యాసం
నేడు మనము విచిత్రమూ భయంకరమైనైన పరిస్థితుల్లో సమావేశమైనాం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్‌సంఘచాలక్ శ్రీ డాక్టర్‌జీ చనిపోతారని ఏ జ్యోతిష్యుడలైనా చెప్పినా మనకు నమ్మకం కలుగకపోయేది. కాని మన సంఘానికి చైతన్య స్వరూపులైన పరమపూజనీయ డాక్టర్ జీ మన నందరినీ విడిచి స్వర్గవాసులైనారు. అందుకే ఈ 13వ రోజున మనం సమావేశం అయినాం. పితృవాత్సల్యచ్చాయ తొలగినప్పుడు పిల్లల గతి ఎలా ఉంటుందో, అలాగే మన పరిస్థితి ఉన్న దీనాడు. మన డాక్టర్‌జీ సాధారణ మానవులు కారు. ఆయన ఒక మహాశక్తి స్వరూపులు. సంఘానికి ఆయన జీవనశక్తి వంటివారు. ఆ శక్తి తొలగిపోయినందున భారతవర్న మీనాడు దుఃఖ సముద్రములో మునిగి ఉన్నది.
డాక్టర్‌జీ బాల్యంనుండదే ఒక మహోత్తమ ధ్యేయాన్ని ముందుంచుకొని పనిచేస్తుండేవారు. 28 సంవత్సరాలపాటు నిరంతరం ఆలోచించి అనవరతంగా తపించిన తరువాతనే ఒక సిద్ధాంతాన్ని నిశ్చయించుకుని ఆయన ఈ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించారు. హిందూరావ్రాన్ని వైభవ శిఖరాలకు చేర్చ బూనిన ఈ కార్యాన్ని ఆయన కేవలం 5గురితోనే ఆరంభించారు. ఈ స్వల్పారంభం శుభప్రదంగా పరిణమించినందువల్లనే, ఈనాడు ఆయన ఆ అయిదుగురి సంఖ్య నభివృద్ధిచేసి ఒకే ఆచార వ్యవహారాలు కలిగిన లక్షలాది జనుల సంఘటనను నిర్మించారు. వివిధ వర్గ విభేదాలను అధిగమించి, పార్టీ వైమనస్యాల జోక్యం లేకుండా సంఘకార్యం అఖండితంగా పురోగమించేట్లుగా, డాక్టర్‌జీ ఈ కార్యప్రణాళికలనూ, సిద్ధాంతాన్నీ ఎంతో కౌశలంతో నిర్మించారు. రాజకీయాలతో సంబంధం పెట్టుకోకుండా ఉండడంలో ఆయన జూపిన చాతుర్యం
అసాధారణమైనది.
డాక్టర్‌జీ తమ కార్యశక్తివల్లా నిష్టవల్లా దేశవ్యాప్తమైన ఈ మహాసంఘటన స్వరూపాన్ని ప్రత్యక్ష జగత్తులో రూపొందించి ప్రదర్శించారు. ఉపన్యాసాలవల్ల సంఘటన నిర్మింపబడదు. దానికై జీవంవున్న హృదయాలను ఒకమూసలో కరిగించాలి. ఒకేధ్యేయం కొరకు, ఒకే మార్గాన లక్షలాది యువకులను ఒక త్రాటిపై నడపాలి. సంఘ స్వయంసేవకుల్లో ఉన్న సోదరభావమూ, ఏకాభిప్రాయమూ మరోచోట కన్పించడం సాధ్యంకాదు. ఇది ఎలా సాధ్యమైనది ? పరమపూజనీయ డాక్టరీ సంపాదించిన పుణ్యమే దీనికి కారణమని నేను స్పష్టంగా అనగలను. ఈ పవిత్ర కార్యసిద్ధిని ఈ దేహంతో ఈ కన్నులతో చూడాలనే వాంఛ ఆయన హృదయంలో ఎంతో అధికంగా ఉందేది. కాని పరమేశ్వరుడు వేణు విధంగా భావించాడు. డాక్టర్‌జీ మనలను విడిచి వెళ్ళినా, మనకొక నిశ్చితమార్దాన్ని చూపి వెళ్ళారు. ఈ పనిని ఆయన అసంపూర్ణంగా విడిచి స్వర్గస్తులైనారు. అసంపూర్ణమైన ఆయన ఆశ లన్నిటిని సాధించడమే మన ప్రప్రథమ కర్తవ్యమనే విషయాన్ని మన మెన్నటికీ విస్మరింపకూడదు.
మనకు దుఃఖం కలగడం సహజమే. కాని ఆ దుఃఖాన్ని వివేకబుద్ధితో సహించి ఇకముందు ఈ కార్యం ఇతోధికంగా విజ్బంభింపచేయడం ఎలా అనే ఆలోచించాలి. ఇకముందు సంఘరూపంలోనే దాక్టర్‌జీ మనకు కన్పిస్తుంటారు. సంఘకార్యాన్ని వృద్ధిచేయడమే డాక్టర్‌జీని జీవింపచేయడం. ఈ బాధ్యత స్వపరభేదమూ, చిన్నాపెద్దా అనే వ్యత్యాసమూ లేకుండా స్వయంసేవకు లందరిపైనా ఉన్నది. అశ్రువులు రాల్బడంకాక, సంఘకార్యాన్ని వేయిరెట్లు అధికం చేయడమే దాక్టర్‌జీపట్ల మన భక్తివిశ్వాసాలను ప్రదర్శించేందుకు ఏకైకమార్గం. ఇదే మన మీనాడు నిశ్చయించు కోవాలి.
సంఘకార్యాన్నిగురించి అన్ని విధాలా ఆలోచిస్తూ ఉండేవారు కాబట్టి ఆయన ఇహలోకయాత్ర ముగించకముందే భవిష్యత్తుకై ఏర్పాట్లన్నీ చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘకార్యం “చాలకానువర్తి” కావడంవల్ల, “చాలకుని” ఆజ్ఞలు మనకు శిరోధార్యాలు. మరణానికి ఒక రోజు పూర్వం గత నెల 20వ తేదీన డాక్టర్‌జీ ఇకముందు సంఘకార్యభారాన్ని పరమ పూజనీయ మాధవరావ్ గోల్వల్మర్‌గారికి అప్పగించారు. ఆద్య సర్‌సంఘచాలక్ హోదాలో ఆయన తమ సర్వాధికారాలనూ పరమ పూజనీయ మాధవరావ్‌గారి స్వాధీనం చేశారు. మన ఆద్య సర్‌సంఘచాలక్‌గారి ఇచ్చానుసారం ఈనాటినుంచి పరమ పూజనీయ మాధవరావ్ సదాశివరావు గోళ్వల్మర్‌గారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి సర్‌సంఘచాలక్‌గా నియుక్తులైనారని నేను ప్రకటిస్తున్నాను. ఆయన మనకిక డాక్టర్‌జీ స్థానంలో ఉన్నారు. మన నూతన సర్‌సంఘచాలక్‌గారికి సాదరంగా ప్రప్రథమ ప్రణామాన్ని నే నర్పిస్తున్నాను.
వృద్ధమూర్తులు పూజనీయ అబాజీ హెడగేవార్‌గారి ఉపన్యాసం
రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని గురించి నేను చెప్పవలసింది ఏమీ లేదు. సంఘానికై ఒక కార్యపద్ధతిని డాక్టర్‌జీ మొదలే నిర్ణయించిపోయినారు. అందులో మార్చు చేయవలసిన అవసరమేమీ లేదని నా నమ్మకం. ఇకముందీకార్యం వేగంతో ఎలా పురోగమిస్తుందనే విషయాన్ని గురించే మనం ఆలోచించుకోవాలి. 250 సంవత్స రాలనుంచి అసంపూర్ణంగా పడివున్న కార్యాన్నే డాక్టర్‌జీ నిర్వహించ పూనుకున్నారు. కాని దురదృష్టంవల్ల ఆయనకూడా ఈ కార్యాన్ని అసంపూర్ణంగానే విడచివెళ్లారు. ఇక ఆ పనిని పూర్తిచేయవలసిన బాధ్యత మీమీద ఉన్నది. డాక్టర్‌జీ
ఈ భగవద్ధ్వజాన్ని, తమ జీవిత సర్వస్వాన్ని అర్పించి కూడబెట్టిన కష్టార్దిత సంపత్తి-సంఘాన్నీ మన కప్పగించారు.
ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఆరంభించారో ఒకసారి స్మరించుకోండి. ఎందరు వెక్కిరించినా, ఎందరు వ్యతిరేకించినా లెక్క చేయకుండా “హిందూరాష్టా మనే సిద్ధాంతాన్ని ఆయన ఉద్దాటించారు. “హిందూదేశం హిందువులదే” నని నిర్భయంగా గర్జించిన మొదటి వీరపురుషుడు మన డాక్టర్‌జీయే. ఈ ఆదర్శాన్ని డాక్టర్‌జీ మీ ముందు ఉంచారు. ఆదర్శంతోపాటు వేనవేలుగా ఈ ఆదర్శానికై పాటుబడే మిత్రులను కూడా ఇచ్చారు. కాబట్టి ఇక సంఘకార్యంలో ప్రవేశించండి. డాక్టర్‌జీ గతించారు. కాని దానికై దుఃఖించ నవసరం లేదు. ఆయన మరణించడం అసంభవం. మన దాక్టర్‌జీ అజరామరులు. ఆయన ఆత్మ అమృతం. మీ కార్యక్రమాభివృద్ధి చూసి ఆయన ఆనందిస్తారు. స్వర్గోకంనుంచే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కాని ఇంత వరకు శుష్మశబ్దాల వల్ల ఏ పని సఫలం కాలేదనే విషయాన్ని మాత్రం మరచిపోకండి.
సర్వశక్తులనూ ఉపయోగించి ప్రయత్నించాలి ఒక్కొక్క రక్తపుచుక్కా ఒడిపి సఫలతకై మూల్యాన్ని చెల్లించాలి. ఏనాడు మీ కార్యం ఫలిస్తుందో, ఆనాడే డాక్టర్‌జీ ఆత్మకు నిజమైన శాంతి లభిస్తుంది. ఈ శాంతి త్వరలో లభించడానికి ఎంతో వేగంగా పురోగమించండి. నా యీ చేతులతో పసికందును పెద్దచేసిన నా కేశవ్ నన్ను విడిచివెళ్ళాడు. ఐనా నేను దుఃఖించను. ఇలా హిందువులందరినీ పరమేశ్వరుడు అగ్నిపరీక్ష చేస్తున్నాడు.
నామమాత్రావశిష్టులుగా హిందువు లీ హిందూదేశంలో జీవించడము లేదని మన పౌరుషంద్వారా నిరూపించి ప్రపంచాని కంతకూ చూపాలి. ఇది దానంతట అది అయ్యేది కాదు. దీనికై మనం రక్తాన్ని నీటిగా ధారవోయాలి. సంఘంకొరకు డాక్టర్‌జీ ఎన్నో బాధలకు గురియైనారు. ఎన్నో రాత్రులు నిర్నిమేషంగా గడిపారు. తనశక్తి తన సర్వమూ సంఘంకొరకె వినియోగింపబడాలనే దృఢ నిశ్చయంతో ఆయన ప్రాపంచిక సుఖాలన్నిటినీ కాలదన్నారు. ఆయన మనోదార్ద్యత, సాహసమూ, కార్యనిష్థా మీ రెరుగనివి కావు. మన డాక్టర్ మనలను విడిచి వెళ్ళలేదని మాత్రం మీరు గుర్తుంచుకొండి. నేడు కూడా ఆయనను శ్రీ మాధవరావ్ గోళ్వల్మర్‌గారిలో చూడవచ్చును. వీరి ఆజ్ఞలన్నిటినీ మన డాక్టర్‌జీ ఆజ్ఞలుగానే భావించి శిరసావహించాలని మాత్రమే చివరకు నేను చెప్పదలచుకున్నాను.
సర్‌సంఘచాలక్ పూజనీయ గురూజీ ఉపన్యాసం
తరువాత నూతన సర్‌సంఘచాలక్‌గారైన పరమ పూజనీయ మాధవరావ్ గోళ్వల్మర్‌గారు తమ ప్రథమోపన్యాసంకావించారు. ఆయన ఇలా సంభాషించారు:
“నేడు మీముందు నిల్చి మాట్లాడడానికి మాటలు రావడంలేదు. నేడు మనమంతా ఆద్య సర్‌సంఘచాలక్‌గారికి శ్రద్ధాంజలి సమర్పించడానికి ఇక్కడ సమావేశం అయినామని అనుకుంటేనే శరీరం కంపిస్తున్నది. ఆయనకు (శ్రద్దాంజలి సమర్పించడం అంటే ఏమిటి ? తల్లి తన సంతానాన్ని ఎలా వాత్సల్యంతో చూస్తుందో అలాంటి వాత్సల్యాన్నే మనం డాక్టర్‌జీ సాహచర్యంలో అనుభవించాం. ఆయన మనను తల్లివలె ప్రేమించారు. ఆ ప్రేమను మనం శబ్దాలతో వర్ణించలేం. నిజంగాచూస్తే కోరికలు లేనివారే ప్రేమించ గలుగుతారు. మిగతావారు కేవలం శబ్దజాలాన్ని వ్యాపింపచేయడమే. “డాక్టర్‌జీని గురించి మీ అభిప్రాయ మేమిటి” అని కొన్ని రోజుల పూర్వం ఒకాయన నన్ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వడం అనవసరమని నా అభిప్రాయం. డాక్టర్‌జీ స్వయంగా ఒక మహత్తరాదర్శ్భ స్వరూపులైనారు. అలాంటి మహాపురుషుని పాదతలిని మోకరిల్లలేని వ్యక్తి ప్రపంచంలో ఏ పనీ చేయలేడు. ఆయనలో మాతృవాత్సల్యం, పితృబాధ్యత, గురుమూర్తుల శిక్షణ మూడూ సమన్వయమైనాయి. అలాంటి మహానుభావుని పూజిస్తూ నేను గర్విస్తున్నాను. నా కాయన యిష్టదైవమని అన్నా అందులో అతిశయోక్తి లేదు. డాక్టర్‌జీని పూజించడం వ్యక్తిని పూజించడం కాదు; ఒకవేళ ఎవరైనా అది “వ్యక్తిపూజ” అని అన్నా నాకు అది గర్వదాయకమే. ఆయన యెడల నాలో ఈ ఆదరాభిమానాలు ఒక్కనాటిలోనే పుట్టినవికావు. ఆయనకూడా ఒక పద్ధతిలో పనిచేసే ఒక నాయకుడని మొదట్లో అనుకునేవాణి. అది తప్ప డాక్టర్‌జీపట్ల నాలో మరో భావమే ఉండకపాొయ్యెది. కాని పదిపదిహేను రోజులు పూర్తిగా ఆయన సహచర్యంలో ఉండగానే “ఈ వ్యక్తిలో ఏదో ఒక అసామాన్యతవున్నదని గ్రహించ గలిగాను. ఎలాంటి సాహాయ్యమూ లేకున్నా ఇంత ప్రచండ సంఘటన కార్యాన్ని నిర్మించగలవ్యక్తి నిజంగా మహానుభావుడే. అందుకే ఆయనను వ్యక్తిగా పూజించడానికి గూడా నేను సంకోచించను. ధూపదీపాలతో పూజించడం అంత శ్రేష్టమైనదికాదు, ఏ వ్యక్తినైతే పూజించదలచుకున్నామో ఆ వ్యక్తివలె మనంకూడా కావడానికి యత్నించడమే పూజించడానికి చక్కని మార్గం.
“శివో భూత్వా శివం యజేత్” ఇదే మన ధర్మంలోవున్న విశిష్టత; ఇలాంటి పూజనే మనం చేయాలి డాక్టర్‌జీ మనకిచ్చిన ఈ సంపదనాధారంగా మనం పురోగమించాలి. రాష్ట్రం కొరకు ప్రతి రక్తకణంలోనూ ఒక అపారమైన ఆవేదన ఉండాలి.
రాష్ట్రం అంటే ఎంతో మహత్తరమైన ఆత్మీయభావం ఉండాలి. భావనావేశంతో బలి వేదికపై మరణించి 'హుతాత్ము'లవడం సామాన్య వ్యక్తులకు కూడా సులభమే. కాని ప్రతి నిత్యం శరీరాన్ని కరిగించి, ప్రతినిత్యమూ తమను తామే జ్వలింపచేసుకుంటూ పురోగమించడం అవతార పురుషులకే సాధ్యమవుతుంది. మన సౌభాగ్యంవల్ల అలాంటి మహావ్యక్తి మనలో జన్మించారు.
పరమ పూజనీయ డాక్టర్‌జీ ఆదేశాన్ని ప్రామాణికంగా నెరవేర్చినప్పుడే- వారీ సంఘటన కార్యాన్ని ఏస్థాయిలో విడిచి దివంగతులైనారో ఆ స్థాయినుంచి పురోగమింపజేసినప్పుడే - మనం మన కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నామని అనగలం. ఆయన దయవల్లా, ఆయన బలిదానంవల్లా, ఈ పని తప్పక విజయాన్నిసాధిస్తుంది.
15 సంవత్సరాలు దాక్టర్‌జీ కృషిచేస్తే కేవలం ఒక లక్షమంది స్వయంసేవకులు మాత్రమే సమైక్యమైనారు ఇంతకు మించి కాలేదు. ఈ విషయంలో అనేకులు అనేక విధాలుగా మాట్లాడుతూంటారు. “దాక్టర్‌జీ వ్యక్తిత్వమే ఈ కార్యానికి సరిపోలే”దని కూడా అనడానికి కొందరు సాహసిస్తున్నారు. కాని ఆయన మహత్తులో న్యూనత అనేది లేనేలేదు. ఆయన అనుచరులమై పనిచేయడానికి యోగ్యత మనకే లేకపోయింది. రాయిరప్పల వలె పడివున్న హిందువులలో ఒక లక్షమంది సజీవ మూర్తులను సృష్టించడమే ఆయన గొప్పదనానికి ఏకైక చిహ్నం. నేటివరకూ “సంఘటన కావాలి, కావాలి” అని కేకలువేసే వ్యక్తులు చాలామంది జన్మించారు. కాని నిర్మలమైన మనస్సులు కలిగినవారిని ఎవరైనా సమైక్యపరచి సంఘటనను నిర్మించగలిగారా ? ఒక్కొక్క స్వయం సేవకునికై తపిస్తూ, కన్నీరు కార్చే వేలకొలది హృదయాలను ఎవరైనా సృష్టించగలిగారా ?డాక్టర్‌జీ మాత్రమే ఈ అసంభవాన్ని సంభవంచేసి చూపగలిగారు.
డాక్టర్‌జీని పూజించడానికి మనమంతా ఇక్కడ శ్రద్ధాభక్తులతో సమావేశమైనాం. సంకుచిత వ్యక్తిత్వాన్ని విసర్జించి, ఈ సంఘటన కార్యంలో లీనమవడమే ఆ మహామహుని పూజించగల ఏకైకమార్గం. ఈ సంఘటనను ఏ మహాధ్యేయ ప్రాప్తికై డాక్టర్‌జీ ప్రారంభించారో, ఆ ధ్యేయాన్ని సాధించడానికి మన మన స్థానాలలో సంఘ కార్యానికై కటిబద్ధులమైనప్పుదే డాక్టర్‌జీని పూజించడానికి అర్హులమవుతాం. డాక్టర్‌జీ నాలాంటి సామాన్య వ్యక్తిపై యీ ఘనతర బాధ్యతను వుంచారు. ఆయన నన్ను ఎన్నుకోవడం చూస్తే రామకృష్ణ పరమహంస జీవితంలో నాకొక ఉదాహరణ జ్ఞప్తికి వస్తూన్నది.
పరమహంస శిష్యుల్లో ఒక ధనవంతుని ఇంట ఒక చిన్నపిల్లవాడు ఉంటూ ఉందేవాడు. అతడు బహు మూర్తుడు. కాని అతడు పూజకొజకు శ్రీరామకృష్ణునికి రోజూ పూలు తెచ్చి ఇస్తూ వుండేవాడు. రామకృష్ణు డాబాలుణ్సి తనవద్దనే వుంచుకొని “*ఆ, ఆలు నేర్పడానికి ప్రయత్నించారు. ఆరునెలలు తల టబ్రద్దలుకొట్టుకున్నా “ఆ ఆ”లు రాని ఆ “మూర్చుడే” ఆయన స్వర్గస్తులైన తరువాత ఆయన ఆశీర్వాద ప్రభావంవల్ల ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానాలు ఉపన్యాసాలూ చేస్తూందేవాడు. పెద్ద పెద్ద పండితులకు కూడా విజ్ఞాన బీక్ష పెట్టినాడు. మహాపురుషులు స్పర్శతోనే ఎంతటి అయోగ్యుణ్ణయినా యోగ్యుణ్ణిగా చేసి మహాపదవిలో విరాజిల్లచేస్తారు. డాక్టర్‌జీ ఆశీస్సులవల్ల నాకూ అలాంటి యోగ్యతే లభిస్తుందని నా విశ్వాసం. సర్ సంఘచాలకత్వంవంటి అనూహ్యమైన భారాన్ని నాకు అప్పగించారు. కాని ఇది విక్రమాదిత్యుని సింహపీఠం. దీనిపై కూర్చున్న గొల్ల పిల్లవాడుకూడా సత్యన్యాయాలనే ఉద్దాటిస్తాడు. నేడీ పదవిలో కూర్చునే అవకాశం నాలాంటి సామాన్యునికి లభించింది. కాని డాక్టర్‌జీ నా నోట యోగ్యవిషయాలనే ఉచ్చరింపచేస్తారు. ఆ మహామహుని ప్రతాపంవల్ల నావల్లకూడా ఔచిత్యమే జరుగుతుం దనడానికి నేను సందేహించను.
పొరపాటున తప్పులు జరిగితే దానికి బాధుణ్లి నేనే. ఇక సంపూర్ణ (శ్రద్ధతో సంఘ కార్యానికి పూనుకోవాలి. మునుపటి పట్టుదలతో, అంతకన్న అనేకరెట్లు అధిగవేగంతో ఈ సంఘ కార్యాన్ని పురోగమింపచేయాలి. ఇంత సుదృథఢ సంఘటనను దాక్టర్‌జీ మనకప్పగించి వెళ్ళారు. ఇప్పుడు అనేకమంది ఉపదేశకులు మనకు ఉపదేశాలివ్వడానికి ముందుకు దుముకుతూ వుంటారు. కాని, ప్రస్తుతమున్న విభిన్న భేదభావాల సంఘర్షణలో పడి మనుగడనే కోల్పోయేటంత బలహీనమైన సంఘటనను మన డదాక్టర్‌జీ మనకు అప్పగించలేదని అలా-ఉపదేశించే వారందరికీ నమ్రతాపూర్వకంగా స్న స్పష్టీకరించ దలచుకున్నాను. ఈ సంఘటన ఒక అభేద్యమైన దుర్గంలాంటిది. ఈ దుర్గాన్ని భేదించాలని ప్రయత్నించేవారే నష్టానికి గురి అవుతారు. అంత సుదృఢమైన దుర్గనిర్మాణం డాక్టర్‌జీ చేశారు. మన మార్తాన్ని కూడా వారు నిశ్చయించి ఉంచారు. మనం ఆ మార్గంలోనే పురోగమించ నిశ్చయించుకున్నాం. ఈ మార్గంవల్లనే మన రాష్టం వరమ వైభవాన్ని పొందగలుగుతుంది. ఈ మార్గంలోనే హిందూజాతి తన పూర్వ సౌభాగ్యాన్ని సంపాదించుకుంటుంది. వ్యతిరేకతను లెక్కచేయకుండా, అభిప్రాయ భేదాలకులోనుకాకుండా మన మీ మార్గంలోనే నిశ్చలంగా నిలవాలి. దీనికై నిరంతరం హృదయాంతరాళాలలో సంఘ జ్యోతిని ప్రదీప్తంగా వుంచుతూ, మనస్సును సంఘకార్యానికి ప్రేరేపిస్తూ అహర్నిశలూ పనిచేయాలి. మీ అందరి సహాయంవల్లనూ, తోడ్పాటు వల్లనూ డాక్టర్‌జీ తలపెట్టిన యీ శుభకార్యం తప్పక విజయాన్ని సాధింపగలుగుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను”
చివరకు పరమ పూజనీయ డాక్టర్‌జీకి సమ్మానసూచకంగా ప్రణామం అర్చింపబడిన తరువాత యీ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో నాగపూర్ స్వయం సేవకులందరూ అపార సంఖ్యలో పాల్గొన్నారు.