బంగ్లాదేశ్ లోని నౌఖాలి జిల్లాలోని ఇస్కాన్ దేవాలయాన్ని అక్కడి ముస్లిములు కొందరు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటన పూర్వాపరాలను పరిశీలించిన వారు సంఘటన జరిగిన తీరుపై ‘హవ్వ’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత దుర్మార్గమా? అంటూ నివ్వెరపోతున్నారు.
ఇస్కాన్ దేవాలయ నిర్వాహకులు గత రంజాన్ పండుగ సందర్భంగా స్థానిక ముస్లింలను దేవాలయానికి పిలిచి వారికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇస్కాన్ భక్తులే స్వయంగా వారికి సగౌరవంగా వడ్డించారు. వచ్చినవారు సుష్టుగా భోంచేసి వెళ్లారు.
వెళ్లిన వారు ఊరికే ఉంటారా? ఎంతో సుందరంగా ఉన్న ఆ దేవాలయ విధ్వంసానికి పథక రచన చేశారు.
ఇప్పుడు దసరా ఉత్సవాల సందర్భంగా దేవాలయంపై దాడికి తెగబడ్డారు. సుమారు 200 మందికి పైగా దుండగులు దాడిలో పాల్గొన్నారు. ఈ దాడిలో ముగ్గురు భక్తులు మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు.
జరిగిన ఘటనపై భారత్ లో సైతం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. “పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుంది” అన్న తీరుగా పిలిచి భోజనం పెట్టిన పాపానికి ప్లాన్ చేసి మరీ దేవాలయాన్ని ధ్వంసం చేశార”ని కొందరు భక్తులు వాపోతున్నారు. మన సంప్రదాయం ప్రకారం మనం పిలిచి భోజనాలు పెట్టాం. వారి సంప్రదాయం ప్రకారం వారు ధ్వంసం చేశారు.” అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ తరహా పోస్టులు వైరల్ అవుతున్నాయి.
హిందువుల అతి పరమత సహనమే ప్రపంచవ్యాప్తంగా హిందువుల కొంప ముంచుతోందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు బంగ్లాదేశ్ లో నిత్యమూ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసి కూడా అందుకు కారకులైన వర్గానికి చెందిన వారిని పిలిచి భోజనాలు పెట్టటం వెఱ్ఱితనానికి పరాకాష్ఠ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చూసైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు బుద్ధి తెచ్చుకోవాలని, లౌకిక వాదం పేరుతో అందరినీ అక్కున చేర్చుకుని అసలుకే మోసం తెచ్చుకోరాదని, హిందూ సమాజం జాగరూకతతో వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.
.....విశ్వసంవాద కేంద్రము