కేథలిక్ చర్చ్‌ను కదుపుతున్న మత గురువులు
ఫ్రాన్స్ కేథలిక్ చర్చ్ ఘనకార్యం వెల్లడైన తరువాత ఇతర దేశాలలో కూడా ఏం జరిగిందో మళ్లీ వెలుగులోకి వచ్చింది. 1950-2020 మధ్య కేథలిక్ మత గురువులు, ఇతర చర్చ్ సిబ్బంది జరిపిన లైంగిక అత్యాచారాల గురించిన సమాచారమిది. ఇలాంటి దారుణాలు ఫ్రాన్స్ కేథలిక్ చర్చ్‌కే పరిమితమనుకుంటే, మిగిలిన పాశ్చాత్య దేశాలలో, అలా అనుకుంటే భారత్‌లోని క్రైస్తవ మత గురువుల ఘనత ప్రపంచానికి తెలియదు. ఆ లోటు ఇప్పుడు తీరుతోంది. ప్రపంచంలో చాలా దేశాలలో చర్చ్‌లు లైంగిక అత్యాచారాలకు సంబంధించి తీవ్ర ఆరోపణ లను ఎదుర్కొంటున్నవే. 1990 నాటికే ఇవన్నీ చర్చ్ పెద్దలకు తెలుసు కూడా. వేలాది ఉదంతాలు, డజన్ల కొద్దీ దేశాలలో జరిగినట్టు తెలియవచ్చింది. అలాంటి దేశాలలో అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐర్లాండ్, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలెండ్ ఉన్నాయి.
ఇలాంటి ఘోరాన్ని అరికట్టే విషయంలో వాటికన్ (కేథలిక్ ప్రపంచ పీఠం) స్పందన దోషభూయిష్టంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతకు ముందు పోప్‌గా పనిచేసిన బెనెడిక్ట్ ఈ పరిస్థితిని సరిదిద్దడానికి సంస్కరణలు తెచ్చేందుకు యత్నించినా విఫల మయ్యారు. ఇది చాలు- పాస్టర్ల కామదాహం ఏ స్థాయిలలో ఉందో చెప్పడానికి. బిషప్‌ల మీద వచ్చిన లైంగికారోపణల నిగ్గు తేల్చాలని బెనెడిక్ట్ యత్నించి కూడా విఫలమయ్యారు. ఆధారాలన్నీ బిషప్‌లు తుడిచేశారు. 2013లో పోప్ ఫ్రాన్సిస్ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ అన్యాయం మీద నిర్దిష్ట చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 2018లో ఆయన చర్చ్‌లకు లేఖలు రాస్తూ, లైంగిక అత్యాచారాలను ఖండించడమే కాదు, ఆధారాలు లేకుండా చేస్తున్న నేరపూరిత మనస్తత్వం గురించి ప్రస్తావించారు. ఇన్ని చర్యలు తీసుకునే యత్నం చేసినప్పటికి పోప్ ఫ్రాన్సిస్ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణ ఉంది. చిలీయిన్ బిషప్ మీద వచ్చిన ఇలాంటి ఆరోపణలను ఆయన పాక్షికమైనవని ప్రకటించారు. తరువాత తాను తప్పు చేశానని ఫ్రాన్సిస్ చెప్పుకోవలసి వచ్చింది. అయితే మరొకసారి తప్పిదం చేయరాదన్న సంకల్పం ఏదీ ఆయన వ్యవహార శైలిలో కనిపించలేదు. ఎలాగంటే, చర్చ్‌లలో జరుగుతున్న లైంగిక అత్యాచారాల ఉదంతాలను కప్పిపుచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ, తమ పదవుల నుంచి వైదొలగుతూ పలువురు జర్మన్ బిషప్‌లు ఇచ్చిన రాజీనామాలను నిరాకరించారు. ఇది ఈ సెప్టెంబర్ నెలలోనే జరగడం విశేషం.
లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద దర్యాప్తు చేసే అధికారం జాతీయ చర్చ్‌కు ఉంది. ఇలాంటి అధికారంతోనే ఫ్రాన్స్‌లో దర్యాప్తు జరిగింది. కొన్నిదేశాలలో ప్రభుత్వాలు కూడా ఈ ఉదంతాల మీద దర్యాప్తునకు పూనుకుంటున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక దర్యాప్తును జరిపించింది. దాని ప్రకారం 1950-2017 మధ్య దేశంలోని ఏడు శాతం కేథలిక్ మత గురువులు లైంగిక అత్యాచారాలకు పాల్పడినవారే. ఈ దర్యాప్తు సంఘమే చాలా చక్కని వాస్తవికమైన సిఫారసు కూడా చేసింది. వాటికన్‌తో మాట్లాడి మత గురువులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలన్న ఆ నిబంధన కాస్తా తొలగించడం మంచిది అని కుండబద్దలు కొట్టింది. అమెరికాలో పెన్సిల్వేనియా కేథలిక్ చర్చ్‌లో ఇలాంటి దర్యాప్తు జరిగింది. ఏడు దశాబ్దాలలో వందలాది మంది మత గురువులు కనీసం వేయి మంది బాలబాలికల మీద అత్యాచారాలకు పాల్పడ్డారని ఆ సంఘం తేల్చింది. ఇక్కడ బాధితులు కోర్టులకు వెళ్లి చర్చ్ నుంచి బిలియన్‌ల కొద్దీ నష్టపరిహారం కూడా పొందారు. ఉత్తర ఐర్లాండ్‌లో ఈ సెప్టెంబర్ మాసంలోనే ఇలాంటి నేరానికే తొలిసారిగా చర్చ్ నష్టపరిహారం చెల్లించింది. అన్నట్టు ఫ్రెంచ్ దర్యాప్తు సంఘం కూడా బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరింది. 2019లో జర్మన్ చర్చ్ ఈ అంశం మీద ప్రత్యేక సమావేశాలే నిర్వహించింది.
అభివృద్ధి చెందిన దేశాలలో ఇలాంటి ఉదంతాలు బయటపడుతున్నా పేద దేశాలలో బాధితులకు ఇలాంటి వెసులుబాటు లేదు. అసలు ఆ దేశాలలో జరిగిన కేసులను అంచనా వేయడం కూడా కష్టమన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే అక్కడ చర్చ్ చాలా పలుకుబడి కలిగి ఉంటుంది. ఇటలీలో అంటే వాటికన్ సిటీ ఉన్న దేశంలోనే వెరోనా మూగ చెవిటి బాల బాలికల పాఠశాల ఇందుకు మినహాయింపు కాకపోవడమే విషాదం. ఈ పాఠశాలకు చెందిన పలువురు మాజీ విద్యార్థులు తమ మీద జరిగిన అత్యాచారాల గురించి 2009లో ఫిర్యాదు చేశారు. తమకు పాఠాలు చెప్పినవారే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారని ఆ పిల్లల ఫిర్యాదు సారాంశం. వీటి మీద ఇంతవరకు చర్యలు లేవు. కానీ అర్జంటైనాలో మాత్రం ఇదే ఆరోపణ మీద కొందరు మాజీ ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ నాటకాన్ని అతడు తన ఇద్దరు కుమారులకు మొదట చదివి వినిపించాడు. తరువాత ఫ్రాన్స్‌లోని చాలా నాటకశాలలో ప్రదర్శించాడు కూడా. ఫ్రాన్స్ కేథలిక్ టెలివిజన్ నెట్‌వర్క్ (కేటీఓ) కూడా దీనిని ప్రసారం చేసింది. ఎందుకంటే తన లాగే తన కొడుకులు చర్చ్ బాధితులు కాకూడదని హెచ్చరించడానికే.
(ది ఎకనమిస్ట్ అక్టోబర్ 11, 2021 నుంచి) - జాగృతి సౌజన్యంతో..